రూ.1,000కి పైగా పెరిగిన బంగారం, రూ.4,000కు పైగా పెరిగిన వెండి
అమెరికా అధ్యక్ష ఎన్నికలపై స్పష్టత వచ్చింది. డెమోక్రటిక్ అభ్యర్థి జోబిడెన్ విజయం సాధించారు. ఈ నేపథ్యంలో గతవారం ఆచితూచి వ్యవహరించిన ఇన్వెస్టర్లు ఈ వారం స్పష్టంగా ముందుకు సాగే అవకాశాలు ఉన్నాయి. జోబిడెన్ అమెరికా ఆర్థిక వ్యవస్థపై ముందుకు వెళ్లే అంశాన్ని ఈక్విటీ, గోల్డ్ మార్కెట్ ఇన్వెస్టర్లు పరిగణలోకి తీసుకుంటారు. క్రితం వారం పసిడి ధరలు దేశీయ, అంతర్జాతీయ ఫ్యూచర్ మార్కెట్లో పెరిగాయి. బంగారం ధర పది గ్రాములు రూ.52వేల దాటింది.

వారంలో రూ.1000కి పైగా పెరిగిన బంగారం, వెండి భారీ షాక్
డిసెంబర్ గోల్డ్ ఫ్యూచర్స్ 10 గ్రాములు రూ.113.00 (0.22%) పెరిగి రూ.52,168.00 వద్ద, ఫిబ్రవరి ఫ్యూచర్స్ రూ.124.00 (0.24%) పెరిగి రూ.52,318.00 వద్ద ముగిసింది. కిలో వెండి డిసెంబర్ ఫ్యూచర్స్ రూ.65,355 పలికింది. చివరి సెషన్‌లో రూ.1,102 పెరిగింది. మార్చి ఫ్యూచర్స్ రూ.1,150 వరకు పెరిగి రూ.67,103కు చేరుకుంది. పసిడి ఆల్ టైమ్ గరిష్టం రూ.56,200తో 3900 వరకు తక్కువ ఉంది. క్రితం వారం వరకు రూ.5వేల నుండి రూ.6వేల వరకు తక్కువగా ఉంది. ఇప్పుడు అది రూ.4వేల దిగువకు వచ్చింది. గతవారం బంగరం ధర రూ.51వేల లోపు ఉంది. కానీ ఇప్పుడు రూ.52వేలు దాటింది. గతవారం రూ.వెయ్యికి పైగా పెరిగింది. వెండి రూ.61వేల నుండి రూ.65వేలకు పెరిగింది. రూ.4వేలు పెరిగినట్లు.

అంతర్జాతీయ మార్కెట్లో పసిడి, సిల్వర్ పెరుగుదల
అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ధరలు 0.27 శాతం పెరిగి 1,952.05 డాలర్లకు చేరుకుంది. ఔన్స్ గోల్డ్ ఫ్యూచర్స్ 1,937.25 - 1,961.75 డాలర్ల మధ్య పలికింది. అంతక్రితం సెషన్‌లో 1,946.80 డాలర్ల వద్ద క్లోజ్ అయింది. ఈ ఏడాది పసిడి 30.46 శాతం పెరిగింది.
వెండి ఔన్స్ ఫ్యూచర్స్ 2.05 శాతం పెరిగి 25.707 డాలర్లకు చేరుకుంది. 25.015 - 25.970 డాలర్ల మధ్య ట్రేడ్ అయింది. అంత క్రితం సెషన్లో 25.191 డాలర్లు పలికింది. ఏడాదిలో వెండి 50.01 శాతం పెరిగింది.

బంగారం ధరలకు అలవాటు
కరోనా మహమ్మారి తర్వాత బంగారం, వెండి ధరలు భారీగా పెరుగుతున్న విషయం తెలిసిందే. ఈ ఏడాది ప్రారంభంలో రూ.40వేల దిగువకు ఉన్న పసిడి ఏకంగా రూ.52వేలు దాటింది. అయితే ఆల్ టైమ్ గరిష్టం రూ.56వేల నుండి రూ.4వేల వరకు తక్కువగా ఉంది. పండుగ సమయంలో పసిడి ధరలు దాదాపు స్థిరంగా ఉన్నాయి. ఈ ధరలకు సామాన్యులు క్రమంగా అలవాటు పడుతున్నారు.


Click it and Unblock the Notifications