For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మళ్లీ పెరిగిన బంగారం, వెండి ధరలు: అక్కడ వెండి 25 డాలర్లకు...

|

బంగారం, వెండి ధరలు సోమవారం (అక్టోబర్ 19) పెరిగాయి. సాయంత్రం సెషన్ సమయానికి బంగారం 10 గ్రాములు రూ.175 వరకు, వెండి కిలో రూ.800 వరకు లాభపడింది. గోల్డ్ డిసెంబర్ ఫ్యూచర్స్ రూ.174(0.34 శాతం) పెరిగి రూ.50,721 పలికింది. ఉదయం రూ.50,552 వద్ద ట్రేడింగ్ ప్రారంభం కాగా, రూ.50,940 వద్ద గరిష్టాన్ని తాకింది. రూ.50,437 వద్ద కనిష్టాన్ని తాకింది. ఆగస్ట్ 7న బంగారం రూ.56,200 వద్ద ఆల్ టైమ్ గరిష్టాన్ని తాకిన విషయం తెలిసిందే. ఆ ధరతో రూ.5,500 తక్కువ పలికింది. కరోనా నేపథ్యంలో పసిడి ధరలు ఈ ఏడాది 25 శాతానికి పైగా పెరిగాయి.

పెరిగిన బంగారం ధర

పెరిగిన బంగారం ధర

ఫిబ్రవరి గోల్డ్ ఫ్యూచర్స్ రూ.171 (0.34శాతం) పెరిగి రూ.50,800 వద్ద ట్రేడ్ అయింది. రూ.50,542 వద్ద ప్రారంభమైన ధర, రూ.51,005 వద్ద గరిష్టాన్ని, రూ.50,542 వద్ద కనిష్టాన్ని తాకింది. ఎంసీఎక్స్‌లో ఈ వారం బంగారం మద్దతు ధర రూ.50,300-50100, నిరోధకస్థాయి రూ.50,920. వెండి మద్దతు ధర రూ.61,000-రూ.60,500. నిరోధకస్థాయి రూ.62,300-రూ.63,000.

వెండి ధర కూడా పెరుగుదల

వెండి ధర కూడా పెరుగుదల

బంగారం బాటలోనే వెండి నడిచింది. వెండి డిసెంబర్ ఫ్యూచర్స్ కిలో రూ.804 (1.30 శాతం) పెరిగి రూ.62,480 పలికింది. రూ.61,462 వద్ద ప్రారంభమై, రూ.63,280 వద్ద గరిష్టాన్ని తాకి రూ.61,177 వద్ద కనిష్టాన్ని తాకింది.

ఫిబ్రవరి సిల్వర్ ఫ్యూచర్ కూడా రూ.826 (1.31 శాతం) పెరిగి రూ.64,072 పలికింది. రూ.62,997 వద్ద ప్రారంభమై, రూ.64,700 వద్ద గరిష్టాన్ని, రూ.62,870 కనిష్టాన్ని తాకింది.

25 డాలర్లకు వెండి

25 డాలర్లకు వెండి

అంతర్జాతీయ ఫ్యూచర్ మార్కెట్లోను పసిడి ధరలు పెరిగాయి. డిసెంబర్ గోల్డ్ ఫ్యూచర్స్ 0.22 శాతం ఎగిసి ఔన్స్ ధర 1,910.65 డాలర్లు పలికింది. 1,900.25 - 1,922.75 డాలర్ల మధ్య ట్రేడ్ అయింది. అంతకుముందు సెషన్‌లో 1,906.40 డాలర్ల వద్ద క్లోజ్ అయింది. వెండి ఫ్యూచర్స్ 1.23 శాతం ఎగిసి ఔన్స్ ధర 24.705 డాలర్లు పలికింది. 24.223 - 25.120 డాలర్ల మధ్య ట్రేడ్ అయింది. క్రితం సెషన్‌లో 24,405 డాలర్ల వద్ద ముగిసింది.

English summary

మళ్లీ పెరిగిన బంగారం, వెండి ధరలు: అక్కడ వెండి 25 డాలర్లకు... | Gold price today: Yellow metal rises to Rs 50,721

Indian Gold MCX December Futures fell marginally on Monday despite a positive trend seen in the international spot prices, but experts feel that investors will be better off buying the dip.
Story first published: Monday, October 19, 2020, 21:28 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X