దేశీయ ఫ్యూచర్ మార్కెట్లో బంగారం ధరలు నేడు (ఫిబ్రవరి 9 మంగళవారం) స్వల్పంగా పెరిగాయి. వరుసగా మూడు సెషన్లలో పసిడి ధరలు పెరగడంతో నేడు రూ.48,000 మార్కును దాటింది. అయితే ఆ తర్వాత తిరిగి ఈ మార్కు దిగువకు వచ్చింది. బడ్జెట్ ప్రకటన అనంతరం ధరలు భారీగా క్షీణించాయి. రూ.2500 వరకు తగ్గాయి. ఓ సమయంలో రూ.47,000 దిగువకు వచ్చాయి.
అయితే మళ్లీ పెరుగుతున్నాయి. అయితే స్వల్పంగా మాత్రమే పెరుగుదల నమోదు చేస్తున్నాయి. ఆగస్ట్ 7వ తేదీ నాటి ఆల్ టైమ్ గరిష్టం రూ.56,200తో చూస్తే రూ.8200 తక్కువగా ఉన్నాయి. ఇంతకుముందు ఓ సమయంలో రూ.9000 వరకు తక్కువకు వెళ్లింది. ఈ సెషన్లలో రూ.800 వరకు పెరిగింది.

బంగారం మళ్లీ జంప్
ఎంసీఎక్స్‌లో ఏప్రిల్ గోల్డ్ ఫ్యూచర్స్ నేడు (మంగళవారం, ఫిబ్రవరి 9వ తేదీ) ఉదయం రూ.126.00 (0.26%) పెరిగి రూ.47,965.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.48,000.00 వద్ద ప్రారంభమైన ధర, రూ.48,103.00 వద్ద గరిష్టాన్ని, రూ.47,951.00 వద్ద కనిష్టాన్ని తాకింది. ఆల్ టైమ్ గరిష్టంతో రూ.8200 వరకు తక్కువ ఉంది. జూన్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.145.00 (0.30%) పెరిగి రూ.48,090 వద్ద ట్రేడ్ అయింది. రూ.48,166.00 వద్ద ప్రారంభమైన ధర, రూ.48,219.00 వద్ద గరిష్టాన్ని, రూ.48,090.00 వద్ద కనిష్టాన్ని తాకింది.

వెండి స్వల్పంగా...
వెండి ధర స్థిరంగా ఉంది. అయినప్పటికీ రూ.70వేలను క్రాస్ చేసింది. మార్చి సిల్వర్ ఫ్యూచర్స్ కిలో రూ.70,084.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.70,297.00 వద్ద ప్రారంభమైన ధర, రూ.70,444.00 వద్ద గరిష్టాన్ని, రూ.70,009.00 వద్ద కనిష్టాన్ని తాకింది.
మే సిల్వర్ ఫ్యూచర్స్ కూడా కిలో రూ.71130.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.71,250.00 వద్ద ప్రారంభమైన ధర, రూ.71,475.00 వద్ద గరిష్టాన్ని, రూ.71,130.00 వద్ద కనిష్టాన్ని తాకింది.

1850 డాలర్ల దిశగా..
అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ధర భారీగా పెరుగుతోంది. 1850 డాలర్ల దిశగా దూసుకెళ్తోంది. నేడు గోల్డ్ ఫ్యూచర్స్ ఔన్స్ 6.70 (+0.37%) డాలర్లు పెరిగి 1840.90 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. ఈ సెషన్లో 1,830.35 - 1,844.55
డాలర్ల మధ్య కదలాడింది. ఏడాదిలో పసిడి ధర 15.2% శాతం పెరిగింది. సిల్వర్ ఫ్యూచర్స్ మాత్రం స్వల్పంగా తగ్గింది. ఔన్స్ ధర 0.051
(-0.18%) డాలర్లు పెరిగి 27.525 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. నేటి సెషన్లో 27.310 - 27.720 డాలర్ల మధ్య కదలాడింది. ఏడాదిలో 55.24 శాతం పెరిగింది.
More From GoodReturns

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంతకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 2, గురువారం ధరలు ఇవే..

Today Gold Silver Rate Live: తగ్గిన బంగారం, వెండి ధరలు.. తీవ్రమవుతున్న ఇరాన్ యుద్ధం

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Gold Price: భారీ రికార్డుల నుంచి దిగివచ్చిన పసిడి! లేటెస్ట్ గోల్డ్ రేట్లు ఇవే..!

బంగారం ధర పెరుగుదలపై షాకింగ్ న్యూస్.. ఏప్రిల్ నెలలో ఈ రేటును దాటడం ఖాయం అంటున్న నిపుణులు..

ఇరాన్ యుద్దం దెబ్బ.. బంగారం కొనడం మానేసి అమ్మేసుకుంటున్న కేంద్ర బ్యాంకులు.. కారణం ఏంటంటే..

బంగారం ధరలకు కొత్త సవాల్.. బిట్ కాయిన్ ఈటీఎఫ్‌ల ముందు వేస్ట్ అంటున్న నిపుణులు.. కారణం ఏంటంటే..

భారీగా పెరిగిన బంగారం ధరలు.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎంతకు చేరిందంటే.. ఏప్రిల్ 1, బుధవారం ధరలు ఇవే..

బంగారం ధర ఈ వారం ఎంత పెరిగిందో తెలుసా.. రూపాయి పైనే పెట్టుబడిదారుల ఆశలు.. ఎందుకంటే..

భారత ఫారెక్స్ రిజ్వర్వులను దెబ్బతీసిన ఇరాన్ యుద్ధం..భారీగా తగ్గిన బంగారం నిల్వలు..

Today Gold Silver Rate Live: తగ్గిన వెండి ధర.. పెరిగిన బంగారం ధర.. కారణం ఏంటంటే..



Click it and Unblock the Notifications