Gold Price Today: బంగారం ధరలు పెరిగాయి కానీ.. ఆ స్థాయి దిగువనే
బంగారం ధరలు దాదాపు స్థిరంగా ఉన్నాయి. అయితే దేశీయ, అంతర్జాతీయ మార్కెట్లో నేడు మళ్లీ కాస్త పెరిగాయి. దీంతో కామెక్స్‌లో గోల్డ్ ఫ్యూచర్ ధరలు 1800 డాలర్ల మార్కును దాటాయి. దేశీయ మార్కెట్ మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్(MCX)లో మాత్రం రూ.45,000కు దిగువనే ఉన్నాయి. సిల్వర్ ఫ్యూచర్స్ రూ.61,000కు సమీపంలో ఉన్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో 23 డాలర్ల దిగువన ఉంది. ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్న కారణంగా పసిడి, వెండి ధరలు కాస్త పుంజుకున్నాయి. అయినప్పటికీ ఇన్వెస్టర్లు ఆచితూచి వ్యవహరిస్తున్నారు.

రూ.47,500కు దిగువనే పసిడి
దేశీయ ఫ్యూచర్ మార్కెట్ మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్ (MCX)లో ఫిబ్రవరి గోల్డ్ ఫ్యూచర్స్ రూ.41 పెరిగి రూ.47,496 వద్ద, ఏప్రిల్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.82 లాభపడి రూ.47,640 వద్ద ట్రేడ్ అయింది. కామెక్స్‌లో గోల్డ్ ఫ్యూచర్స్ రూ.6.45 డాలర్లు లేదా 0.36 శాతం లాభపడి 1805.25 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. ఏడాదిలో పసిడి ధర 2.67 శాతం క్షీణించింది. క్రితం సెషన్లో 1798.80 డాలర్ల వద్ద క్లోజ్ అయింది. నేడు ఆరు డాలర్ల మేర పెరిగింది.

వెండి ఫ్యూచర్స్
వెండి ధరలు కూడా అతి స్వల్పంగా పెరిగాయి. ఎంసీఎక్స్‌లో మార్చి సిల్వర్ ఫ్యూచర్ రూ.58 పెరిగి రూ.60,725 వద్ద, మే సిల్వర్ ఫ్యూచర్స్ రూ.70 ఎగిసి రూ.61,415 వద్ద ట్రేడ్ అయింది. సిల్వర్ ఫ్యూచర్స్ 0.076 శాతం లేదా 0.34 శాతం లాభపడి 22.538 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. సిల్వర్ ఫ్యూచర్స్ ఏడాదిలో 10.25 శాతం క్షీణించింది. క్రితం సెషన్లో 22.462 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది.

మద్దతు ధర.. నిరోధకస్థాయి
బంగారం మద్దతు ధర 1788 డాలర్ల నుండి 1774, నిరోధకస్థాయి 1810 డాలర్ల నుండి 1822 డాలర్లు, సిల్వర్ నిరోధకస్థాయి 22.20 నుండి 21.84 డాలర్లు. దేశీయ ఫ్యూచర్ మార్కెట్ మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్‌లో గోల్డ్ ఫ్యూచర్స్ మద్దతు ధర రూ.47,300 నుండి రూ.47,100. నిరోధకస్థాయి రూ.47600 నుండి రూ.47,800. సిల్వర్ మద్దతు ధర రూ.60,350 నుండి రూ.60,000, నిరోధకస్థాయి రూ.47,600 నుండి రూ.47,800.


Click it and Unblock the Notifications