Gold price today: రూ.50,000 దిగువకు వచ్చిన బంగారం ధరలు
బంగారం ధరలు భారీగా తగ్గాయి. క్రితం సెషన్‌లో రూ.50,200లు క్రాస్ చేసిన గోల్డ్ ఫ్యూచర్స్ నేడు రూ.49,400 దిగువకు వచ్చింది. అంటే ఒక సెషన్‌లోనే దాదాపు రూ.1000 వరకు తగ్గింది. దేశీయ ఫ్యూచర్ మార్కెట్ మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్‌లో రూ.65,000ను సమీపించిన సిల్వర్ ఫ్యూచర్ ఇప్పుడు రూ.63,000 స్థాయిలో ఉంది. నిన్నటి సెషన్‌లో సిల్వర్ ఫ్యూచర్ రూ.1500 వరకు తగ్గింది. నేడు మాత్రం ధరలు దాదాపు స్థిరంగా ఉన్నాయి లేదా అతి స్వల్పంగా తగ్గాయి.
ఏప్రిల్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.35 తగ్గి రూ.49,350 వద్ద, జూన్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.9 తగ్గి రూ.49,545 వద్ద, మార్చి సిల్వర్ ఫ్యూచర్స్ రూ.48 తగ్గి రూ.62,941 వద్ద, మే సిల్వర్ ఫ్యూచర్స్ రూ.28 క్షీణించి రూ.63,866 వద్ద ట్రేడ్ అయింది. అంతర్జాతీయ మార్కెట్లో గోల్డ్ ఫ్యూచర్స్ నేటి సెషన్‌లో 1852 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. నేటి సెషన్‌లో 1851.85 డాలర్ల నుండి 1856.20 డాలర్ల మధ్య కదలాడింది. బంగారం 52 వారాల గరిష్టం 1922 డాలర్లు, కనిష్టం 1682 డాలర్లు. క్రితం సెషన్లో 1856 డాలర్ల వద్ద ముగిసింది. వెండి ధరలు నిన్న భారీగా తగ్గి, నేడు స్వల్పంగా పెరిగాయి. సిల్వర్ ఫ్యూచల్స్ 0.016 డాలర్లు పెరిగి 23.358 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది.

బంగారం నిరోధకస్థాయి 49,500, మద్దతు ధర రూ.49,000గా ఉందని బులియన్ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. అంటే పసిడి ఈ మధ్య రూ.49,000 దిగువకు వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. అయితే ఒక్కరోజులోనే దాదాపు రూ.1000 తగ్గి, రూ.50,000 దిగువకు వచ్చి కొనుగోలుదారులకు కాస్త ఊరటనిచ్చింది.


Click it and Unblock the Notifications