బంగారం ధరలు నేడు (జూన్ 15, మంగళవారం) స్వల్పంగా పెరగగా, వెండి ధరలు క్షీణించాయి. అయినప్పటికీ గోల్డ్ ఫ్యూచర్ కీలక రూ.49,000 దిగువనే ఉన్నాయి. సిల్వర్ ఫ్యూచర్స్ నేడు మరింత క్షీణించి రూ.71,500 దిగువకు పతనమైంది. ఓ సమయంలో రూ.71,200 స్థాయికి పడిపోయింది. అంతర్జాతీయ మార్కెట్లోను పసిడి ధరలు స్వల్పంగా పెరగగా, వెండి ధరలు తగ్గాయి. ఎంసీఎక్స్‌లో ఆల్ టైమ్ గరిష్టం రూ.56,200తో బంగారం ధరలు రూ.7600 తక్కువగా ఉంది.

స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు
దేశీయ ఫ్యూచర్ మార్కెట్ మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్(MCX)లో 10 గ్రాముల ఆగస్ట్ గోల్డ్ ఫ్యూచర్స్ నేటి మధ్యాహ్నం సెషన్లో రూ.151.00 (0.31%) పెరిగి రూ.48674.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.48,509.00 వద్ద ప్రారంభమైన ధర, రూ.48,697.00 వద్ద గరిష్టాన్ని తాకి, రూ.48,472.00 కనిష్టాన్ని తాకింది. అక్టోబర్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.178.00 (0.36%) పెరిగి రూ.49007.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.48,815.00 వద్ద ప్రారంభమైన ధర, రూ.49,007.00 గరిష్టాన్ని, రూ.48,815.00 వద్ద కనిష్టాన్ని తాకింది.

వెండి మరింత పతనం
జూలై సిల్వర్ ఫ్యూచర్స్ మధ్యాహ్నం సెషన్లో రూ.389.00 (-0.54%) క్షీణించి రూ.71490.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.71,791.00 వద్ద ప్రారంభమై, రూ.71,791.00 వద్ద గరిష్టాన్ని తాకి, రూ.71,202.00 వద్ద కనిష్టాన్ని తాకింది. సెప్టెంబర్ సిల్వర్ ఫ్యూచర్స్ రూ.385.00 (-0.53%) తగ్గి రూ.72641.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.72,669.00 వద్ద ప్రారంభమైన ధర, రూ.72,715.00 గరిష్టాన్ని, రూ.72,422.00 కనిష్టాన్ని తాకింది

అంతర్జాతీయ మార్కెట్లో...
అంతర్జాతీయ ఫ్యూచర్ మార్కెట్లో బంగారం నేడు పెరిగాయి. అంతర్జాతీయ మార్కెట్లో గోల్డ్ ఫ్యూచర్స్ నేడు 2.60 (0.14%) డాలర్లు తగ్గి 1,868.50 డాలర్ల వద్ద కదలాడింది. నేటి సెషన్లో 1,860.25 - 1,870.85 డాలర్ల మధ్య కదలాడింది. సిల్వర్ ఫ్యూచర్స్ తగ్గింది. 0.202 (0.72%) డాలర్లు తగ్గి 27.837 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. నేటి సెషన్లో 27.698 - 28.027 డాలర్ల మధ్య కదలాడింది.
More From GoodReturns

ప్రయోగశాలలో పండించిన బంగారం వచ్చేస్తోంది.. ఇక పసిడి తవ్వకాలకు గుడ్ బై చెప్పడమే..

బంగారం ధరలు ఒక్కసారిగా తగ్గడంపై ఆశ్చర్యపోతున్న బులియన్ నిపుణులు.. భవిష్యత్ ర్యాలీపై తీవ్ర ఆందోళన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు ఎంత తగ్గిందో తెలిస్తే ఎగిరి గంతేయాల్సిందే.. మార్చి 12, గురువారం ధరలు ఇవే..

బంగారం ధరలు పెరిగాయి .. ఎంత పెరిగాయో తెలిస్తే పసిడి జోలికి పోరు.. మార్చి 11, బుధవారం ధరలు ఇవే..

బంగారం ధరల పెరుగుదలపై బాంబు పేల్చిన బ్యాంకింగ్ నిపుణులు.. పసిడి ర్యాలీ ఎంతవరకు అంటే..

బంగారం ధర పెరిగింది .. కొనుగోలు వెంటనే బంద్ చేయండి.. మార్చి 10, మంగళవారం ధరలు ఇవే..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

బంగారం ధరల పెరుగుదలపై షాకింగ్ న్యూస్.. సంచలన విషయాలను వెల్లడించిన SBI రీసెర్చ్..

యుద్ధాన్ని వదిలి బంగారంపై కన్నేసిన చైనా.. టన్నుల కొద్ది పసిడి రహస్యంగా కొనుగోలు.. ధరల పెరుగదలపై ఆందోళన..

Gold price: బంగారం, వెండి ధరల్లో మార్పు.. కారణాలివే..



Click it and Unblock the Notifications