Gold Price Today: నిన్న భారీగా పెరిగి, నేడు స్థిరంగా బంగారం ధర
బంగారం ధరలు మళ్లీ వరుసగా పెరుగుతున్నాయి. దేశీయ ఫ్యూచర్ మార్కెట్ మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్ (MCX)లో గోల్డ్ ఫ్యూచర్ క్రితం సెషన్‌లో రూ.308 పెరిగి రూ.52,075 వద్ద ముగిసింది. గతవారం రూ.55,000 పైకి చేరుకొని, ఈ వారం ప్రారంభంలో రూ.51,500 దిగువకు వచ్చాయి. కానీ ఆ తర్వాత నుండి మళ్లీ పెరుగుతున్నాయి. నేటి (మార్చి 25) ప్రారంభ సెషన్‌లో మాత్రం ఏప్రిల్ గోల్డ్ ఫ్యూచర్స్ అతి స్వల్పంగా తగ్గింది. ఏప్రిల్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.38 తగ్గి రూ.52,040 వద్ద ట్రేడ్ అయింది. అతి స్వల్పంగా క్షీణించినప్పటికీ రూ.52,000కు పైనే ఉంది. జూన్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.60 క్షీణించి రూ.52,543 వద్ద ట్రేడ్ అయింది.
సిల్వర్ ఫ్యూచర్స్ పెరిగింది. మే సిల్వర్ ఫ్యూచర్స్ రూ.80 పెరిగి రూ.69,400 వద్ద, జూలై సిల్వర్ ఫ్యూచర్స్ రూ.22 తగ్గి రూ.70,121 వద్ద ట్రేడ్ అయింది. సిల్వర్ ఫ్యూచర్స్ ఇటీవల రూ.72,000 క్రాస్ చేసింది. ఆ తర్వాత రూ.66,000 స్థాయికి వచ్చినప్పటికీ మళ్లీ పెరుగుతోంది. గోల్డ్ ఫ్యూచర్స్ ఆల్ టైమ్ గరిష్టం రూ.56200తో రూ.4000 తక్కువగా, ఇటీవలి రష్యా-ఉక్రెయిన్ యుద్ధం సమయంలోని గరిష్టంతో రూ.3500 తక్కువగా ఉంది.

అంతర్జాతీయ మార్కెట్ కామెక్స్‌లో గోల్డ్ ఫ్యూచర్ యుద్ధం సమయంలో 2060 డాలర్లను తాకినప్పటికీ, ఆ తర్వాత 1920 డాలర్ల దిగువకు పడిపోయాయి. అమెరికా ద్రవ్యోల్భణం 40 ఏళ్ల గరిష్టానికి చేరుకోవడం వంటి వివిధ కారణాలతో పసిడి ధరలు మళ్లీ పెరగడంతో నేడు 1962 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది. క్రితం సెషన్‌లోను ఇదే స్థాయిలో ముగిసింది. సిల్వర్ ఫ్యూచర్స్ 26 డాలర్లను సమీపించింది.


Click it and Unblock the Notifications