బంగారం ధరలు నేడు (మే 5, బుధవారం) దాదాపు స్థిరంగా ఉన్నాయి. ఇటీవల రూ.48వేల స్థాయికి చేరుకున్న గోల్డ్ ఫ్యూచర్స్ నిన్న రూ.47,000 దిగువకు వచ్చింది. నేడు కూడా అదే స్థాయిలో కొనసాగుతోంది. వెండి ఫ్యూచర్ రూ.69 వేలకు పైన కదలాడుతోంది. అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ధరలు పెరిగినప్పటికీ అతి స్వల్పం మాత్రమే. ఔన్స్ గోల్డ్ 1775 డాలర్ల వద్ద ఉంది.
వెండి 26.500 డాలర్ల దిగువన ఉంది. దేశీయ ఫ్యూచర్ మార్కెట్లో ఆల్ టైమ్ గరిష్టం రూ.56200తో పోలిస్తే బంగారం రూ.9300 తక్కువగా ఉంది. బంగారం రూ.47,300 వద్ద నిరోధకం ఎదుర్కోవచ్చునని మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు.

నేటి బంగారం ధర
దేశీయ ఫ్యూచర్ మార్కెట్ మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్(MCX)లో 10 గ్రాముల జూన్ గోల్డ్ ఫ్యూచర్స్ నేడు మధ్యాహ్నం సెషన్లో రూ.19.00 (0.04%) పెరిగి రూ.46890.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.46,979.00 వద్ద ప్రారంభమైన ధర, రూ.47,046.00 గరిష్టాన్ని, రూ.46,836.00 కనిష్టాన్ని తాకింది. ఆగస్ట్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.23.00 (0.05%) పెరిగి రూ.47220.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.47,338.00 వద్ద ప్రారంభమై, రూ.47,430.00 గరిష్టాన్ని, రూ.47,175.00 వద్ద కనిష్టాన్ని తాకింది.

రూ.69వేల పైకి వెండి
వెండి ఫ్యూచర్ ధరలు నేడు స్వల్పంగా తగ్గాయి. మే సిల్వర్ ఫ్యూచర్స్ నేడు మధ్యాహ్నం సెషన్లో రూ.145.00 (-0.21%) తగ్గి రూ.69504.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.70,066.00 వద్ద ప్రారంభమై, రూ.70,138.00 గరిష్టాన్ని, రూ.69,410.00 వద్ద కనిష్టాన్ని తాకింది. జూలై సిల్వర్ ఫ్యూచర్స్ రూ.22.00 (0.03%) పెరిగి రూ.70692.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.71,048.00 ప్రారంభమైన ధర, రూ.71,119.00 వద్ద గరిష్టాన్ని, రూ.70,526.00 కనిష్టాన్ని తాకింది.

అంతర్జాతీయ మార్కెట్లో...
అంతర్జాతీయ ఫ్యూచర్ మార్కెట్లో బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. 1775 డాలర్లకు దిగువన పడిపోయింది. అంతర్జాతీయ మార్కెట్లో గోల్డ్ ఫ్యూచర్స్ నేడు 1.15 (0.06%) డాలర్లు పెరిగి 1,774.85 డాలర్ల వద్ద కదలాడింది. నేటి సెషన్లో 1,770.35 - 1,798.95 డాలర్ల మధ్య కదలాడింది. సిల్వర్ ఫ్యూచర్స్ స్వల్పంగా తగ్గింది. 0.175 (0.66%) డాలర్లు తగ్గి 26.383 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. నేటి సెషన్లో 26.168 - 27.233 డాలర్ల మధ్య కదలాడింది.
More From GoodReturns

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధర పెరుగుదలపై షాకింగ్ న్యూస్.. ఏప్రిల్ నెలలో ఈ రేటును దాటడం ఖాయం అంటున్న నిపుణులు..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

Silver: వెండి ధర కిలో రూ.2 లక్షల కంటే కిందకు పడిపోదా? నిపుణులు ఏమంటున్నారు?

బంగారం, వెండి ధరలు తగ్గాయని సంబరాలు వద్దు.. పసిడి పెరుగుదలపై షాకింగ్ న్యూస్ చెప్పిన బ్యాంకింగ్ దిగ్గజం..

బంగారం ధరలు పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎంతకు చేరిందంటే.. మార్చి 31, మంగళవారం ధరలు ఇవే..

Gold: పసిడి ప్రియులకు అలర్ట్! 1980 తర్వాత మళ్లీ ఇప్పుడే భారీ లాభాలు.. సిద్ధంగా ఉండండి!

Today Gold Silver Rate Live: కుప్పకూలిన బంగారం, వెండి ధరలు..కొంపలు ముంచుతున్న ట్రంప్ నిర్ణయాలు

బంగారం, వెండి ధరలు భారీగా తగ్గాలంటే రూపాయి బలపడాల్సిందే.. ఆర్థిక నిపుణులు ఏమంటున్నారంటే..

Gold: ఐసీఐసీఐ బ్యాంక్లో భారీ గోల్డ్ లోన్ కుంభకోణం! నకిలీ బంగారంతో రూ. 23 కోట్లు మాయం!

ఇరాన్ యుద్దం దెబ్బ.. బంగారం కొనడం మానేసి అమ్మేసుకుంటున్న కేంద్ర బ్యాంకులు.. కారణం ఏంటంటే..



Click it and Unblock the Notifications