For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బంగారం ధరలు భారీగా పెరిగాయి, ఫ్యూచర్ మార్కెట్లో మాత్రం డౌన్!

|

ముంబై: బంగారం ధరలు ఈరోజు(సెప్టెంబర్ 25, శుక్రవారం) మిశ్రమంగా ఉన్నాయి. బులియన్ మార్కెట్లు ధరలు భారీగా పెరిగాయి. అదే సమయంలో ఫ్యూచర్ మార్కెట్లో సాయంత్రం సెషన్ వరకు ధరలు తగ్గాయి. మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్(MCX)లో అక్టోబర్ గోల్డ్ ఫ్యూచర్స్ 10 గ్రాములు 0.8 శాతం క్షీణించి రూ.49,486 పలికింది. ఐదు రోజుల్లో ఇది నాలుగో తగ్గుదల. గత సెషన్‌లో పసిడి రూ.300 మేర పెరిగింది. వెండి కిలో రూ.1,060 వరకు పెరిగింది. ఆగస్ట్ 7 రికార్డ్ ధర రూ.56,200 నుండి పసిడి ఇప్పటికీ రూ.6,500 వరకు క్షీణించింది. ఈ నాలుగు రోజుల్లో రూ.2500 వరకు తగ్గింది.వెండి ఈ నాలుగు రోజుల్లో రూ.10 వేలు తగ్గగా, గరిష్ట ధర రూ.78వేల నుండి రూ.20 వేలు క్షీణించింది.

గోల్డ్ ఫ్యూచర్స్..

గోల్డ్ ఫ్యూచర్స్..

గోల్డ్ ఫ్యూచర్స్ అక్టోబర్ సాయంత్రం సమయానికి రూ.49,500 వరకు పలికింది. డిసెంబర్ ఫ్యూచర్స్ కూడా దాదాపు అంతే పలికింది. అక్టోబర్ ఫ్యూచర్స్ 3,967 లాట్లు, డిసెంబర్ ఫ్యూచర్స్ 13,311 లాట్లుగా ఉంది. అక్టోబర్ ఫ్యూచర్స్ వ్యాల్యూ రూ.1,046.11 కోట్లు కాగా, డిసెంబర్ ఫ్యూచర్స్3,054.34 కోట్లుగా ఉంది. గోల్డ్ మినీ అక్టోబర్ రూ.450కి పైగా క్షీణించి రూ.49,490 పలికింది. బిజినెస్ టర్నోవర్ 8,173 లాట్లుగా ఉంది. అయితే వెండి కిలో వెయ్యి రూపాయలకు పైగా పెరిగింది.

బులియన్ మార్కెట్లో భారీగా పెరుగుదల

బులియన్ మార్కెట్లో భారీగా పెరుగుదల

బులియన్ మార్కెట్లో పసిడి ధర పెరిగింది. దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల పసిడి రూ.324 తగ్గి రూ.50,824 పలికింది. ఢిల్లీలో కిలో వెండి ధర రూ.2,124 పెరిగి రూ.60,536కు చేరుకుంది. ఢిల్లీలో స్పాట్ గోల్డ్ 24క్యారెట్ల పసిడి రూ.324 తగ్గిందని, అంతర్జాతీయంగా రికవరీయే ఇందుకు కారణమని బులియన్ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.

అంతర్జాతీయ మార్కెట్లో..

అంతర్జాతీయ మార్కెట్లో..

అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ధరలు ఔన్స్ 1873 డాలర్లు పలికాయి. వెండి ఫ్లాట్‌గా 23 డాలర్ల వద్ద ఉంది. అమెరికాలో మరో ఉద్దీపన ప్యాకేజీ ఉంటుందని, ఇందుకు సభ్యులు అంగీకరించారనే వార్తల నేపథ్యంలో డాలర్ వ్యాల్యూ పడిపోయింది. దీంతో బంగారం ధర పెరిగిందని బులియన్ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.

బంగారంపై పెట్టుబడికి దీర్ఘకాల ధోరణి అయితే అనుకూలం. స్వల్పకాలంలో ప్రస్తుత పరిస్థితిని బట్టి మరింతగా తగ్గే అవకాశాలు కొట్టి పారేయలేమని అంటున్నారు. రూ.45వేల నుండి రూ.47వేల మధ్య కొనుగోలుకు మద్దతు లభించవచ్చునని భావిస్తున్నారు. వెండి కిలో స్టాప్ లాస్ రూ.58,700, టార్గెట్ రూ.56,000గా ఉంది. అయితే ధరల పెరుగుదల, తగ్గుదల కరోనా కేసులు, డాలర్ వ్యాల్యూ, ఆర్థిక కార్యకలాపాలు, ఈక్విటీ మార్కెట్ పైన ఆధారపడి ఉంటుంది.

English summary

బంగారం ధరలు భారీగా పెరిగాయి, ఫ్యూచర్ మార్కెట్లో మాత్రం డౌన్! | Gold Price Today: Yellow metal rises by Rs 325, silver jumps Rs 2,125

Gold prices rose by Rs 324 to Rs 50,824 per 10 gram in the national capital on Friday, halting its four day decline on recovery in international price of the precious metal, according to HDFC Securities. The precious metal closed at Rs 50,500 per 10 gram in the previous trade.
Story first published: Friday, September 25, 2020, 21:48 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X