Gold Price Today: బంగారం ధరలు నేడు ఎలా ఉన్నాయంటే?
బంగారం, వెండి ధరలు గురువారం(ఆగస్ట్ 26) ప్రారంభ సెషన్‌లో స్థిరంగా ఉన్నాయి. బంగారం ఫ్యూచర్ రూ.47,200 దిగువన ఉండగా, వెండి ఫ్యూచర్ రూ.63,000కు పైన ట్రేడ్ అయింది. అక్టోబర్ గోల్డ్ ఫ్యూచర్స్ నేడు ప్రారంభ సెషన్‌లో రూ.35.00 (0.07%) క్షీణించి రూ.47144.00 వద్ద, డిసెంబర్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.35.00 (-0.07%) క్షీణించి రూ.47320.00 వద్ద ట్రేడ్ అయింది. సెప్టెంబర్ సిల్వర్ ఫ్యూచర్స్ రూ.89.00 (-0.14%) క్షీణించి రూ.63183.00 వద్ద, డిసెంబర్ సిల్వర్ ఫ్యూచర్స్ రూ.56.00 (-0.09%) తగ్గి రూ.63900.00 వద్ద ట్రేడ్ అయింది. ఇటీవల రూ.63,000 దిగువనే ఉన్న సిల్వర్ ఫ్యూచర్స్ రెండు రోజులుగా లాభపడింది. దీంతో ఈ మార్కు దాటింది. అలాగే రూ.48,000 దిశగా సాగిన గోల్డ్ ఫ్యూచర్స్ ఇటీవల కాస్త తగ్గుముఖం పట్టాయి.
అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు మళ్లీ క్షీణిస్తున్నాయి. ఈ వారం ప్రారంభంలో 1800 డాలర్లు దాటిన గోల్డ్ ఫ్యూచర్స్ మళ్లీ కిందకు పడిపోయింది. నేడు 2.85 (0.16%) డాలర్లు క్షీణించిన గోల్డ్ ఫ్యూచర్స్ 1,788.15 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. 0.002 (-0.01%) డాలర్లు ఎగిసిపడిన సిల్వర్ ఫ్యూచర్స్ 23.773 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది.

బంగారం ధరలు ఈ నెల ప్రారంభంలో నాలుగు నెలల కనిష్టానికి రూ.45,600 దిగువకు పడిపోయాయి. గత ఏడాది ఆగస్ట్ 7వ తేదీన గోల్డ్ ఫ్యూచర్స్ ఆల్ టైమ్ గరిష్టం రూ.56.200కు చేరుకుంది. అంతర్జాతీయ మార్కెట్లో స్పాట్ గోల్డ్ ఔన్స్ ధర స్వల్పంగా క్షీణించి 1800 డాలర్ల వద్ద ఉంది. డాలర్ ఇండెక్స్ 93 డాలర్లు క్రాస్ చేసి తొమ్మిదిన్నర నెలల గరిష్టానికి చేరుకుంది.
బంగారం ధరలు 1808 డాలర్ల నుండి 1820 డాలర్లకు చేరుకోవచ్చునని బులియన్ మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. మద్దతు ధర 1785 డాలర్ల నుండి 1773 డాలర్లుగా పేర్కొంటున్నారు. సిల్వర్ ధరలు 23.00 డాలర్ల పైనే ముగిసే అవకాశాలు ఉన్నాయని, మరింతగా పెరిగితే 24.10 డాలర్ల నుండి 25.22 డాలర్ల పైకి చేరుకోవచ్చుని అంచనా వేస్తున్నారు.


Click it and Unblock the Notifications