Gold Price Today: గతవారం బంగారం ధరలు ఎలా ఉన్నాయి, 2021లో ఎలా ఉండనున్నాయి?
బంగారం ధరలు గతవారం స్వల్పంగా పెరుగుదలను నమోదు చేశాయి. అయితే గతవారం రూ.48,000 దిగువనే ప్రారంభమై, ఆ తర్వాత అదే దిగువన ముగిశాయి. అంతకుముందు వారం గోల్డ్ ఫ్యూచర్స్ ఓ సమయంలో రూ.48,000 క్రాస్ చేసింది. గతవారం కూడా గోల్డ్ ఫ్యూచర్స్ రూ.48,000 క్రాస్ చేసి ఆ తర్వాత క్షీణించాయి. చివరి సెషన్‌లో ఆగస్ట్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.406.00 (-0.84%) క్షీణించి రూ.47,875.00 ట్రేడ్ అయింది. అక్టోబర్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.364.00 (-0.75%) తగ్గి రూ.48032.00 వద్ద ముగిసింది. ఇక సిల్వర్ ధరలు రూ.68,000 దిగువన ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్లో గోల్డ్ ఫ్యూచర్స్ 1800 డాలర్లు క్రాస్ చేసింది. గోల్డ్ ఫ్యూచర్స్ 1812 డాలర్ల వద్ద ముగిసింది. సిల్వర్ ఫ్యూచర్స్ 25.547 డాలర్ల వద్ద ముగిసింది.
గతవారం అంతర్జాతీయ మార్కెట్లో గోల్డ్ ఫ్యూచర్ ధరలు రికార్డ్ స్థాయిలో 1830 డాలర్లకు చేరుకున్నాయి. ఆ తర్వాత స్వల్పంగా క్షీణించాయి. బంగారం ధరలు ఈ ఏడాదిలో అంటే 2021లో సగటున దాదాపు 1812 డాలర్లకు కాస్త అటు ఇటు ఉండవచ్చునని, 2022 నాటికి 1785కు పడిపోవచ్చునని మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు.
బంగారం ధరలు 2021 క్యాలెండర్ ఏడాది మూడో త్రైమాసికంలో సగటున 1835 డాలర్లు నాలుగో త్రైమాసికంలో సగటన 1841 డాలర్లుగా ఉండవచ్చునని, పూర్తి సంవత్సరానికి ఇది 1812 డాలర్లుగా ఉండే అవకాశముందని, అదే సమయంలో వచ్చే క్యాలెండర్ ఏడాదిలో మాత్రం 1785 డాలర్లుగా నమోదు కావొచ్చునని చెబుతున్నారు.

అంతర్జాతీయ మార్కెట్లో వెండి ధరలు ఈ ఏడాది సగటున 26.50, 2022లో ప్రస్తుత స్థాయి కంటే 25 డాలర్లుగా నమోదు కావొచ్చునని బులియన్ మార్కెట్ నిపుణుల అంచనా.
వివిధ నగరాల్లో ధరలు
దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల బంగారం రూ.47,380, 24 క్యారెట్ల పసిడి రూ.48,380, ఢిల్లీలో 22 క్యాెట్లు రూ.47,140, 24 క్యారెట్లు రూ.51,430, చెన్నైలో 22 క్యారెట్ల పసిడి రూ.45,470, 24 క్యారెట్ల బంగారం రూ.రూ.49,610, కోల్‌కతాలో 22 క్యారెట్ల బంగారం రూ.47,550, 24 క్యారెట్ల బంగారం రూ.50,250గా నమోదయింది.


Click it and Unblock the Notifications