For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

నిన్న రూ.2500 తగ్గి, నేడు మళ్ళీ భారీగా పెరిగిన బంగారం ధర: వెండిది అదే దారి

|

దేశీయ, అంతర్జాతీయ ఫ్యూచర్ మార్కెట్లో నిన్న భారీగా తగ్గిన పసిడి, వెండి ధరలు, నేడు (మంగళవారం, నవంబర్ 10) భారీగా పెరిగాయి. భారీగా క్షీణించిన సంబరం ఒక్కరోజు మాత్రమే కనిపించింది. అయినప్పటికీ రూ.50,500 దిగువనే ఉన్నాయి. రెండు రోజుల క్రితం వరకు రూ.52వేలకు పైగా ఉంది. ఆ ధరతో చూసినా నేడు ప్రారంభ సెషన్ ధర రూ.2000 తక్కువగా ఉంది. ఆల్ టైమ్ గరిష్టం రూ.56,200తో రూ.6000 తక్కువగా ఉంది.

Gas Refill: ఈ నెంబర్‌తో... వాట్సాప్ ద్వారా గ్యాస్ బుక్ చేయండి!Gas Refill: ఈ నెంబర్‌తో... వాట్సాప్ ద్వారా గ్యాస్ బుక్ చేయండి!

రూ.2500 తగ్గి, రూ.600 పెరిగిన ధర

రూ.2500 తగ్గి, రూ.600 పెరిగిన ధర

దేశీయ ఫ్యూచర్ మార్కెట్ మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్ (MCX)లో నేడు ఉదయం గం.12.22 సమయానికి 10 గ్రాముల డిసెంబర్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.838.00 (1.68%) పెరిగి రూ.50,586.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.49,931.00 వద్ద ప్రారంభం కాగా, రూ.50,600.00 వద్ద గరిష్టాన్ని, రూ.49,931.00 వద్ద కనిష్టాన్ని తాకింది.

ఫిబ్రవరి ఫ్యూచర్స్ రూ.799.00 (1.60%) పెరిగి రూ.50,692.00 పలికింది. రూ.50,383.00 వద్ద ప్రారంభం కాగా, రూ.50,692.00 వద్ద గరిష్టాన్ని, రూ.50,300.00 వద్ద కనిష్టాన్ని తాకింది.

నిన్న పసిడి (డిసెంబర్ ఫ్యూచర్) ధర ఏకంగా రూ.2,502.00 (-4.80%) తగ్గి రూ.49665.00 వద్ద, ఫిబ్రవరి ఫ్యూచర్స్ రూ.2,487.00 (-4.75%) రూ.49850.00 వద్ద ముగిసింది.

వెండిదీ అదే దారి

వెండిదీ అదే దారి

ఉదయం గం.12.23 సమయానికి ఎంసీఎక్స్‌లో డిసెంబర్ సిల్వర్ ఫ్యూచర్స్ కిలో రూ.1,444.00 (2.37%) పెరిగి రూ.62,298.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.61,900.00 వద్ద ప్రారంభమై, రూ.62,427.00 వద్ద గరిష్టాన్ని, రూ.61,820.00 వద్ద కనిష్టాన్ని తాకింది.

మార్చి సిల్వర్ ఫ్యూచర్స్ రూ.1,477.00 (2.36%) ఎగిసి కిలో రూ.64,080.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.63,900.00 వద్ద ప్రారంభమై, రూ.64,111.00 వద్ద గరిష్టాన్ని, రూ.63,700.00 వద్ద కనిష్టాన్ని తాకింది.

నిన్న డిసెంబర్ సిల్వర్ ఫ్యూచర్స్ రూ.4,610.00 (-7.06%) తగ్గి రూ.60,725.00 వద్ద, మార్చి ఫ్యూచర్స్ రూ.4,617.00 (-6.88%) తగ్గి రూ.62464.00 ముగిసింది. నేడు మళ్లీ రూ.1500 వరకు ఎగిసింది.

అంతర్జాతీయ మార్కెట్లో ధరలు..

అంతర్జాతీయ మార్కెట్లో ధరలు..

అంతర్జాతీయ మార్కెట్లో కూడా నేడు బంగారం ధరలు పెరిగాయి. ఔన్స్ పసిడి నేడు 1.45 శాతం లేదా 27 డాలర్లు పెరిగి 1881 డాలర్లను దాటింది. నిన్న 1854 వద్ద క్లోజ్ అయింది. ఏడాదిలో 25 శాతం మేర పెరిగింది. 1,859.60 - 1,882.90 డాలర్ల మధ్య ట్రేడ్ అయింది.

వెండి ధర కూడా ఔన్స్ 2.53 శాతం పెరిగి 24.302 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. 24.035 - 24.385 డాలర్ల మధ్య ట్రేడ్ అయింది. ఈ ఏడాది వెండి 43.64 శాతం పెరిగింది. క్రితం సెషన్‌లో 23.701 డాలర్ల వద్ద ముగిసింది.

English summary

నిన్న రూ.2500 తగ్గి, నేడు మళ్ళీ భారీగా పెరిగిన బంగారం ధర: వెండిది అదే దారి | Gold price today: Yellow metal stable after steep fall, Silver up 2 percent

India Gold MCX December futures stabilised on Tuesday after falling about 5 percent in the previous trading session tracking a positive trend seen in the international spot prices which were up largely on hopes of stimulus measures.
Story first published: Tuesday, November 10, 2020, 12:33 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X