స్వల్పంగా పెరిగిన బంగారం ధర, ఆల్ టైమ్ గరిష్టంతో రూ.6,000 తక్కువ
బంగారం ధరలు గురువారం(అక్టోబర్ 8) దాదాపు స్థిరంగా ఉన్నాయి. ప్రారంభ సెషన్‌లో స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. ఆ తర్వాత రికవరీ అయింది. దేశీయ ఫ్యూచర్ మార్కెట్ మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్(MCX)లో 10 గ్రాముల పసిడి 0.15 శాతం క్షీణించి రూ.49,971 పలికింది. వెండి ఫ్యూచర్స్ కిలో 0.23 శాతం తగ్గి రూ.60,280 పలికింది. ఆ తర్వాత స్వల్పంగా పెరుగుదలను నమోదు చేసింది. సాయంత్రం సమయానికి డిసెంబర్ ఫ్యూచర్స్ రూ.88 పెరిగి రూ.50,136 పలికింది. ఉదయం రూ.49,972 వద్ద ట్రేడింగ్ ప్రారంభమైన పసిడి ఓ సమయంలో రూ.50,399 పలికింది. కనిష్టం రూ.49,950 పలికింది. అంతకుముందు సెషన్‌లో పసిడి రూ.500, వెండి 0.4 శాతం క్షీణించింది.

రూ.6,000 తక్కువ
గోల్డ్ డిసెంబర్ ఫ్యూచర్స్ రూ.50,136 వద్ద ట్రేడ్ అవుతోంది. ఆగస్ట్ 7న ఆల్ టైమ్ గరిష్టం రూ.56,200తో చూస్తే ఇప్పటికీ రూ.6,000 తక్కువగా ఉంది. కిలో వెండి రూ.20వేల వరకు తక్కువ ఉంది. గత రెండు నెలలుగా పసిడి ధరలు రూ.49వేల పై నుండి రూ.52వేల దిగువన పలుకుతున్నాయి. ట్రంప్ కరోనాతో ఆసుపత్రిలో చేరిన సమయంలో ధరలు భారీ పెరుగుదలను నమోదు చేశాయి. ఆ తర్వాత మళ్లీ క్షీణించాయి.

అంతర్జాతీయ మార్కెట్లో ధరలు
అంతర్జాతీయ ఫ్యూచర్ మార్కెట్ కామెక్స్‌లో ఔన్స్ బంగారం ధర 0.16 శాతం పెరిగి 1,893 డాలర్లు పలికింది. ఈ రోజు 1,886 డాలర్ల నుండి 1,905 డాలర్ల మధ్య ట్రేడింగ్ జరిగింది. నిన్న పసిడి 1,890.80 డాలర్ల వద్ద ముగిసింది. సిక్స్ బాస్కెట్ కరెన్సీలో డాలర్ వ్యాల్యూ దాదాపు స్థిరంగా ఉంది. ఇతర అతి ఖరీదైన లోహాల విషయానికి వస్తే వెండి ఔన్స్ 23.83 డాలర్లు, ప్లాటినమ్ 0.1 శాతం పెరిగి 865.21 డాలర్లు, పల్లాడియం ఫ్లాట్‌గా 2,352.18 డాలర్లు పలికింది. ఆగస్ట్ మొదటి వారంలో పసిడి ఔన్స్ 2,072 డాలర్ల పైన పలికిన విషయం తెలిసిందే. ఆ ధరతో ఇప్పటికీ 190 డాలర్లకు పైగా తక్కువ పలుకుతోంది.

ఢిల్లీలో ధర..
దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల పసిడి రూ.80 పెరిగి రూ.51,150 పైన పలికింది. కిలో వెండి రూ.1,074 ఎగిసి రూ.61,085 పలికింది. ఎంసీఎక్స్‌లో పసిడి మద్దతు ధర రూ.49,800, రూ.50,050 వద్ద నిలబెట్టుకోవచ్చునని చెబుతున్నారు. 50,220 నుండిరూ.50,450 మధ్య పరీక్షను ఎదుర్కోవచ్చునని చెబుతున్నారు.
అంతర్జాతీయ మార్కెట్లో పసిడి మద్దతు ధర 1840 డాలర్లు, బ్రేక్ 1920 డాలర్లుగా బులియన్ మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. అమెరికాలో నిరుద్యోగిత రేటు పెరిగిన నేపథ్యంలో బంగారం 1900 డాలర్ల వద్ద కొనసాగవచ్చునని భావిస్తున్నారు.


Click it and Unblock the Notifications