Gold Prices Today: ఊగిసలాటలోనే, తగ్గుతున్న బంగారం ధరలు
బంగారం ధరలు మళ్లీ తగ్గుముఖం పట్టాయి. గత మూడు సెషన్లుగా లాభాల్లో కనిపించిన గోల్డ్ ఫ్యూచర్స్ నిన్న, నేడు మళ్లీ క్షీణించాయి. గోల్డ్ ఫ్యూచర్స్ మొన్న రూ.51,000 క్రాస్ చేసింది. కానీ నిన్న మళ్లీ ఈ మార్కు దిగువకు వచ్చింది. నేడు రూ.50,800 కిందకు పడిపోయింది. అంతర్జాతీయ మార్కెట్ కామెక్స్‌లో గోల్డ్ ఫ్యూచర్స్ క్రితం సెషన్లో 1850 డాలర్ల పైకి చేరుకున్నప్పటికీ, నేడు ఈ మార్కు దిగువకు వచ్చింది. సిల్వర్ ఫ్యూచర్స్ మాత్రం రూ.61,000కు పైనే ఉంది.
దేశీయ ఫ్యూచర్ మార్కెట్ మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్ (MCX)లో జూన్ గోల్డ్ ఫ్యూచర్స్ నేటి ప్రారంభ సెషన్‌లో రూ.66 తగ్గి రూ.50,753 వద్ద, ఆగస్ట్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.36 తగ్గి రూ.50,885 వద్ద కదలాడింది. జూలై సిల్వర్ ఫ్యూచర్స్ రూ.213 తగ్గి రూ.61,321, సెప్టెంబర్ సిల్వర్ ఫ్యూచర్స్ రూ.196 తగ్గి రూ.62,005 వద్ద కదలాడింది. ఆల్ టైమ్ గరిష్టం రూ.56,200తో పోలిస్తే రూ.5700 తక్కువగా ఉంది. మొత్తానికి పసిడి ధరలు ఊగిసలాటలో కనిపిస్తున్నాయి.

అంతర్జాతీయ మార్కెట్ కామెక్స్‌లో గోల్డ్ ఫ్యూచర్స్ 1845 డాలర్ల దిగువకు వచ్చింది. గోల్డ్ ఫ్యూచర్స్ నేడు 2 డాలర్లు తగ్గి 1844 డాలర్ల వద్ద, సిల్వర్ ఫ్యూచర్స్ 0.087 డాలర్లు క్షీణించి 21.783 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. గోల్డ్ ఫ్యూచర్స్ క్రితం సెషన్లో 1846 డాలర్ల వద్ద ముగిసింది. ఏడాదిలో 2.50 శాతం తగ్గింది. సిల్వర్ ఫ్యూచర్స్ ఏడాదిలో 22 శాతం తగ్గింది.


Click it and Unblock the Notifications