ముంబై: బంగారం ధరలు ఈ వారంలో వరుసగా మూడో రోజు పెరిగాయి. నిన్న దాదాపు రూ.500 పెరిగిన పసిడి, నేడు (డిసెంబర్ 16, బుధవారం) ప్రారంభ సెషన్లో రూ.100కు పైగా పెరిగింది. ఆల్ టైమ్ గరిష్టం రూ.56,200తో రూ.6700 వరకు తక్కువగా ఉంది. ఈ నెల ప్రారంభంలో రూ.48,000 దిగువకు వచ్చిన పసిడి ధరలు, ఆ తర్వాత రూ.50వేలను దాటాయి. మళ్ళీ తగ్గినట్లే తగ్గి రూ.50,000 దిశగా కదులుతోంది.

రూ.50వేల దిశగా బంగారం
ఫిబ్రవరి గోల్డ్ ఫ్యూచర్స్ నేడు ఉదయం గం.10.15 సమయానికి రూ.107.00 (0.22%) పెరిగి రూ.49,550.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.49,510.00 వద్ద ప్రారంభమై, రూ.49,626.00 వద్ద గరిష్టాన్ని, రూ.49,510.00 వద్ద కనిష్టాన్ని తాకింది. గోల్డ్ ఫ్యూచర్స్ మళ్లీ రూ.50,000 దిశగా వెళ్తోంది.
ఏప్రిల్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.204.00 (0.41%) పెరిగి రూ.49666.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.49,666.00 వద్ద ప్రారంభమై, రూ.49,666.00 వద్ద గరిష్టాన్ని, రూ.49,666.00 వద్ద కనిష్టాన్ని తాకింది.
బంగారం రూ.50,000 దిశగా వెళ్తున్నప్పటికీ రూ.49,900 వద్ద నిరోధకతను ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయి. మద్దతు ధర రూ.49,220.

వెండి ధరలు జంప్
వెండి ధరలు కూడా పెరిగాయి. నిన్న రూ.1000కి పైగా పెరిగిన వెండి నేడు ప్రారంభ సెషన్లో రూ.300కు పైగా ఎగిసింది. మార్చి సిల్వర్ ఫ్యూచర్స్ రూ.324.00 (0.50%) వద్ద ఎగిసి రూ.65177.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.65,000.00 వద్ద ప్రారంభమై, రూ.65,324.00 వద్ద గరిష్టాన్ని, రూ.65,000.00 వద్ద కనిష్టాన్ని తాకింది.
మే సిల్వర్ ఫ్యూచర్స్ రూ.430.00 (0.66%) ఎగిసి రూ.66052.00 వద్ద క్లోజ్ అయింది. రూ.66,031.00 ప్రారంభమైన ధర, రూ.66,097.00 వద్ద గరిష్టాన్ని, రూ.66,029.00 వద్ద కనిష్టాన్ని తాకింది.

అంతర్జాతీయ మార్కెట్లో..
అంతర్జాతీయ మార్కెట్లోను గోల్డ్ ఫ్యూచర్స్ ఎగిసింది. ఔన్స్ గోల్డ్ ఫ్యూచర్స్ 5.15 (0.28%) డాలర్లు పెరిగి 1,860.45 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. నేటి సెషన్లో 1,854.55 - 1,861.95 డాలర్ల మధ్య కదలాడింది. ఏడాదిలో 23.18% పెరిగింది.
వెండి ఫ్యూచర్స్ ఔన్స్ 0.171 (0.69%) డాలర్లు పెరిగి 24.815 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. నేటి సెషన్లో 24.578-24.867 డాలర్ల మధ్య ట్రేడ్ అయింది. ఏడాదిలో వెండి 42.58% పెరిగింది.
More From GoodReturns

బంగారం, వెండి ధరలపై సస్పెన్స్.. ఆర్బీఐ నిర్ణయంతో రేట్లు తగ్గుతాయా..పెరుగుతాయా..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంతకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 2, గురువారం ధరలు ఇవే..

బంగారం, వెండి పెట్టుబడిదారులకు బిగ్ అలర్ట్.. సెబీ కొత్త నియమాలు తెలుసుకుని కొనుగోలుకు వెళ్లండి..

బంగారం ధర ఈ వారం ఎంత పెరిగిందో తెలుసా.. రూపాయి పైనే పెట్టుబడిదారుల ఆశలు.. ఎందుకంటే..

బంగారం ధరలకు కొత్త సవాల్.. బిట్ కాయిన్ ఈటీఎఫ్‌ల ముందు వేస్ట్ అంటున్న నిపుణులు.. కారణం ఏంటంటే..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన వెండి, పసిడి ధరలు,..పుంజుకున్న రూపాయి

Today Gold Silver Rate Live: భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు

Gold Price: భారీ రికార్డుల నుంచి దిగివచ్చిన పసిడి! లేటెస్ట్ గోల్డ్ రేట్లు ఇవే..!

Gold silver: బంగారం, వెండి కొనాలా? వద్దా? మార్కెట్లో వింత పరిస్థితి.. నిపుణుల సలహా ఇదే!

Today Gold Silver Rate Live: కుప్పకూలిన బంగారం, వెండి ధరలు..కొంపలు ముంచుతున్న ట్రంప్ నిర్ణయాలు

Gold silver: బంగారం, వెండి కొనేవారికి అలర్ట్.. ఈ వారం ధరలు ఎలా ఉండబోతున్నాయి? నిపుణుల అంచనా ఇదే!



Click it and Unblock the Notifications