Gold price today: బంగారం, వెండి ధరలు మళ్లీ పెరుగుతున్నాయ్
బంగారం ధరలు మళ్లీ పెరుగుతున్నాయి. పది గ్రాముల గోల్డ్ ఫ్యూచర్స్ నేటి ప్రారంభ సెషన్‌లో (ఫిబ్రవరి 7, 2022) రూ.48,000 దాటింది. వెండి ధరలు కూడా మళ్లీ రూ.61,500ను సమీపించాయి. అంతర్జాతీయ మార్కెట్లో గోల్డ్ ఫ్యూచర్స్ 1810 డాలర్లు దాటింది. సిల్వర్ ఫ్యూచర్స్ 23 డాలర్లను సమీపించింది. ఫెడ్ వడ్డీ రేటు పెంపు, చమురు ధరల పెరుగుదల, కరోనా మహమ్మారి, అమెరికా ట్రెజరీ యీల్డ్స్, జాబ్ మార్కెట్ వంటి అంశాలు ప్రభావం చూపుతాయి. ప్రధానంగా ద్రవ్యోల్భణ ఆందోళనలు పెరగడం పసుపు లోహం పెరుగుదలకు కారణమైంది. వడ్డీ రేట్ల పెరిగితే బంగారం ధరలు తగ్గుతాయి. కానీ వడ్డీ రేటు పెరుగుదలపై మరింత స్పష్టత, అదే సమయంలో ద్రవ్యోల్భణం అంశం ప్రభావం చూపుతోంది.

బంగారం ధరలు
నేటి ప్రారంభ సెషన్‌లో ఏప్రిల్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.126 లాభపడి రూ.48,050 వద్ద, జాన్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.162.00 పెరిగి రూ.48,240 వద్ద ట్రేడ్ అయింది. బంగారం ధరలు గత కొద్ది కాలంగా రూ.48,000కు దిగువన ఉన్నాయి. క్రితం సెషన్ వరకు కూడా ఈ స్థాయికి దిగువనే ఉన్నాయి. నేడు రూ.48,000 క్రాస్ చేశాయి. అంతర్జాతీయ మార్కెట్ కామెక్స్‌లో గోల్డ్ ప్యూచర్స్ 4.55 శాతం లేదా 0.25 శాతం లాభపడి 1812 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. ఏడాదిలో బంగారం ధరలు 0.69 శాతం తగ్గింది. నేటి సెషన్‌లో 1,807.95 - 1,815.85 డాలర్ల మధ్య కదలాడింది.

వెండి ధరలు
ఎంసీఎక్స్ మార్చి సిల్వర్ ఫ్యూచర్స్ 616 లాభపడి రూ.61,465 వద్ద, మే సిల్వర్ ఫ్యూచర్స్ రూ.652 లేదా 1.06 శాతం లాభపడి 62,280 వద్ద ట్రేడ్ అయింది. గత వారం రూ.61,000కు దిగువనే ఉన్న సిల్వర్ ఫ్యూచర్స్ ఇప్పుడు ఆ మార్కును దాటింది. కామెక్స్‌లో సిల్వర్ ఫ్యూచర్స్ 0.280 డాలర్లు లాభపడి 22.755 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది. ఏడాదిలో సిల్వర్ ఫ్యూచర్స్ 15.92 శాతం క్షీణించింది. కాగా, యూఎస్ టెన్ ఇయర్ ట్రెజరీ యీల్డ్స్ 2019 డిసెంబర్ తర్వాత గరిష్టాన్ని తాకాయి.

వివిధ నగరాల్లో ధరలు
ముంబైలో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి రూ.49,250, ఢిల్లీలో రూ.49,300, బెంగళూరులో రూ.49,300, హైదరాబాద్‌లో రూ.49,300, చెన్నైలో రూ.49,520, కేరళలో రూ.49,300, కోల్‌కతాలో రూ.49,150గా ఉంది. 22 క్యారెట్ల పది గ్రాముల పసిడి హైదరాబాద్‌లో రూ.45,200గా ఉంది.


Click it and Unblock the Notifications