Gold Price Today: రూ.48,000 దాటిన బంగారం ధరలు
నిన్న భారీగా పెరిగిన బంగారం ధరలు నేడు (మంగళవారం 3, ఆగస్ట్) ప్రారంభ సెషన్‌లో దాదాపు స్థిరంగా ఉన్నాయి. గోల్డ్ ఫ్యూచర్స్ ధరలు నిన్నటి సెషన్‌లో రూ.48,000 దాటాయి. నేడు ఉదయం ఆగస్ట్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.85 పెరిగి రూ.48,150 సమీపానికి చేరుకుంది. అక్టోబర్ గోల్డ్ ఫ్యూచర్స్ మాత్రం స్వల్ప క్షీణతను నమోదు చేసింది. రూ.162 తగ్గి రూ.47,924 వద్ద ట్రేడ్ అయింది. నిన్నటి సెషన్‌లో ఆగస్ట్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.284 ఎగిసి రూ.48,000 పైకి, అక్టోబర్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.49 లాభపడి రూ.48,050 వద్ద క్లోజ్ అయ్యాయి.
వెండి ధరలు నిన్న దాదాపు స్థిరంగా ఉన్నాయి. సిల్వర్ ఫ్యూచర్స్ సెప్టెంబర్ రూ.33 ఎగిసి రూ.67,880 వద్ద, డిసెంబర్ సిల్వర్ ఫ్యూచర్స్ రూ.63 లాభపడి రూ.68,740 వద్ద ట్రేడ్ అయింది. నేటి సెషన్లో వెండి ధరలు తగ్గాయి. సెప్టెంబర్ సిల్వర్ ఫ్యూచర్స్ రూ.380 క్షీణించి రూ.67,510 వద్ద, డిసెంబర్ సిల్వర్ ఫ్యూచర్స్ రూ.320 తగ్గి రూ.68,430 వద్ద ట్రేడ్ అయింది. అంతర్జాతీయ మార్కెట్లో నిన్న గోల్డ్ ఫ్యూచర్స్ 1820 డాలర్లు క్రాస్ చేశాయి. నేడు ప్రారంభ సెషన్లో మాత్రం స్వల్పంగా తగ్గాయి. గోల్డ్ ఫ్యూచర్స్ 8 డాలర్లకు పైగా క్షీణించి 1814 డాలర్లు వద్ద ట్రేడ్ అయింది. సిల్వర్ ఫ్యూచర్స్ నిన్న 25 డాలర్ల పైన ఉంది.

దేశంలో ఎక్కువగా వినియోగించే మెటల్‌లో బంగారం కూడా ఉంది. వివిధ నగరాల్లో ధరలు ఇలా ఉన్నాయి. దేశ రాజధాని న్యూఢిల్లీలో పది గ్రాముల బంగారం ధర రూ.47,150, దేశ ఆర్థిక రాజధాని ముంబైలో పసిడి ధర రూ.47,380, చెన్నైలో రూ.45,360గా ఉంది. 24 క్యారెట్ల బంగారం రూ.48,380 వద్ద ఉంది. అంతర్జాతీయ మార్కెట్లో స్పాట్ గోల్డ్ నిన్న 0.1 శాతం ఎగిసి 1816 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. ఇక, మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్ (MCX)లో గోల్డ్ మద్దతు ధర రూ.47,800-47,660, నిరోధకస్థాయి రూ.48,240-48,500, సిల్వర్ ఫ్యూచర్స్ మద్దతు ధర రూ.67,400-66,900, నిరోధక స్థాయి రూ.68,200-68,800గా ఉండవచ్చు.


Click it and Unblock the Notifications