బంగారం ధరలు నేడు(గురువారం, 10 ఫిబ్రవరి) స్థిరంగా ఉన్నాయి. దేశీయ ఫ్యూచర్ మార్కెట్ మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్(MCX), అంతర్జాతీయ ఫ్యూచర్ మార్కెట్ కామెక్స్‌లో గోల్డ్ ఫ్యూచర్స్ అతి స్వల్ప పెరుగుదల లేదా తగ్గుదలతో ట్రేడ్ అవుతున్నాయి. నేడు ఏప్రిల్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.21 పెరిగి రూ.48,681 వద్ద, జూన్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.8 తగ్గి రూ.48,815 వద్ద ట్రేడ్ అవుతోంది. అంతర్జాతీయ మార్కెట్ కామెక్స్‌లో 1.55 డాలర్లు క్షీణించి రూ.1835 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. బంగారం ఏడాదిలో 0.76 శాతం క్షీణించింది.
బంగారం ధరలు నిన్న మాత్రం భారీగా పెరిగాయి. ఏప్రిల్ గోల్డ్ ఫ్యూచర్స్ క్రితం సెషన్‌లో రూ.241 పెరిగి రూ.48,670 వద్ద, జూన్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.261 ఎగిసి రూ.48,838 వద్ద ముగిసింది. మార్చి సిల్వర్ ఫ్యూచర్స్ రూ.357 పెరిగి రూ.62,724 వద్ద, మే సిల్వర్ ఫ్యూచర్స్ రూ.346 పెరిగి రూ.63,509 వద్ద ముగిసింది.

రెండు వారాల గరిష్టం
బంగారం ధరలు ప్రస్తుతం రెండు వారాల గరిష్టాన్ని తాకాయి. సూచీల ఊగిసలాట, ఈటీఎఫ్ ఇన్-ఫ్లో, అంతర్జాతీయ సరిహద్దు ఉద్రిక్తతలు, ద్రవ్యోల్భణం వంటి ఆందోళనలు పసిడి ధరల పైన ప్రభావం చూపుతాయి. టెన్ ఇయర్ బాండ్ యీల్డ్స్ కూడా రెండేళ్ల గరిష్టాన్ని తాకాయి. ఇటీవల ఫెడ్ వడ్డీ రేట్ల పెంపు వార్తలతో బంగారం ధరలు పడిపోయాయి. కానీ అంతలోనే ద్రవ్యోల్భణం వంటి వివిధ ఆందోళనలు పసిడి పరుగుకు కారణం అయ్యాయి.

ఆ స్థాయికే పరిమితం
అమెరికా యాన్యువలైజ్డ్ కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్(CPI) జనవరి నెలలో 7.3 శాతంగా నమోదయింది. అంతకుముందు దీనిని 7 శాతంగా అంచనా వేశారు. ద్రవ్యోల్భణం 7 శాతం కంటే పైకి పెరగడంతో ఇది నలభై ఏళ్ల గరిష్టానికి చేరుకుంది. గోల్డ్ ఫ్యూచర్స్ ఈ వారం పెరిగినప్పటికీ రూ.49,000కు దిగువనే ముగిసే అవకాశాలు కనిపిస్తున్నాయని బులియన్ మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లోను 1850 డాలర్లు క్రాస్ చేసే అవకాశాలు లేవంటున్నారు.

సిల్వర్ ఫ్యూచర్ ధరలు
వెండి ధరలు నేడు కూడా స్వల్పంగా పెరిగాయి. మార్చి సిల్వర్ ఫ్యూచర్స్ రూ.180 పెరిగి రూ.62,868 వద్ద, మే సిల్వర్ ఫ్యూచర్స్ రూ.242 పెరిగి రూ.63,743 వద్ద ట్రేడ్ అయింది. కామెక్స్‌లో సిల్వర్ ఫ్యూచర్స్ 0.039 డాలర్లు లేదా 0.17 శాతం ఎగిసి 23.380 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. ఏడాదిలో సిల్వర్ ఫ్యూచర్స్ 15.33 శాతం క్షీణించింది.


Click it and Unblock the Notifications