For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బంగారం ధర ఎలా ఉందంటే? ఇక్కడ ఇలా.. అక్కడ అలా!

|

బంగారం ధరలు ఈ రోజు(అక్టోబర్ 1, గురువారం) దాదాపు స్థిరంగా ఉన్నాయి. ఫ్యూచర్ మార్కెట్ మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్(MCX)లో రూ.50,450ని తాకింది. కనిష్టం రూ.50,120ని తాకింది. సాయంత్రం సెషన్ సమయానికి గోల్డ్ ఫ్యూచర్స్ డిసెంబర్ డెలివరీ 10 గ్రాములు రూ.50,228 పలికింది. బిజినెస్ టర్నోవర్ 15,348 లాట్లుగా ఉంది. ఫిబ్రవరి ఫ్యూచర్ రూ.50,390గా ఉంది. బిజినెస్ టర్నోవర్ 519 లాట్లుగా ఉంది. డిసెంబర్, ఫిబ్రవరి కాంట్రాక్ట్ వ్యాల్యూ వరుసగా రూ.2,056.19 కోట్లు, రూ.44.40 కోట్లుగా ఉంది. గోల్డ్ మినీ కాంట్రాక్ట్ నవంబర్ రూ.50,325 పలికింది. బిజినెస్ టర్నోవర్ 11,231 లాట్లుగా ఉంది.

అంతర్జాతీయ మార్కెట్లో పెరుగుదల

అంతర్జాతీయ మార్కెట్లో పెరుగుదల

అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ధరలు ఔన్స్ 1900 డాలర్లకు చేరుకున్నాయి. డాలర్ వ్యాల్యూ క్షీణించడం, అమెరికా ఆర్థిక ప్యాకేజీ ప్రకటిస్తుందనే వార్తలు వంటి వివిధ కారణాలు పసిడి ధరలపై ప్రభావం చూపించాయి. స్పాట్ గోల్డ్ 0.6 శాతం ఎగిసి ఔన్స్ 1,896.78 డాలర్లు పలికింది. అంతర్జాతీయ మార్కెట్లో సెప్టెంబర్ నెలలో బంగారం 4 శాతానికి పైగా క్షీణించింది. నవంబర్ 2016 నుండి ఇది అతిపెద్ద మంత్లీ డ్రాప్ కావడం గమనార్హం. యూఎస్ గోల్డ్ ఫ్యూచర్స్ 0.3 శాతం పెరిగి 1,901.70 డాలర్లు పలికింది.

ముంబైలో ధర..

ముంబైలో ధర..

ముంబైలో 10 గ్రాముల పసిడి రూ.50,413 పలికింది. ముంబైలో 18 క్యారెట్ల 10 గ్రాముల పసిడి రూ.37,810గా, 22 క్యారెట్ల పసిడి రూ.46,178గా, 24 క్యారెట్ల పసిడి రూ.50,413గా నమోదయింది. దీనికి 3 శాతం జీఎస్టీ అదనం. ఈవారం జాతీయ, అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ధరలు వరుసగా పది గ్రాములు రూ.50,200-రూ.50,750 మధ్య, ఔన్స్ 1,875-1,915 డాలర్ల మధ్య ట్రేడ్ కావొచ్చునని బులియన్ మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. 1900 డాలర్లను దాటిన పసిడి 1900 నుండి 1910 మధ్య స్ట్రగుల్ ఉంటుందని భావిస్తున్నారు.

4.3 శాతం తగ్గుదల

4.3 శాతం తగ్గుదల

అంతర్జాతీయ మార్కెట్లో పసిడి సెప్టెంబర్ నెలలో పసిడి ధర 4.3 శాతం మేర తగ్గింది. నవంబర్ 2016 నుండి ఒక నెలలో దారుణ పతనం. యూఎస్ గోల్డ్ ఫ్యూచర్స్ 0.2 శాతం క్షీణించి 1,890.90 డాలర్లు పలికింది. మార్చి నుండి వెండి 16 శాతం మేర పడిపోయింది. బంగారం ధరలు ఔన్స్ 1,840 డాలర్లకు పైన ఉన్నంత కాలం పెరుగుదలకు అవకాశాలు ఉన్నాయని అంతర్జాతీయ బులియన్ మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు. ఔన్స్ ధర 1,840 డాలర్ల కంటే క్షీణిస్తే మాత్రం పసిడి బలహీనానికి సంకేతంగా భావించవచ్చునని అంటున్నారు.

English summary

బంగారం ధర ఎలా ఉందంటే? ఇక్కడ ఇలా.. అక్కడ అలా! | Gold Price Today: Yellow metal trade flat, resistance placed at Rs 50,500

India Gold MCX December Futures rose marginally on Thursday following the positive trend seen in the international markets. Experts are of the view that the next resistance level for the yellow metal is placed at Rs 50500-50660 per 10 gm.
Story first published: Thursday, October 1, 2020, 22:51 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X