బంగారం ధరలు ఈరోజు తగ్గుముఖం పట్టాయి. మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్ (MCX)లో ప్రారంభ సెషన్‌లో 10 గ్రాముల పసిడి 0.5 శాతం క్షీణించి రూ.50,803 పలికింది. బంగారం 51,000 దిగువనే ఉంది. వెండి ఫ్యూచర్స్ 0.6 శాతం తగ్గి కిలో రూ.67,850 పలికింది. అంతకుముందు మూడు రోజుల పాటు తగ్గిన పసిడి ధరలు నిన్న స్వల్పంగా 0.7 శాతం పెరిగాయి. వెండి మాత్రం 1.6 శాతం పెరిగింది. బంగారం, వెండి ధరలు గత నెల రికార్డ్ ధరల తర్వాత భారీగా తగ్గాయి. పసిడి 10 గ్రాములు రూ.5500 వరకు, వెండి రూ.10వేల వరకు తక్కువగా ఉంది. గత ఐదు రోజుల్లో నాలుగు రోజులు ధర క్షీణించింది.

హైదరాబాద్ సహా వివిధ నగరాల్లో బంగారం ధరలు
హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ బులియన్ మార్కెట్లో బంగారం ధర స్వల్పంగా తగ్గింది. 10 గ్రాముల 22 క్యారెట్ల పసిడి ధర రూ.40 దిగి వచ్చి రూ.48,850, 24 క్యారెట్ల 10 గ్రాములు పసిడి దాదాపు అంతే తగ్గి రూ.53,290 పలికింది. 22 క్యారెట్ల బంగారం కేరళలో రూ.46,900, పుణే రూ.49,590, అహ్మదాబాద్ రూ.49,,590, జైపూర్ రూ.49,650 పలికింది. 24 క్యారెట్ల పసిడి చెన్నైలో రూ.53,290, ముంబైలో రూ.50,590, ఢిల్లీలో రూ.54,160, కోల్‌కతాలో రూ.53,920, బెంగళూరులో రూ.52,520 పలికింది.

బలపడిన డాలర్.. ఆ కరెన్సీల్లో పెరిగిన ధర
అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ధరలు తగ్గుముఖం పట్టాయి. స్పాట్ గోల్డ్ 0.2 శాతం తగ్గి ఔన్స్ ధర 1,925.68 పలికింది. ఔన్స్ ధర 1924 నుండి 1933 మధ్య ట్రేడ్ అయింది. 6 బాక్సుల కరెన్సీలో డాలర్ ఇండెక్స్ 0.45 శాతం బలపడింది. డాలర్ బలపడిన నేపత్యంలో ఇతర 5 కరెన్సీల్లో బంగారం ధరలు పెరుగుతాయి. సినో-అమెరికా, చైనా-ఇండియా టెన్షన్స్, బ్రెగ్జిట్ అంశం, కరోనా మహమ్మారి కేసులు పసిడిపై ప్రభావం చూపుతున్నాయి.

మద్దతు.. నిరోధకస్థాయి
ప్రస్తుత పరిస్థితుల్లో బంగారం అస్థిరంగానే ఉండనున్నాయని బులియన్ మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఎంసీఎక్స్‌లో కీలక మద్దతు రూ.50,800-రూ.50,600, గరిష్ట నిరోధకస్థాయి రూ.51,200 వద్ద ఉంటుందని చెబుతున్నారు. అంతర్జాతీయ మార్కెట్లో ట్రాయ్ ఔన్స్ మద్దతు 1910-1900 డాలర్ల మధ్య, నిరోధకస్థాయి 1,944-1,958 డాలర్లుగా ఉంటుందని చెబుతున్నారు.


Click it and Unblock the Notifications