బంగారం ధరలు నేడు దాదాపు స్థిరంగా ఉన్నాయి లేదా స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. వరుసగా రెండు రోజుల పాటు భారీగ పెరిగిన ధరలు నేడు శాంతించాయి. మార్కెట్లు సానుకూలంగా ఉండటం, దేశవ్యాప్తంగా కరోనా కేసులు తగ్గుముఖం పట్టడం పసిడిపై ఒత్తిడి తగ్గడానికి కారణమైంది. గత కొంతకాలంగా రోజుకు 3 లక్షలకు పైగా కేసులు నమోదు కాగా, ఇప్పుడు ఈ మార్కు దిగువకు చేరుకున్నాయి. అయినప్పటికీ బంగారం ధరలు రూ.49,000కు చేరువలో ఉన్నాయి. ఆల్ టైమ్ గరిష్టం రూ.56,200తో రూ.7400 తక్కువగా ఉంది.

స్వల్పంగా తగ్గిన పసిడి
దేశీయ ఫ్యూచర్ మార్కెట్ మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్(MCX)లో 10 గ్రాముల జూన్ గోల్డ్ ఫ్యూచర్స్ నేటి మధ్యాహ్నం సెషన్లో రూ.113.00 (-0.23%) క్షీణించి రూ.48361.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.48,419.00 వద్ద ప్రారంభమైన ధర, రూ.48,465.00 గరిష్టాన్ని, రూ.48,290.00 కనిష్టాన్ని తాకింది. ఆగస్ట్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.118.00 (-0.24%) తగ్గి రూ.48851.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.48,983.00 వద్ద ప్రారంభమై, రూ.49,000.00 గరిష్టాన్ని, రూ.48,786.00 వద్ద కనిష్టాన్ని తాకింది.

వెండి జంప్
ఓ వైపు బంగారం ధరలు తగ్గగా, వెండి ధరలు మాత్రం పెరిగాయి. జూలై సిల్వర్ ఫ్యూచర్స్ నేడు మధ్యాహ్నం సెషన్లో రూ.538.00 (0.73%) పెరిగి రూ.73862.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.73,755.00 వద్ద ప్రారంభమై, రూ.74,099.00 గరిష్టాన్ని, రూ.73,709.00 వద్ద కనిష్టాన్ని తాకింది. సెప్టెంబర్ సిల్వర్ ఫ్యూచర్స్ రూ.580.00 (0.78%) పెరిగి రూ.74951.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.75,075.00 ప్రారంభమైన ధర, రూ.75,155.00 వద్ద గరిష్టాన్ని, రూ.74,845.00 కనిష్టాన్ని తాకింది.

అంతర్జాతీయ మార్కెట్లో పెరుగుదల
అంతర్జాతీయ ఫ్యూచర్ మార్కెట్లోను బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. ఏకంగా 1870 డాలర్ల స్థాయికి చేరుకున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో గోల్డ్ ఫ్యూచర్స్ నేడు 1.35 (+0.07%) డాలర్లు పెరిగి 1,869 డాలర్ల వద్ద కదలాడింది. నేటి సెషన్లో 1,866.25 - 1,874.25 డాలర్ల మధ్య కదలాడింది. సిల్వర్ ఫ్యూచర్స్ కూడా పెరిగింది. 0.331 (+1.17%) డాలర్లు పెరిగి 28.602 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. నేటి సెషన్లో 28.277 - 28.890 డాలర్ల మధ్య కదలాడింది.
More From GoodReturns

బంగారం ధర పెరుగుదలపై షాకింగ్ న్యూస్.. ఏప్రిల్ నెలలో ఈ రేటును దాటడం ఖాయం అంటున్న నిపుణులు..

భారీగా పెరిగిన బంగారం ధరలు.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎంతకు చేరిందంటే.. ఏప్రిల్ 1, బుధవారం ధరలు ఇవే..

బంగారం ధర ఈ వారం ఎంత పెరిగిందో తెలుసా.. రూపాయి పైనే పెట్టుబడిదారుల ఆశలు.. ఎందుకంటే..

బంగారం ధరలకు కొత్త సవాల్.. బిట్ కాయిన్ ఈటీఎఫ్‌ల ముందు వేస్ట్ అంటున్న నిపుణులు.. కారణం ఏంటంటే..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Gold silver: బంగారం ధరలకు రెక్కలు వస్తాయా? విదేశాల నుంచి వచ్చే జ్యువెలరీపై మోడీ సర్కార్ ఆంక్షలు!

బంగారం, వెండి ధరలు ఈ వారం ఎలా ఉండబోతున్నాయి..వరుస సెలవులు కాపాడుతాయా..కొంపలు ముంచుతాయా..

బంగారం ధరలు పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎంతకు చేరిందంటే.. మార్చి 31, మంగళవారం ధరలు ఇవే..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన వెండి, పసిడి ధరలు,..పుంజుకున్న రూపాయి

భారత ఫారెక్స్ రిజ్వర్వులను దెబ్బతీసిన ఇరాన్ యుద్ధం..భారీగా తగ్గిన బంగారం నిల్వలు..

Gold: గోల్డ్ లవర్స్‌కు గుడ్ న్యూస్! భారీ పతనం తర్వాత కోలుకుంటున్న పసిడి.. నిపుణుల అంచనా ఇదే.!



Click it and Unblock the Notifications