బంగారం, వెండి ధరలు ఈరోజు(సెప్టెంబర్ 16, బుధవారం) కూడా పెరిగాయి. అమెరికా ఫెడ్ రిజర్వ్ నిర్ణయానికి ముందు బంగారం ఒత్తిడిని ఎదుర్కొంటోంది. మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్(MCX)లో 10 గ్రాముల పసిడి 0.08 శాతం ఎగిసి రూ.51,810 పలికింది. వెండి ఫ్యూచర్స్ 0.07 శాతం పెరిగి కిలో రూ.68,921 పలికింది. అంతకుముందు సెషన్‌లో పసిడి 0.16 శాతం పెరిగింది. రూ.51,770కి చేరుకుంది. వెండి మాత్రం క్రితం సెషన్‌లో కిలో రూ.0.20 శాతం తగ్గింది. గత నెల ఆగస్ట్ 7వ తేదీన పసిడి ధరలు 10 గ్రాములు రూ.56,200 పైకి చేరుకున్నాయి. రికార్డ్ గరిష్టం ధరతో పోలిస్తే ఇప్పటికీ రూ.4500 తక్కువగా ఉంది. వెండి గరిష్టం రూ.79 వేల సమీపానికి చేరుకోగా, తాజాగా ఆ ధరతో రూ.10వేల కంటే తక్కువగా ఉంది.

రూ.52,000కు సమీపంలో పసిడి ధరలు
బంగారం ధరలు చాలా రోజులకు రూ.52,000 సమీపానికి చేరుకున్నాయి. నిన్న ధరలు ఓ సమయంలో రూ.52వేల మార్క్ అందుకున్నాయి. వెండి డిసెంబర్ ఫ్యూచర్స్ రూ.69,700 దాటింది. ఇక అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ధరలు స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. స్పాట్ గోల్డ్ 0.2 శాతం క్షీణించి ఔన్స్ 1,952.15 డాలర్లు పలికింది. అంతకుముందు సెషన్‌లో 1,971.71 డాలర్లను కూడా తాకింది. ఇతర అతి ఖరీదైన లోహాల విషయానికి వస్తే వెండి 0.3 శాతం క్షీణించి 27.09 డాలర్లు, ప్లాటినమ్ 1.5 శాతం క్షీణించి 963.38 డాలర్లు, పల్లాడియం 0.9 శాతం క్షీణించి 2,388.29 డాలర్లు పలికింది.

బంగారం ధరలు అస్థిరంగా
కరోనా కేసులు, వ్యాక్సీన్ అంశాలపై ఇప్పటికీ అస్పష్టతనే ఉన్నందున బంగారం ధరలు అస్థిరంగా ఉండవచ్చునని బులియన్ మార్కెట్ నిపుణులు అంటున్నారు. అయితే ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు పెరుగుతున్న సవాళ్లు, ప్రధాన కేంద్ర బ్యాంకుల వైఖరి అంశాలు కూడా బంగారంపై ప్రభావం చూపుతాయి. అంతకుముందు సెషన్‌లో అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ధరలు రెండు వారాల గరిష్టాన్ని తాకింది. యూఎస్ ఫెడ్ పాలసీ కారణంగా ఇన్వెస్టర్లు ఆచితూచి వ్యవహరిస్తున్నారు. సిక్స్ బాస్కెట్‌లోని ఇతర కరెన్సీలతో పోలిస్తే డాలర్ వ్యాల్యూ స్థిరంగా ఉంది.

అంతర్జాతీయ మార్కెట్లో ఆ రేంజ్‌లోనే
అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ధరలు ఔన్స్ 1900 డాలర్ల నుండి 2000 డాలర్ల మధ్యనే తచ్చాడవచ్చునని అంతర్జాతీయ బులియన్ మార్కెట్ నిపుణులు అంటున్నారు. ఏదైనా కీలక పరిణామం చోటు చేసుకుంటే తప్ప ఈ స్టేజ్‌లోనే ఉంటాయని భావిస్తున్నారు. కరోనా కేసులు తగ్గడం, వ్యాక్సీన్ పైన ప్రకటన వంటి అంశాల ప్రభావం ఉంటుంది. ఇన్వెస్టర్లు కూడా ఆచితూచి వ్యవహరిస్తున్నారు.

రూ.500 పెరిగిన పసిడి, 2 రోజుల్లో రూ.1600 పెరిగి వెండి
ఈ రోజు హైదరాబాద్ మార్కెట్లో 10 గ్రాముల 24గ్రాముల పసిడి ధర రూ.500 వరకు పెరిగి రూ.54 వేల పైకి చేరుకుంది. హైదరాబాద్‌తో పాటు విజయవాడ, విశాఖ, చెన్నైలో రూ.54,030 పలికింది. ముంబైలో రూ.51,460 పలికింది. 22 క్యారెట్ల పసిడి హైదరాబాద్, విశాఖ, విజయవాడ, చెన్నైలో రూ.49,530 పలకగా, ముంబైలో రూ.50,460 పలికింది. వెండి ధర కూడా భారీగానే పెరిగింది. కిలో వెండి రూ.1200 వరకు పెరిగింది. దీంతో రూ.70వేల సమీపానికి చేరుకుంది. పరిశ్రమ యూనిట్లు, నాణెపు తయారీదారుల నుండి డిమాండ్ పుంజుకోవడం ఇందుకు ప్రధాన కారణం. వెండి ధర రెండు రోజుల్లో రూ.1600 పెరిగింది.
More From GoodReturns

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

బంగారం, వెండి ధరలు ఈ రేటుకు దిగి వస్తేనే కొనండి.. కీలక సూచన చేస్తున్న బులియన్ నిపుణులు

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పసిడి రేటు ఎంత వరకు ర్యాలీ చేసిందంటే.. ఏప్రిల్ 11, శనివారం ధరలు ఇవే..

Today Gold Silver Rate Live: తగ్గిన బంగారం, వెండి ధరలు.. తీవ్రమవుతున్న ఇరాన్ యుద్ధం

భగ్గుమన్న బంగారం ధరలు.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎంత వరకు వెళ్లిందంటే.. ఏప్రిల్ 8, బుధవారం ధరలు ఇవే..

బంగారం ధరల పతనంపై బిగ్ అలర్ట్.. ఈ రాత్రి గడిస్తే చాలురా దేవుడా అంటున్న ఇన్వెస్టర్లు..

Akshaya Tritiya: అక్షయ తృతీయ ఏ రోజు? కన్ఫ్యూజన్ వద్దు.. అసలైన ముహూర్తం ఇదే!

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

బంగారం, వెండి ధరలపై సస్పెన్స్.. ఆర్బీఐ నిర్ణయంతో రేట్లు తగ్గుతాయా..పెరుగుతాయా..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 7, మంగళవారం ధరలు ఇవే..

Today Gold Silver Rate Live: ట్రంప్ సీజ్ ఫైర్ ప్రకటన దెబ్బకు భారీగా పెరిగిన బంగారం ధరలు



Click it and Unblock the Notifications