దేశీయ, అంతర్జాతీయ ఫ్యూచర్ మార్కెట్లో శుక్రవారం(అక్టోబర్ 23) పసిడి ధరలు స్వల్పంగా క్షీణించాయి. ఆర్థిక ప్యాకేజీపై చర్చలు ముందుకు సాగుతున్నట్లు గురువారం ప్రకటించారు. ఈ నేపథ్యంలో నిన్న ధరలు పెరిగాయి. అయితే మరో ప్రకటన రాకపోవడంతో ఇన్వెస్టర్లు ఆచితూచి వ్యవహరిస్తున్నారు. దీంతో దేశీయ, అంతర్జాతీయ మార్కెట్లో ధరలు దాదాపు స్థిరంగా (అతి స్వల్పంగా తగ్గి) ఉన్నాయి. మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్(MCX)లో డిసెంబర్ గోల్డ్ ఫ్యూచర్స్ 10 గ్రాములు రూ.29(0.06 శాతం) తగ్గి రూ.50,737.00 పలికింది. ఆల్ టైమ్ గరిష్టం రూ.56,200తో రూ.5,500 తక్కువగా ఉంది.

స్వల్పంగా తగ్గిన బంగారం ధర
డిసెంబర్ ఫ్యూచర్స్ రూ.29 క్షీణించగా, రూ.51,040 వద్ద కనిష్టాన్ని, రూ.50,643 వద్ద కనిష్టాన్ని తాకింది. ఫిబ్రవరి ఫ్యూచర్స్ 10 గ్రాములు రూ.76 (0.15 శాతం) క్షీణించి రూ.50820.00 పలికింది. రూ.51,238 వద్ద గరిష్టాన్ని, రూ.50,788 వద్ద కనిష్టాన్ని తాకింది. ఇక వెండి ఫ్యూచర్స్ కిలో రూ.248 (0.40 శాతం) క్షీణించి రూ.62,367 వద్ద ట్రేడ్ అయింది. రూ.63,066 వద్ద గరిష్టాన్ని తాకి, రూ.62,160 వద్ద కనిష్టాన్ని తాకింది. మార్చి ఫ్యూచర్స్ రూ.123(0.19 శాతం) క్షీణించి కిలో రూ.63,979 పలికింది. రూ.64,724 వద్ద గరిష్టాన్ని, రూ.63,894 వద్ద కనిష్టాన్ని తాకింది.

అంతర్జాతీయ మార్కెట్లో...
అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ పసిడి 0.33 శాతం క్షీణించి 1,898.60 డాలర్లు వద్ద ట్రేడ్ అయింది. 1,895.65 - 1,917.25 డాలర్ల మధ్య తచ్చాడింది. క్రితం సెషన్లో 1904 వద్ద క్లోజ్ అయింది. వెండి ఫ్యూచర్స్ ఔన్స్ 0.25 శాతం క్షీణించి 24.648 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. 24.543 - 24.973 డాలర్ల మధ్య ట్రేడ్ అయింది. క్రితం సెషన్‌లో 24.709 డాలర్ల వద్ద ముగిసింది. బంగారం 2020 సంవత్సరంలో 25 శాతం మేర పెరిగింది. వెండి 38 శాతం పెరిగింది.

రూ.51,000 వద్ద నిరోధకత
బంగారం మద్దతు ధర రూ.50550-రూ.50300 మధ్య ఉండగా, రూ.5092-రూ.51100 మధ్య నిరోధకస్థాయి ఎదుర్కొంటుందని బులియన్ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. సిల్వర్ రూ.62000-61600 మద్దతు ధర కాగా, నిరోధకస్థాయి రూ.63200-64000 మధ్య ఉంటుంది.
More From GoodReturns

ఈ ఏడాది బంగారం, వెండి పెరుగుదలపై సంచలన నివేదిక.. ఏకంగా ఆ స్థాయి వరకు వెళుతుందంటున్న నిపుణులు..

బంగారం, వెండి ధరల పెరుగుదలపై కీలక అప్డేట్.. కొత్త లక్ష్యాలను విడుదల చేసిన ఆర్థిక నిపుణులు..

బంగారం, వెండి ధరలపై సస్పెన్స్.. ఆర్బీఐ నిర్ణయంతో రేట్లు తగ్గుతాయా..పెరుగుతాయా..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 7, మంగళవారం ధరలు ఇవే..

Gold: అత్యవసరంగా డబ్బు కావాలా? బంగారంతో ఉన్న 'లిక్విడిటీ' అడ్వాంటేజ్ గురించి మీకు తెలుసా?

బంగారం, వెండి ధరలు తగ్గాయి. తాజా రేట్లు ఇక్కడ చూడండి

Today Gold Silver Rate Live: ఇరాన్ ఉద్రిక్తతలతో మారుతున్న బంగారం ధరలు

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

Akshaya Tritiya: అక్షయ తృతీయ ఏ రోజు? కన్ఫ్యూజన్ వద్దు.. అసలైన ముహూర్తం ఇదే!

Gold: బంగారంపై రుణం కావాలా? గోల్డ్ లోన్ కంటే ఇదే బెస్ట్.. తక్కువ వడ్డీకే డబ్బు!

Gold silver: బంగారం, వెండి కొనాలా? వద్దా? మార్కెట్లో వింత పరిస్థితి.. నిపుణుల సలహా ఇదే!



Click it and Unblock the Notifications