బంగారం, వెండి ధరలు శుక్రవారం(నవంబర్ 20) వరుసగా రూ.400, రూ.1,000 వరకు పెరిగింది. దేశీయ ఫ్యూచర్ మార్కెట్ మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్(MCX)లో 10 గ్రాముల డిసెంబర్ గోల్డ్ ఫ్యూచర్స్ సాయంత్రం గం.9.12 సమయానికి రూ.396.00 (0.79%) పెరిగి రూ.50,388.00 పలికింది. వరుసగా నాలుగు రోజుల పాటు క్షీణించిన బంగారం ధరలు, ఈ రోజు పెరిగాయి. ఉదయం రూ.50,041.00 ప్రారంభమై, రూ.50,435.00 గరిష్టాన్ని తాకి, రూ.49,857.00 కనిష్టాన్ని తాకింది. ఆగస్ట్ 7వ తేదీ నాటి ఆల్ టైం గరిష్టం రూ.56,200తో రూ.58,000 తక్కువగా ఉంది.

రూ.400 తగ్గిన పసిడి ఫ్యూచర్స్
ఫిబ్రవరి ఫ్యూచర్స్ రూ.388.00 (0.78%) పెరిగి రూ.50,400.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.50,015.00 వద్ద ప్రారంభమై, రూ.50,450.00 గరిష్టాన్ని, రూ.49,928.00 వద్ద కనిష్టాన్ని తాకింది. పసిడి ధరలు గత రెండు నెలలుగా రూ.49,500 నుండి రూ.52,000 మధ్య ట్రేడ్ అవుతున్నాయి. ఇటీవల చాలా రోజులుగా రూ.50,000 పైన పలికిన పసిడి, నిన్న ఆ మార్కు దిగువకు వచ్చింది.

రూ.1,000కి పైగా పెరిగిన వెండి
సిల్వర్ ఫ్యూచర్స్ దాదాపు రూ.1000 వరకు పెరిగింది. కిలో డిసెంబర్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.995.00 (1.62%) పెరిగి రూ.62,505.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.61,610.00 ప్రారంభం కాగా, రూ.62,750.00 వద్ద గరిష్టాన్ని, రూ.61,560.00 వద్ద కనిష్టాన్ని తాకింది.
మార్చి ఫ్యూచర్స్ రూ.1,032.00 (1.63%) పెరిగి రూ.64,315.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.63,450.00 వద్ద ప్రారంభమై, రూ.64,525.00 వద్ద గరిష్టాన్ని, రూ.63,400.00 కనిష్టాన్ని తాకింది.

అంతర్జాతీయ మార్కెట్లో...
అంతర్జాతీయ మార్కెట్లో డిసెంబర్ గోల్డ్ ఫ్యూచర్స్ ఔన్స్ 15.45 (+0.83%) డాలర్లు పెరిగి 1,877 డాలర్ల వద్ద పలికింది. 1,859.30 - 1,879.05 డాలర్ల మధ్య ట్రేడ్ అయింది. క్రితం సెషన్లో 1861.50 డాలర్ల వద్ద ముగిసింది. ఈ ఏడాది పసిడి 24 శాతం మేర పెరిగింది.
ఔన్స్ వెండి ధర 0.370 (+1.54%) డాలర్లు పెరిగి 24.413 డాలర్లు పలికింది. ఈ రోజు 24.075 - 24.598 డాలర్ల మధ్య ట్రేడ్ అయింది. క్రితం సెషన్లో 24.048 డాలర్ల వద్ద ముగిసింది. ఈ ఏడాది వెండి 38.53 శాతం పెరిగింది.
More From GoodReturns

Today Gold Silver Rate Live: తగ్గిన బంగారం, వెండి ధరలు.. తీవ్రమవుతున్న ఇరాన్ యుద్ధం

Akshaya Tritiya: అక్షయ తృతీయ ఏ రోజు? కన్ఫ్యూజన్ వద్దు.. అసలైన ముహూర్తం ఇదే!

కుప్పకూలిన బంగారం ధరలు.. భారీ తగ్గుదలతో ఈ రోజు పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 9, గురువారం ధరలు ఇవే..

బంగారం, వెండి ధరల పెరుగుదలపై కీలక అప్డేట్.. కొత్త లక్ష్యాలను విడుదల చేసిన ఆర్థిక నిపుణులు..

బంగారం, వెండి ధరలపై సస్పెన్స్.. ఆర్బీఐ నిర్ణయంతో రేట్లు తగ్గుతాయా..పెరుగుతాయా..

బంగారం ధర పెరుగుదలపై షాకింగ్ న్యూస్.. ఏప్రిల్ నెలలో ఈ రేటును దాటడం ఖాయం అంటున్న నిపుణులు..

Today Gold Silver Rate Live: ట్రంప్ సీజ్ ఫైర్ ప్రకటన దెబ్బకు భారీగా పెరిగిన బంగారం ధరలు

Gold Price: భారీ రికార్డుల నుంచి దిగివచ్చిన పసిడి! లేటెస్ట్ గోల్డ్ రేట్లు ఇవే..!

Gold silver: బంగారం, వెండి కొనేవారికి అలర్ట్.. ఈ వారం ధరలు ఎలా ఉండబోతున్నాయి? నిపుణుల అంచనా ఇదే!

బంగారం ధర ఈ వారం ఎంత పెరిగిందో తెలుసా.. రూపాయి పైనే పెట్టుబడిదారుల ఆశలు.. ఎందుకంటే..

భారత ఫారెక్స్ రిజ్వర్వులను దెబ్బతీసిన ఇరాన్ యుద్ధం..భారీగా తగ్గిన బంగారం నిల్వలు..



Click it and Unblock the Notifications