మళ్లీ తగ్గుతున్న బంగారం ధర, ఆల్ టైమ్ గరిష్టంతో రూ.6000 తక్కువ
ముంబై: బంగారం ధరలు మళ్లీ తగ్గుముఖం పట్టాయి. బ్రిటన్ సహా యూరోప్ దేశాల్లో కొత్త వైరస్ భయాలతో ఈ వారం బంగారం ధరలు పెరిగాయి. అమెరికా ప్యాకేజీ వంటి కారణాలతో గతవారం కూడా పసిడి పైకెగిరింది. గత నెల చివరలో రూ.47,500 స్థాయికి వచ్చిన పసిడి ఇప్పుడు రూ.50,000కు వచ్చింది. ఆల్ టైమ్ గరిష్టం రూ.56,200తో పోలిస్తే రూ.6200 తగ్గింది. వెండి కూడా ఆల్ టైమ్ గరిష్టం రూ.79,000తో రూ.13000 వరకు తక్కువగా ఉంది. ఓ సమయంలో సిల్వర్ ఫ్యూచర్స్ రూ.60,000 దిగువకు వచ్చింది.

బంగారం ధరల్లో క్షీణత
దేశీయ ఫ్యూచర్ మార్కెట్ మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్(MCX)లో 10 గ్రాముల ఫిబ్రవరి గోల్డ్ ఫ్యూచర్స్ రూ.101.00 (-0.20%) తగ్గి రూ.49,980 వద్ద ట్రేడ్ అయింది. నేడు ఉదయం బంగారం ధరలు 50,000 పైన కనిపించినప్పటికీ, ఆ తర్వాత దిగువకు వచ్చాయి. రూ.50,042.00 వద్ద ప్రారంభమై, రూ.50,097.00 వద్ద గరిష్టాన్ని, రూ.49,976.00 వద్ద కనిష్టాన్ని తాకింది.
ఏప్రిల్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.56.00 (-0.11%) తగ్గి రూ.50053.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.50,134.00 వద్ద ప్రారంభమై, రూ.50,190.00 వద్ద గరిష్టాన్ని, రూ.50,043.00 కనిష్టాన్ని తాకింది.

వెండి ఫ్యూచర్స్ ధర ఇలా
సిల్వర్ ఫ్యూచర్స్ మార్చి రూ.211.00 (-0.32%) తగ్గి రూ.66660.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.66,687.00 వద్ద ప్రారంభమై, రూ.67,038.00 గరిష్టాన్ని, రూ.66,605.00 కనిష్టాన్ని తాకింది.
మే ఫ్యూచర్స్ మాత్రం స్వల్పంగా పెరిగింది. రూ.57.00 (0.08%) పెరిగి రూ.67751.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.67,530.00 ప్రారంభమై, రూ.67,895.00 గరిష్టాన్ని తాకి, రూ.67,530.00 కనిష్టాన్ని తాకింది.

అంతర్జాతీయ మార్కెట్లో..
అంతర్జాతీయ మార్కెట్లో గోల్డ్ ఫ్యూచర్స్ 0.05 (0.00%) డాలర్లు పెరిగి 1,870.25 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. నేటి సెషన్లో 1,864.80 - 1,872.55 డాలర్ల మధ్య కదలాడింది. ఏడాదిలో 23.58% పెరిగింది.
సిల్వర్ ఫ్యూచర్స్ 0.082 (-0.32%) డాలర్లు పెరిగి 25.453 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. నేటి సెషన్లో 25.185 - 25.595 మధ్య కదలాడింది. ఏడాదిలో 44.67% పెరిగింది.


Click it and Unblock the Notifications