దేశీయ, అంతర్జాతీయ ఫ్యూచర్ మార్కెట్లో పసిడి ధరలు మళ్లీ పెరిగాయి. బంగారం రూ.200కు పైగా పెరగగా, వెండి రూ.700కు పైగా పెరిగింది. దీంతో బంగారం రూ.48,000 దిశగా, వెండి రూ.71,500 దిశగా వెళ్తోంది. అంతర్జాతీయ మార్కెట్లో నిన్న 1,825 డాలర్ల దిగువకు వచ్చిన పసిడి నేడు 1840 డాలర్లకు సమీపంలో ఉంది. వెండి ఫ్యూచర్స్ 27.500 డాలర్లకు సమీపంలో ఉంది. బంగారం ఆల్ టైమ్ గరిష్టం రూ.56,200తో పోలిస్తే ఇప్పటికీ రూ.8600 తక్కువగా ఉంది.

స్వల్పంగా పెరిగిన బంగారం ధర
దేశీయ ఫ్యూచర్ మార్కెట్ మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్(MCX)లో 10 గ్రాముల జూన్ గోల్డ్ ఫ్యూచర్స్ నేడు సాయంత్రం సెషన్లో రూ.234.00 (0.49%) పెరిగి రూ.47672.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.47,368.00 వద్ద ప్రారంభమైన ధర, రూ.47,711.00 గరిష్టాన్ని, రూ.47,337.00 కనిష్టాన్ని తాకింది. ఆగస్ట్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.221.00 (0.46%) పెరిగి రూ.48166.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.47,889.00 వద్ద ప్రారంభమై, రూ.48,168.00 గరిష్టాన్ని, రూ.47,820.00 వద్ద కనిష్టాన్ని తాకింది.

రూ.71,000 పైకి వెండి
వెండి ఫ్యూచర్ ధరలు నేడు పెరిగాయి. జూలై సిల్వర్ ఫ్యూచర్స్ నేడు సాయంత్రం సెషన్లో రూ.727.00 (1.03%) పెరిగి రూ.71200.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.70,355.00 వద్ద ప్రారంభమై, రూ.71,460.00 గరిష్టాన్ని, రూ.70,085.00 వద్ద కనిష్టాన్ని తాకింది. సెప్టెంబర్ సిల్వర్ ఫ్యూచర్స్ రూ.787.00 (1.10%) పెరిగి రూ.72389.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.71,500.00 ప్రారంభమైన ధర, రూ.72,500.00 వద్ద గరిష్టాన్ని, రూ.71,250.00 కనిష్టాన్ని తాకింది.

అంతర్జాతీయ మార్కెట్లోను...
అంతర్జాతీయ ఫ్యూచర్ మార్కెట్లోను బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. 1840 డాలర్ల సమీపానికి చేరుకుంది. అంతర్జాతీయ మార్కెట్లో గోల్డ్ ఫ్యూచర్స్ నేడు 15.15 (0.83%) డాలర్లు పెరిగి 1,839.15 డాలర్ల వద్ద కదలాడింది. నేటి సెషన్లో 1,819.45 - 1,841.40 డాలర్ల మధ్య కదలాడింది. సిల్వర్ ఫ్యూచర్స్ కూడా పెరిగింది. 0.379 (1.40%) డాలర్లు పెరిగి 27.438 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. నేటి సెషన్లో 26.927 - 27.590 డాలర్ల మధ్య కదలాడింది.
More From GoodReturns

భారీగా పెరిగిన బంగారం ధరలు.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎంతకు చేరిందంటే.. ఏప్రిల్ 1, బుధవారం ధరలు ఇవే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం, వెండి ధరలు భారీగా తగ్గాలంటే రూపాయి బలపడాల్సిందే.. ఆర్థిక నిపుణులు ఏమంటున్నారంటే..

Today Gold Silver Rate Live: తగ్గిన వెండి ధర.. పెరిగిన బంగారం ధర.. కారణం ఏంటంటే..

బంగారం, వెండి ధరలు తగ్గాయని సంబరాలు వద్దు.. పసిడి పెరుగుదలపై షాకింగ్ న్యూస్ చెప్పిన బ్యాంకింగ్ దిగ్గజం..

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

బంగారం ధరలు పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎంతకు చేరిందంటే.. మార్చి 31, మంగళవారం ధరలు ఇవే..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు



Click it and Unblock the Notifications