ముంబై: బంగారం ఫ్యూచర్ మార్కెట్లో ధరలు శుక్రవారం (డిసెంబర్ 18) దాదాపు స్థిరంగా ఉన్నాయి. నిన్నటి వరకు పెరిగిన ధరలు నేడు అతి స్వల్పంగా తగ్గాయి. అయితే ఇప్పటికీ రూ.50,000కు పైనే కదలాడుతోంది. కరోనా వ్యాక్సీన్, వ్యాక్సినేషన్ కారణంగా పసిడి ధర రూ.47,500కి తగ్గింది. ఆ తర్వాత మళ్లీ క్రమంగా పెరుగుతూ నిన్న రూ.50,000ను క్రాస్ చేసింది. ఆల్ టైమ్ గరిష్టం రూ.56,200తో రూ.5,800 వరకు తక్కువగా ఉంది. పక్షం రోజుల క్రితం రూ.8,200కు పైగా తగ్గింది. అమెరికా ఆర్థిక ప్యాకేజీ వంటి వివిధ అంశాలు పసిడి, ఈక్విటీ మార్కెట్లపై ప్రభావం చూపుతాయి.

రూ.50వేలకు పైనే పసిడి ధర
దేశీయ ఫ్యూచర్ మార్కెట్ మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్ (MCX)లో 10 గ్రాముల ఫిబ్రవరి గోల్డ్ ఫ్యూచర్ రూ.-68.00 (-0.13%) క్షీణించి రూ.50322.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.50,319.00 వద్ద ప్రారంభమై, రూ.50,469.00 వద్ద గరిష్టాన్ని తాకి, రూ.50,105.00 వద్ద కనిష్టాన్ని తాకింది.
ఏప్రిల్ గోల్డ్ ఫ్యూచర్ రూ.61.00 (-0.12%) తగ్గి రూ.50393.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.50,294.00 వద్ద ప్రారంభమై, రూ.50,520.00 వద్ద గరిష్టాన్ని, రూ.50,175.00 వద్ద కనిష్టాన్ని తాకింది.

వెండి రూ.68,000కు చేరువలో
వెండి ధర స్వల్పంగా తగ్గినప్పటికీ రూ.67,500కు పైనే ఉంది. మార్చి సిల్వర్ ఫ్యూచర్స్ రూ.475.00 (-0.70%) క్షీణించి రూ.67792.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.67,961.00 వద్ద ప్రారంభమై, రూ.68,431.00 వద్ద గరిష్టాన్ని, రూ.67,364.00 వద్ద కనిష్టాన్ని తాకింది.
మే ఫ్యూచర్స్ రూ.439.00 (-0.63%) క్షీణించి రూ.68720.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.68,681.00 వద్ద ప్రారంభమై, రూ.69,250.00 గరిష్టాన్ని, రూ.68,281.00 వద్ద కనిష్టాన్ని తాకింది.

స్థిరంగా ధరలు
అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ధరలు దాదాపు స్థిరంగా ఉన్నాయి. క్రితం సెషన్లో 1890 డాలర్ల వద్ద ముగిసిన గోల్డ్ ఫ్యూచర్స్ ఔన్స్ నేడు అతి స్వల్పంగా 0.50 (-0.03%) డాలర్లు క్షీణించి 1,889.90 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. నేడు 1,881.95 - 1,895.50 డాలర్ల మధ్య కదలాడింది. ఏడాదిలో 25.31% పెరిగింది.
సిల్వర్ ఫ్యూచర్స్ కూడా 0.134 (-0.51%) డాలర్లు తగ్గి 26.047 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. నేటి సెషన్లో 25.867 - 26.348 డాలర్ల మధ్య కదలాడింది. ఏడాదిలో 51.25% పెరిగింది.
More From GoodReturns

బంగారం ధరల పతనంపై బిగ్ అలర్ట్.. ఈ రాత్రి గడిస్తే చాలురా దేవుడా అంటున్న ఇన్వెస్టర్లు..

బంగారం, వెండి ధరలపై సస్పెన్స్.. ఆర్బీఐ నిర్ణయంతో రేట్లు తగ్గుతాయా..పెరుగుతాయా..

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధర పెరుగుదలపై షాకింగ్ న్యూస్.. ఏప్రిల్ నెలలో ఈ రేటును దాటడం ఖాయం అంటున్న నిపుణులు..

Today Gold Silver Rate Live: ట్రంప్ సీజ్ ఫైర్ ప్రకటన దెబ్బకు భారీగా పెరిగిన బంగారం ధరలు

Today Gold Silver Rate Live: ఇరాన్ ఉద్రిక్తతలతో మారుతున్న బంగారం ధరలు

బంగారం ధరలకు కొత్త సవాల్.. బిట్ కాయిన్ ఈటీఎఫ్‌ల ముందు వేస్ట్ అంటున్న నిపుణులు.. కారణం ఏంటంటే..

Gold Price: భారీ రికార్డుల నుంచి దిగివచ్చిన పసిడి! లేటెస్ట్ గోల్డ్ రేట్లు ఇవే..!

Gold silver: బంగారం, వెండి కొనాలా? వద్దా? మార్కెట్లో వింత పరిస్థితి.. నిపుణుల సలహా ఇదే!

Today Gold Silver Rate Live: కుప్పకూలిన బంగారం, వెండి ధరలు..కొంపలు ముంచుతున్న ట్రంప్ నిర్ణయాలు

Gold silver: బంగారం, వెండి కొనేవారికి అలర్ట్.. ఈ వారం ధరలు ఎలా ఉండబోతున్నాయి? నిపుణుల అంచనా ఇదే!



Click it and Unblock the Notifications