రూ.250 తగ్గిన బంగారం ధరలు, వెండి ఎంత ఉందంటే?
బంగారం ధరలు కాస్త శాంతించాయి. దేశ రాజధాని న్యూఢిల్లీలో పది గ్రాముల స్వచ్చమైన బంగారం రూ.300కు పైగా తగ్గి రూ.48,220 వద్ద ట్రేడ్ అయింది. వెండి ధర రూ.1290 వరకు తగ్గి రూ.71,925కు చేరుకుంది. నిన్న బంగారం రూ.48,542గా ఉంది. హైదరాబాద్‌లో బంగారం 10 గ్రాములు రూ.50,300గా ఉంది. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ బంగారం 1900 డాలర్లు దాటగా, ఔన్స్ వెండి 27 డాలర్లు క్రాస్ చేసింది. అమెరికా డాలర్ మారకంతో రూపాయి వ్యాల్యూ కాస్త పెరగడంతో పసిడి ధరలో మార్పు నమోదయినట్లుగా చెబుతున్నారు.

రూ.250 తగ్గిన బంగారం ధర
దేశీయ ఫ్యూచర్ మార్కెట్ మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్(MCX)లో 10 గ్రాముల జూన్ గోల్డ్ ఫ్యూచర్స్ నేడు సాయంత్రం సెషన్లో రూ.251.00 (-0.51%) తగ్గి రూ.48533.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.48,751.00 వద్ద ప్రారంభమైన ధర, రూ.48,870.00 వద్ద గరిష్టాన్ని తాకి, రూ.48,451.00 కనిష్టాన్ని తాకింది. ఆగస్ట్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.155.00 (-0.31%) క్షీణించి రూ.49070.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.49221.00 వద్ద ప్రారంభమైన ధర, రూ.49,332.00 గరిష్టాన్ని, రూ.48,950.00 వద్ద కనిష్టాన్ని తాకింది.

రూ.71,500 దిగువన వెండి
వెండి ఫ్యూచర్ ధరలు సాయంత్రానికి స్వల్పంగా పెరిగాయి. జూలై సిల్వర్ ఫ్యూచర్స్ నేడు సాయంత్రం సెషన్లో రూ.50.00 (0.07%) పెరిగి రూ.71461.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.71,337.00 వద్ద ప్రారంభమై, రూ.71,577.00 వద్ద గరిష్టాన్ని తాకి, రూ.70,915.00 వద్ద కనిష్టాన్ని తాకింది. సెప్టెంబర్ సిల్వర్ ఫ్యూచర్స్ రూ.51.00 (0.07%) పెరిగి రూ.72642.00 వద్ద ట్రేడ్ అయింది. 72,525.00 వద్ద ప్రారంభమైన ధర, రూ.72,642.00 గరిష్టాన్ని, రూ.72,100.00 కనిష్టాన్ని తాకింది

అంతర్జాతీయ మార్కెట్లో...
అంతర్జాతీయ ఫ్యూచర్ మార్కెట్లోను బంగారం ధరలు తగ్గాయి. 1900 డాలర్ల దిగువకు వచ్చాయి. అంతర్జాతీయ మార్కెట్లో గోల్డ్ ఫ్యూచర్స్ నేడు -8.80
(0.46%) డాలర్లు తగ్గి 1,892.40 డాలర్ల వద్ద కదలాడింది. నేటి సెషన్లో 1,888.30 - 1,903.90 డాలర్ల మధ్య కదలాడింది. సిల్వర్ ఫ్యూచర్స్ కూడా పెరిగింది. 0.010 (0.04%) డాలర్లు తగ్గి 27.867 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. నేటి సెషన్లో 27.587 - 27.890 డాలర్ల మధ్య కదలాడింది.


Click it and Unblock the Notifications