నిన్న భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు నేడు(జూన్ 18) మళ్లీ పెరిగాయి. దేశీయ, అంతర్జాతీయ ఫ్యూచర్ మార్కెట్లోను ఈ రెండింటి ధరలు ఎగిశాయి. నిన్న ఒక్కరోజే ఎంసీఎక్స్‌లో గోల్డ్ ఫ్యూచర్స్ రూ.1600, వెండి రూ.4వేల వరకు తగ్గింది. అయితే నేడు స్వల్పంగా పెరిగాయి. వెండి ధరలు కూడా రూ.1000కి పైగా పెరిగాయి. అంతర్జాతీయ మార్కెట్లో 1775 డాలర్ల దిగువకు వచ్చిన గోల్డ్ ఫ్యూచర్స్, నేడు మళ్లీ 1800 డాలర్లకు చేరుకున్నాయి. బంగారం ఆల్ టైమ్ గరిష్టం రూ.56200తో పోలిస్తే రూ.9000 తక్కువగా ఉంది.

పెరిగిన బంగారం ధరల
దేశీయ ఫ్యూచర్ మార్కెట్ మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్(MCX)లో 10 గ్రాముల ఆగస్ట్ గోల్డ్ ఫ్యూచర్స్ నేటి మధ్యాహ్నం సెషన్లో రూ.176.00 (0.37%) పెరిగి రూ.47134.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.47,147.00 వద్ద ప్రారంభమైన ధర, రూ.47,387.00 వద్ద గరిష్టాన్ని తాకి, రూ.46,962.00 కనిష్టాన్ని తాకింది. అక్టోబర్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.210.00 (0.44%) పెరిగి రూ.47486.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.47,415.00 వద్ద ప్రారంభమైన ధర, రూ.47,566.00 గరిష్టాన్ని, రూ.47,360.00 వద్ద కనిష్టాన్ని తాకింది.

రూ.1100 పెరిగిన వెండి
జూలై సిల్వర్ ఫ్యూచర్స్ సాయంత్రం సెషన్లో రూ.1,129.00 (1.67%) పెరిగి రూ.68728.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.68,417.00 వద్ద ప్రారంభమై, రూ.68,728.00 వద్ద గరిష్టాన్ని తాకి, రూ.68,081.00 వద్ద కనిష్టాన్ని తాకింది. సెప్టెంబర్ సిల్వర్ ఫ్యూచర్స్ రూ.1,089.00 (1.59%) పెరిగి రూ.69715.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.69,324.00 వద్ద ప్రారంభమైన ధర, రూ.69,721.00 గరిష్టాన్ని, రూ.69,104.00 కనిష్టాన్ని తాకింది.

అంతర్జాతీయ మార్కెట్లో...
అంతర్జాతీయ ఫ్యూచర్ మార్కెట్లో బంగారం నేడు మళ్లీ పెరిగాయి. అంతర్జాతీయ మార్కెట్లో గోల్డ్ ఫ్యూచర్స్ నేడు 20.10 (1.13%)డాలర్లు పెరిగి 1,794.90 డాలర్ల వద్ద కదలాడింది. నేటి సెషన్లో 1,773.85 - 1,795.10 డాలర్ల మధ్య కదలాడింది. సిల్వర్ ఫ్యూచర్స్ కూడా పెరిగింది 0.627 (2.42%) డాలర్లు పెరిగి 26.483 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. నేటి సెషన్లో 25.930 - 26.453 డాలర్ల మధ్య కదలాడింది.
More From GoodReturns

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

Gold: రాబోయే 2 ఏళ్లలో బంగారంపై భారీ లాభాలు.. ఇన్వెస్టర్లు అప్రమత్తం!

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

Gold: గోల్డ్ లవర్స్‌కు గుడ్ న్యూస్! భారీ పతనం తర్వాత కోలుకుంటున్న పసిడి.. నిపుణుల అంచనా ఇదే.!

బంగారం, వెండి ధరలు తగ్గాయని సంబరాలు వద్దు.. పసిడి పెరుగుదలపై షాకింగ్ న్యూస్ చెప్పిన బ్యాంకింగ్ దిగ్గజం..

బంగారం ధరలు పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎంతకు చేరిందంటే.. మార్చి 31, మంగళవారం ధరలు ఇవే..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Today Gold Silver Rate Live: తగ్గిన వెండి ధర.. పెరిగిన బంగారం ధర.. కారణం ఏంటంటే..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

బంగారం, వెండి ధరలు ఈ వారం ఎలా ఉండబోతున్నాయి..వరుస సెలవులు కాపాడుతాయా..కొంపలు ముంచుతాయా..

ఓ వైపు బంగారం.. మరో వైపు చమురు.. ఇరాన్ యుద్ధం వేళ రష్యా దిమ్మతిరిగే ప్లాన్..



Click it and Unblock the Notifications