Gold price today: బంగారం షాక్, ఒక్కరోజే రూ.1100 పెరిగిన ధర
బంగారం ధరలు భారీగా షాకిచ్చాయి. నిన్న ఒక్క సెషన్‌లోనే ఏకంగా రూ.1100కు పైగా పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్లో గోల్డ్ ఫ్యూచర్స్ ఏకంగా 2000 డాలర్లు దాటింది. 2020 ఆగస్ట్ 7వ తేదీన ఎంసీఎక్స్‌లో గోల్డ్ ఫ్యూచర్స్ రూ.56,200, అంతర్జాతీయ మార్కెట్ కామెక్స్‌లో 2075 డాలర్లు పలికింది. ఇప్పుడు దేశీయ, అంతర్జాతీయ ఫ్యూచర్ మార్కెట్‌లో బంగారం ధరలు ఆల్ టైమ్ గరిష్టానికి అతి సమీపంలో ఉన్నాయి. నిన్న ఏప్రిల్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.1135 (2.16 శాతం) పెరిగి రూ.53,694 వద్ద, సిల్వర్ ఫ్యూచర్స్ రూ.21 పెరిగి రూ.69,948 వద్ద ట్రేడ్ ముగిసింది. కామెక్స్‌లో గోల్డ్ ఫ్యూచర్స్ క్రితం సెషన్‌లో ఓ సమయంలో 2007 డాలర్లు కూడా దాటింది. నేడు కాస్త శాంతించినప్పటికీ 2000 డాలర్ల వద్దే కదలాడుతోంది.

నిన్న రూ.1110 పెరిగి, నేడు స్థిరంగా
ఎంసీఎక్స్‌లో గోల్డ్ ఫ్యూచర్స్ నిన్న రూ.1100కు పైగా పెరిగింది. ఓ సమమయంలో రూ.54,000 కూడా దాటింది. అంతర్జాతీయ మార్కెట్లో క్రితం సెషన్‌లో 1995.90 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. ఏడాది కాలంలో గోల్డ్ ఫ్యూచర్స్ 16 శాతం ఎగబాకింది.
నేటి ప్రారంభ సెషన్‌లో (మార్చి 8) గోల్డ్ ఫ్యూచర్స్ దాదాపు స్థిరంగా ఉన్నాయి. ఏప్రిల్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.19 క్షీణించి రూ.53,498 వద్ద, జూన్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.26 క్షీణించి రూ.53,990 వద్ద ట్రేడ్ అయింది.
కామెక్స్‌లో గోల్డ్ ఫ్యూచర్స్ నేడు అతి స్వల్పంగా క్షీణించింది. 5 డాలర్లు తగ్గి 1991 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. నిన్న, నేడు ఓ సమయంలో 2005 డాలర్లు కూడా క్రాస్ చేసింది. అంటే ఆల్ టైమ్ గరిష్టానికి 70 డాలర్ల దూరంలో మాత్రమే ఉంది.

రూ.70,000 దాటిన వెండి
సిల్వర్ ఫ్యూచర్స్ నేడు రూ.70,000 క్రాస్ చేసింది. రష్యా-ఉక్రెయిన్ మూడో దఫా చర్చల్లో ఎలాంటి పురోగతి కనిపించలేదు. ఈ ప్రభావం సురక్షిత పెట్టుబడిగా భావించే బంగారం, వెండిపై పడుతోంది. అంతేకాదు, మాస్కో దూకుడు తగ్గడం లేదు. ఈ మేరకు ప్రకటన కూడా చేసింది. ఇది స్టాక్ మార్కెట్, బులియన్ మార్కెట్, డాలర్-రూపాయి, ఇతర కరెన్సీపై ప్రభావం చూపుతోంది. కామెక్స్‌లో సిల్వర్ ఫ్యూచర్స్ 25 డాలర్లు దాటి 26 డాలర్ల దిశగా కనిపిస్తోంది.

12 శాతం జంప్
ఎంసీఎక్స్‌లో బంగారం ధరలు 2022 క్యాలెండర్ ఏడాదిలో దాదాపు 12 శాతం పెరిగాయి. స్పాట్ మార్కెట్‌లో పసిడి ధరలు ప్రస్తుతం 2000 డాలర్లు దాటాయి. మన వద్ద రూ.54,000 క్రాస్ చేశాయి. కామెక్స్‌లో పసిడి ధరలు ఈ వారం 1940 డాలర్ల నుండి 2040 డాలర్ల మధ్య కదలాడుతాయని బులియన్ మార్కెట్ నిపుణుల అంచనా.


Click it and Unblock the Notifications