Gold Price Today: ఆల్ టైమ్ గరిష్టంతో రూ.8600 తక్కువగా పసిడి
నేడు(జూలై 22) గోల్డ్ ఫ్యూచర్స్ ధరలు దాదాపు స్థిరంగా ఉన్నాయి. ఉదయం స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు సాయంత్రానికి అదే స్థాయిలో పెరిగాయి. గతవారం రూ.48,500 స్థాయికి చేరుకున్న గోల్డ్ ఫ్యూచర్స్ నేడు రూ.47,600కి కాస్త అటుఇటుగా ట్రేడ్ అయ్యాయి. క్రితం సెషన్లోనే పసిడి ధరలు 48,000 దిగువకు పడిపోయాయి. నేడు ఉదయం మళ్లీ స్వల్పంగా తగ్గినప్పటికీ, సాయంత్రానికి కాస్త పెరిగాయి. దీంతో ఆగస్ట్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.57.00 (0.12%) పెరిగి రూ.47630.00 వద్ద ట్రేడ్ అయింది. అక్టోబర్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.34.00 (0.07%) పెరిగి రూ.47910.00 వద్ద ట్రేడ్ అయింది. గతవారంతో పోలిస్తే నేటికి రూ.1000 వరకు తగ్గింది. ఆల్ టైమ్ గరిష్టం రూ.56200తో రూ.8600 తక్కువగా ఉంది.
సిల్వర్ ఫ్యూచర్స్ ఉదయం తగ్గి, నేడు సాయంత్రానికి కాస్త పెరిగింది. సెప్టెంబర్ ఫ్యూచర్స్ రూ.67500 దిగువనే ఉంది. నేడు సెప్టెంబర్ సిల్వర్ ఫ్యూచర్స్ రూ.263.00 (0.39%) పెరిగి రూ.67400.00 వద్ద ట్రేడ్ అయింది. డిసెంబర్ సిల్వర్ ఫ్యూచర్స్ రూ.264.00 (0.39%) పెరిగి రూ.68627.00 వద్ద ట్రేడ్ అయింది.

అంతర్జాతీయ మార్కెట్లోను గోల్డ్ ఫ్యూచర్ స్వల్పంగా పెరిగింది. ఓ సమయంలో 1850 డాలర్ల దిశగా పరుగులు పెట్టిన గోల్డ్ ఫ్యూచర్స్ నిన్న భారీగా తగ్గి, నేడు సాయంత్రానికి కాస్త పెరిగింది. నేడు 2.65 (0.15%) డాలర్లు పెరిగిన పసిడి ధర 1806.05 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. నేటి సెషన్లో 1,792.50 - 1,808.35 డాలర్ల మధ్య కదలాడింది. సిల్వర్ ఫ్యూచర్స్ 0.108
(0.43%) డాలర్లు తగ్గి 25.363 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది.


Click it and Unblock the Notifications