మళ్లీ రూ.50,000 దాటిన బంగారం ధరలు, రూ.660 పెరిగిన వెండి
ముంబై: బంగారం ధరలు నేడు (బుధవారం, డిసెంబర్ 30) స్వల్పంగా పెరిగాయి. నిన్న ప్రారంభంలో తగ్గిన ధరలు, ఆ తర్వాత స్వల్పంగా పెరిగాయి. బంగారం ధరలు క్లోజింగ్ సమయానికి... ఫిబ్రవరి గోల్డ్ ఫ్యూచర్స్ రూ.22 పెరిగి రూ.50,035 వద్ద, ఏప్రిల్ ఫ్యూచర్స్ మాత్రం రూ.2 క్షీణించి రూ.50,099 వద్ద ముగిసింది. మార్చి సిల్వర్ ఫ్యూచర్స్ కిలో రూ.777 పెరిగి రూ.68,040 వద్ద, మే ఫ్యూచర్స్ రూ.677 లాభపడి రూ.69,115 వద్ద క్లోజ్ అయింది. నేడు మరో వంద వరకు పెరిగింది. ఆల్ టైమ్ గరిష్టం రూ.56,200తో రూ.6000 తక్కువగా ఉంది.

బంగారం జంప్
నేడు ఎంసీఎక్స్‌లో ఫిబ్రవరి గోల్డ్ ఫ్యూచర్స్ రూ.106.00 (0.21%) పెరిగి రూ.50,145.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.50,179.00 వద్ద ప్రారంభమైన ధర, రూ.50,179.00 వద్ద గరిష్టాన్ని, రూ.50,106.00 వద్ద కనిష్టాన్ని తాకింది. పసిడి 50వేల పైకి చేరుకుంది. ఆల్ టైమ్ గరిష్టం రూ.56200తో రూ.6000 తక్కువగా ఉంది.
ఏప్రిల్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.41.00 (-0.08%) క్షీణించి రూ.50,170.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.50,218.00 వద్ద ప్రారంభమై, రూ.50,218.00వద్ద గరిష్టాన్ని, రూ.50,170.00 వద్ద కనిష్టాన్ని తాకింది.

వెండి స్వల్ప పెరుగుదల
కిలో సిల్వర్ ఫ్యూచర్స్ మార్చి 724.00 (1.06%) తగ్గి రూ.68821.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.68,500.00 వద్ద ప్రారంభమై, రూ.68,999.00 వద్ద గరిష్టాన్ని, రూ.68,500.00 వద్ద కనిష్టాన్ని తాకింది. గతవారం మార్చి సిల్వర్ ఫ్యూచర్స్ రూ.67518.00 వద్ద క్లోజ్ అయింది.
మే ఫ్యూచర్స్ 666.00 (0.96%) పెరిగి రూ.69796.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.69,743.00 వద్ద ప్రారంభమై, రూ.69,800.00 వద్ద గరిష్టాన్ని, రూ.69,700.00 వద్ద కనిష్టాన్ని తాకింది.

అంతర్జాతీయ మార్కెట్లో జంప్
అంతర్జాతీయ మార్కెట్లో ఇటీవల గోల్డ్ ఫ్యూచర్స్ 1900 డాలర్ల దిశగా సాగుతోంది. పసిడి నేడు స్వల్పంగా పెరిగింది. గోల్డ్ ఫ్యూచర్స్ ఔన్స్ 6.25
(+0.33%) డాలర్లు పెరిగి 1,889.15 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. నేటి సెషన్లో 1,880.65 - 1,890.05 డాలర్ల మధ్య కదలాడింది. ఏడాదిలో పసిడి ధర 21.95%
శాతం పెరిగింది.
సిల్వర్ ఫ్యూచర్స్ మాత్రం క్షీణించింది. ఔన్స్ ధర +0.393 (+1.50%) డాలర్లు పెరిగి 26.610 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. నేటి సెషన్లో 26.262 - 26.645
డాలర్ల మధ్య కదలాడింది. ఏడాదిలో 44.97% పెరిగింది.


Click it and Unblock the Notifications