బంగారం ధరలు భారీ ఊగిసలాటలో ఉన్నాయి. మొత్తానికి ధరలు మాత్రం క్షీణిస్తున్నాయి. నిన్న తగ్గిన పసిడి ధరలు నేడు (సెప్టెంబర్ 30 బుధవారం) మాత్రం స్వల్పంగా పెరిగాయి. దీంతో నేటి ప్రారంభ సెషన్‌కు నిన్నటి స్థాయికి చేరుకున్నాయి. బంగారం ఫ్యూచర్స్ నేడు రూ.46,000 దిగువనే ఉండగా, సిల్వర్ ఫ్యూచర్స్ అయితే నిన్న రూ.2000కు పైగా క్షీణించి రూ.58,000 స్థాయికి పడిపోయింది. అక్టోబర్ గోల్డ్ ఫ్యూచర్స్ నేటి ప్రారంభ సెషన్‌లో రూ.239.00 (0.52%) పెరిగి రూ.45824.00 వద్ద, డిసెంబర్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.187.00 (0.41%) పెరిగి రూ.45956.00 వద్ద ట్రేడ్ అయింది. డిసెంబర్ సిల్వర్ ఫ్యూచర్స్ రూ.52 పెరిగి రూ.58438.00 వద్ద, మార్చి సిల్వర్ ఫ్యూచర్స్ రూ.58 పెరిగి రూ.58928.00 వద్ద ట్రేడ్ అయింది. నిన్న మాత్రం బంగారం, వెండి ధరలు తగ్గాయి.
నిన్న అక్టోబర్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.269.00 (-0.59%) తగ్గి రూ.45584.00 వద్ద, డిసెంబర్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.179.00 (-0.39%) క్షీణించి రూ.45777.00 వద్ద ముగిసింది. డిసెంబర్ సిల్వర్ ఫ్యూచర్స్ నిన్న ఏకంగా రూ.2,114.00 (-3.50%) క్షీణించి రూ.58350.00 వద్ద, మార్చి సిల్వర్ ఫ్యూచర్స్ రూ.2,100.00 (-3.44%) తగ్గి రూ.58871.00 ముగిసింది. అంతర్జాతీయ మార్కెట్లో గోల్డ్ ఫ్యూచర్స్ నిన్న 1,722.90 డాలర్ల వద్ద, సిల్వర్ ఫ్యూచర్స్ 21.485 డాలర్ల వద్ద ముగిసింది.

నేడు పెరిగినప్పటికీ
అంతర్జాతీయ మార్కెట్లో గోల్డ్ ఫ్యూచర్స్ నేటి ప్రారంభ సెషన్‌లో 9.35 (+0.54%) డాలర్లు పెరిగి 1,732.45 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. సిల్వర్ ఫ్యూచర్స్ 0.082 (+0.38%) డాలర్లు ఎగిసి 21.567 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. బంగారం ధరలు చాలా రోజుల తర్వాత 1722 డాలర్ల స్థాయికి దిగి వచ్చాయి. నేడు సానుకూలంగా ప్రారంభమైనప్పటికీ, ఓ సమయంలో ఏకంగా 1726 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది.
నిన్నటి ముగింపు (1722)తో పోలిస్తే నాలుగు డాలర్లు ఎక్కువ. 52 వారాల గరిష్టం 1978 డాలర్లు కాగా, కనిష్టం 1677 డాలర్లు. కనిష్టానికి మరో 50 డాలర్ల దూరంలో మాత్రమే ఉంది. ఇక వెండి చాన్నాళ్లకు 22 డాలర్ల దిగువకు వచ్చింది.

అప్రమత్తంగా
అంతర్జాతీయ మార్కెట్లో స్పాట్ గోల్డ్ ఔన్స్‌కు 1,729.83 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. ఆగస్ట్ 9వ తేదీ నాటి 1,720.49 నుండి బంగారం ధర ఇదే కనిష్టం. డాలర్ వ్యాల్యూ క్రమంగా పెరుగుతోంది. బుధవారం ఏడాది గరిష్టానికి చేరుకుంది. యూఎస్ జీడీపీ డేటా విడుదలకు ముందు బంగారం, వెండి ధరలు అప్రమత్తంగా ఉన్నాయి.

మద్దతు.. నిరోధకం
ఎంసీఎక్స్‌లో గోల్డ్ మద్దతు ధర రూ.45550-రూ.45400, నిరోధకస్థాయి రూ.45920-రూ.46100, సిల్వర్ మద్దతు ధర రూ.58000-రూ.57500, నిరోధకస్థాయి రూ.58800-రూ.59400గా ఉండవచ్చునని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. వెండిని రూ.57700 వద్ద స్టాప్ లాస్‌గా పెట్టుకొని రూ.58100 వద్ద కొనుగోలు చేయవచ్చునని, టార్గెట్ ధర రూ.59,000గా చెబుతున్నారు.
More From GoodReturns

ఇరాన్ యుద్దం వేళ బంగారంపై కన్నేసిన చైనా.. టన్నుల కొద్ది పసిడి రహస్యంగా కొనుగోలు.. ధరల పెరుగదలపై ఆందోళన..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గనున్న బంగారం, వెండి ధరలు.. కారణం ఏంటంటే..

బంగారం, వెండి ధరలు: MCXలో లాభాలు, మధ్యప్రాచ్య ఉద్రిక్తతల ప్రభావంపై కీలక విషయాలు వెల్లడి!

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

బంగారం, వెండి ధరలు: ఇరాన్ వార్ కారణంగా భారత్‌లో భారీగా పెరిగిన ధరలు - కారణాలు, ప్రభావాలు

10 గ్రాములు బంగారం ధర రూ. 3 లక్షలకు చేరబోతోంది.. సంచలన అంచనాను విడుదల చేసిన క్రిస్ వుడ్..

బంగారం ధరలు ఢమాల్..ఈ రోజు ఎంత తగ్గిందో తెలిస్తే పండగ చేసుకుంటారు .. మార్చి 4,బుధవారం ధరలు ఇవే..

Gold silver: బంగారం, వెండి ధరల్లో మళ్ళీ కదలిక.. ప్రస్తుత మార్కెట్ పరిస్థితి ఎలా ఉందంటే..

బంగారం, వెండి ధరల పెరుగుదలపై నిపుణులు షాకింగ్ న్యూస్.. 10 గ్రాముల పసిడి రూ. 2 లక్షల పైమాటే..

బంగారం, వెండి కొనకపోయినా మీ జేబులు ఖాళీ అవ్వాల్సిందే.. ధరలు పెరిగితే తడిసి మోపేడే మీకు..



Click it and Unblock the Notifications