మళ్లీ పెరిగిన బంగారం ధరలు, ఐనా రూ.49,000కు దిగువనే..
బంగారం, వెండి ధరలు నేడు (బుధవారం 16, జూన్) స్వల్పంగా పెరిగాయి. ఫ్యూచర్ మార్కెట్ మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్‌లో గతవారం రూ.49,000 క్రాస్ చేసిన గోల్డ్ ఫ్యూచర్స్ ఈ వారం కాస్త శాంతించింది. దీంతో నిన్న రూ.48,500 దిగువకు వచ్చింది. నేడు స్వల్పంగా పెరిగి ఈ మార్కును దాటింది. అలాగే సిల్వర్ ఫ్యూచర్స్ రూ.300కు పైగా పెరిగి రూ.71,500 దాటింది. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ఔన్స్ 1860 డాలర్లు దాటగా, సిల్వర్ ఫ్యూచర్స్ 28 డాలర్ల దిగువనే ఉంది. గత ఏడాది ఆగస్ట్ నాటి ఆల్ టైమ్ గరిష్టం రూ.56200తో పోలిస్తే రూ.7600 తక్కువగా ఉంది.

పెరిగిన బంగారం ధరలు
దేశీయ ఫ్యూచర్ మార్కెట్ మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్(MCX)లో 10 గ్రాముల ఆగస్ట్ గోల్డ్ ఫ్యూచర్స్ నేటి మధ్యాహ్నం సెషన్లో రూ.120.00 (0.25%) పెరిగి రూ.48544.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.48,458.00 వద్ద ప్రారంభమైన ధర, రూ.48,564.00 వద్ద గరిష్టాన్ని తాకి, రూ.48,445.00 కనిష్టాన్ని తాకింది. అక్టోబర్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.78.00 (0.16%) పెరిగి రూ.48846.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.48,812.000 వద్ద ప్రారంభమైన ధర, రూ.48,855.00 గరిష్టాన్ని, రూ.48,796.00 వద్ద కనిష్టాన్ని తాకింది.

వెండి రూ.350 జంప్
జూలై సిల్వర్ ఫ్యూచర్స్ సాయంత్రం సెషన్లో రూ.358.00 (0.50%) పెరిగి రూ.71606.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.71,500.00 వద్ద ప్రారంభమై, రూ.71,660.00 వద్ద గరిష్టాన్ని తాకి, రూ.71,444.00 వద్ద కనిష్టాన్ని తాకింది. సెప్టెంబర్ సిల్వర్ ఫ్యూచర్స్ రూ.408.00 (0.56%) పెరిగి రూ.72830.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.72,678.00 వద్ద ప్రారంభమైన ధర, రూ.72,833.00 గరిష్టాన్ని, రూ.72,650.00 కనిష్టాన్ని తాకింది

అంతర్జాతీయ మార్కెట్లో...
అంతర్జాతీయ ఫ్యూచర్ మార్కెట్లో బంగారం నేడు పెరిగాయి. అంతర్జాతీయ మార్కెట్లో గోల్డ్ ఫ్యూచర్స్ నేడు 5.55 (0.30%) డాలర్లు పెరిగి 1,861.75 డాలర్ల వద్ద కదలాడింది. నేటి సెషన్లో 1,854.90 - 1,862.85 డాలర్ల మధ్య కదలాడింది. సిల్వర్ ఫ్యూచర్స్ కూడా పెరిగింది. 0.190 (0.69%) డాలర్లు పెరిగి 27.887 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. నేటి సెషన్లో 27.718 - 27.913 డాలర్ల మధ్య కదలాడింది.


Click it and Unblock the Notifications