బంగారం ధరలు భారీగా పెరిగాయి. నిన్న దాదాపు రూ.200 పెరిగి రూ.47,000 క్రాస్ చేసిన గోల్డ్ ఫ్యూచర్స్ నేడు మరింత పెరిగాయి. దేశీయ ఫ్యూచర్ మార్కెట్ మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్(MCX)లో పది గ్రాముల గోల్డ్ ప్యూచర్స్ రూ.300కు పైగా పెరిగింది. వెండి కూడా దాదాపు రూ.500 పెరిగి రూ.68,600 దాటింది. నిన్నటి వరకు బంగారం రూ.47,000 దిగువన, వెండి రూ.68,000 దిగువన ట్రేడ్ అయింది. అయితే రెండు రోజుల వరుస పెంపుతో ధరలు ఈ మార్కును క్రాస్ చేశాయి. బంగారం ఆల్ టైమ్ గరిష్టం రూ.56200తో పోలిస్తే రూ.8,900 తక్కువగా ఉంది.

పెరిగిన బంగారం ధరలు
దేశీయ ఫ్యూచర్ మార్కెట్ మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్(MCX)లో 10 గ్రాముల ఆగస్ట్ గోల్డ్ ఫ్యూచర్స్ నేటి సాయంత్రం సెషన్లో రూ.325.00 (0.69%) పెరిగి రూ.47364.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.47,139.00 వద్ద ప్రారంభమైన ధర, రూ.47,430.00 వద్ద గరిష్టాన్ని తాకి, రూ.47,139.00 కనిష్టాన్ని తాకింది. అక్టోబర్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.297.00 (0.63%) పెరిగి రూ.47618.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.47,430.00 వద్ద ప్రారంభమైన ధర, రూ.47,690.00 గరిష్టాన్ని, రూ.47,421.00 వద్ద కనిష్టాన్ని తాకింది.

వెండి స్థిరంగా..
దేశీయ ఫ్యూచర్ మార్కెట్ మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్(MCX)లో 10 గ్రాముల జూలై సిల్వర్ ఫ్యూచర్స్ నేటి సాయంత్రం సెషన్లో రూ.485.00 (0.71%) పెరిగి రూ.68640.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.68,449.00 వద్ద ప్రారంభమైన ధర, రూ.68,721.00 వద్ద గరిష్టాన్ని తాకి, రూ.68,429.00 కనిష్టాన్ని తాకింది. సెప్టెంబర్ సిల్వర్ ఫ్యూచర్స్ రూ.476.00 (0.69%) పెరిగి రూ.69596.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.69,224.00 వద్ద ప్రారంభమైన ధర, రూ.69,683.00 గరిష్టాన్ని, రూ.69,224.00 వద్ద కనిష్టాన్ని తాకింది.

అంతర్జాతీయ మార్కెట్లోనూ పెరుగుదల
అంతర్జాతీయ ఫ్యూచర్ మార్కెట్లో బంగారం నేడు స్వల్పంగా పెరిగాయి. 1780 డాలర్ల పైకి చేరుకుంది. అంతర్జాతీయ మార్కెట్లో గోల్డ్ ఫ్యూచర్స్ నేడు 5.70 (0.32%) డాలర్లు పెరిగి 1,782.50 డాలర్ల వద్ద కదలాడింది. నేటి సెషన్లో 1,774.55 - 1,784.75 డాలర్ల మధ్య కదలాడింది. సిల్వర్ ఫ్యూచర్స్ కూడా పెరిగింది. 0.163 (0.63%) డాలర్లు పెరిగి 26.238 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. నేటి సెషన్లో 26.098 - 26.267 డాలర్ల మధ్య కదలాడింది.
More From GoodReturns

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

భారీగా పెరిగిన బంగారం ధరలు.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎంతకు చేరిందంటే.. ఏప్రిల్ 1, బుధవారం ధరలు ఇవే..

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Gold: రాబోయే 2 ఏళ్లలో బంగారంపై భారీ లాభాలు.. ఇన్వెస్టర్లు అప్రమత్తం!

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన వెండి, పసిడి ధరలు,..పుంజుకున్న రూపాయి

Today Gold Silver Rate Live: కుప్పకూలిన బంగారం, వెండి ధరలు..కొంపలు ముంచుతున్న ట్రంప్ నిర్ణయాలు

బంగారం ధరలు పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎంతకు చేరిందంటే.. మార్చి 31, మంగళవారం ధరలు ఇవే..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Today Gold Silver Rate Live: తగ్గిన వెండి ధర.. పెరిగిన బంగారం ధర.. కారణం ఏంటంటే..

బంగారం, వెండి ధరలు ఈ వారం ఎలా ఉండబోతున్నాయి..వరుస సెలవులు కాపాడుతాయా..కొంపలు ముంచుతాయా..

ఓ వైపు బంగారం.. మరో వైపు చమురు.. ఇరాన్ యుద్ధం వేళ రష్యా దిమ్మతిరిగే ప్లాన్..



Click it and Unblock the Notifications