బంగారం భారీ షాక్, రూ.700 పెరిగిన పసిడి: సిల్వర్ ఏకంగా రూ.2,000 జంప్
బంగారం, వెండి ధరలు నేడు భారీగా పెరిగాయి. బంగారం రూ.670కి పైగా, వెండి రూ.2,000కు పైగా ఎగిసింది. దేశీయ ఫ్యూచర్ మార్కెట్ మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్ (MCX)లో పది గ్రాముల జూన్ గోల్డ్ ఫ్యూచర్స్ సాయంత్రం సెషన్‌లో రూ.671.00 (1.41%) పెరిగి రూ.48347.00 పలికింది. రూ.47,989.00 వద్ద ప్రారంభమైన ధర, రూ.48,371.00 గరిష్టాన్ని, రూ.47,910.00 కనిష్టాన్ని తాకింది. ఆగస్ట్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.741.00 (1.54%) పెరిగి రూ.48899.00 వద్ద ట్రేడ్ అయింది.
సిల్వర్ ఫ్యూచర్స్ జూలై రూ.2,007.00 (2.82%)పెరిగి రూ.73092.00కు జంప్ చేసింది. వెండి ఏకంగా రూ.73,000 దాటింది. రూ.71,900.00 వద్ద ప్రారంభమై, రూ.73,132.00 వద్ద గరిష్టాన్ని, రూ.71,526.00 వద్ద కనిష్టాన్ని తాకింది. సెప్టెంబర్ సిల్వర్ ఫ్యూచర్స్ రూ.1,971.00 (2.73%) పెరిగి రూ.74160.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.73,050.00 వద్ద ప్రారంభమైన ధర, రూ.74,160.00 వద్ద గరిష్టాన్ని, రూ.72,710.00 వద్ద కనిష్టాన్ని తాకింది.

అంతర్జాతీయ మార్కెట్లో గోల్డ్ ఫ్యూచర్స్ 1875 డాలర్ల దిశగా పరుగు పెడుతోంది. ఔన్స్ గోల్డ్ ఫ్యూచర్స్ 29.15 (1.59%) డాలర్లు పెరిగి 1867.25 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. సిల్వర్ ఫ్యూచర్స్ ఔన్స్ 0.947 (3.46%) డాలర్లు ఎగిసి 28.312 డాలర్ల వద్దకు చేరుకుంది.


Click it and Unblock the Notifications