బంగారం ధరలు భారీగా పెరిగాయి. మళ్లీ రూ.50,000 మార్కును క్రాస్ చేశాయి. క్రితం సెషన్‌లోనే ఈ మార్కు దాటి, రూ.50,500 దిశగా పరుగు పెట్టింది. అయితే నేడు (శుక్రవారం 18 ఫిబ్రవరి) స్వల్పంగా తగ్గినప్పటికీ హాఫ్ సెంచరీకి పైనే ఉంది. అంతర్జాతీయ మార్కెట్‌లో అయితే ఏకంగా 1900 డాలర్ల మార్కు దాటింది. అయితే నేడు ఈ మార్కు దిగువకు వచ్చింది. కానీ బంగారం ఎనిమిది నెలల గరిష్టం వద్ద ట్రేడ్ అవుతోంది. వెండి ధరలు మాత్రం దాదాపు స్థిరంగా ఉన్నాయి. బంగారం ధరలు అయితే కొన్ని నెలల తర్వాత గరిష్టస్థాయిని తాకాయి.

బంగారం ధర భారీగా జంప్
ఏప్రిల్ గోల్డ్ ఫ్యూచర్స్ నేటి ప్రారంభ సెషన్‌లో రూ.258 తగ్గి రూ.50,134 వద్ద, జూన్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.255 తగ్గి రూ.50358 వద్ద ట్రేడ్ అయింది. క్రితం సెషన్‌లో బంగారం దాదాపు రూ.50,400 సమీపంలో ముగిసింది. అంతర్జాతీయ మార్కెట్‌లో నేడు గోల్డ్ ఫ్యూచర్స్ 9 డాలర్లకు పైగా తగ్గి 1892.85 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. క్రితం సెషన్‌లో 1902 డాలర్ల వద్ద ముగిసిన గోల్డ్ ఫ్యూచర్స్ నేటి ప్రారంభ సెషన్‌లో 1,890.25 - 1,905.00 డాలర్ల మధ్య ట్రేడ్ అయింది. 52 వారాల గరిష్టం 1922 డాలర్లు, కనిష్టం 1682 డాలర్లు. అంటే ఏడాది గరిష్టం సమీపం వరకు వెళ్లింది. గోల్డ్ ఫ్యూచర్స్ ధరల మార్పు ఏడాదిలో 6.56 శాతం చోటు చేసుకుంది.

వెండి ధరలు
వెండి ఫ్యూచర్ కూడా నిన్న పెరిగి, నేడు తగ్గాయి. మార్చి సిల్వర్ ఫ్యూచర్స్ నేటి ప్రారంభ సెషన్‌లో రూ.205 తగ్గి రూ.63,656 వద్ద, మే సిల్వర్ ఫ్యూచర్స్ రూ.174 తగ్గి రూ.64,527 వద్ద ట్రేడ్ అయింది. కామెక్స్‌లో సిల్వర్ ఫ్యూచర్స్ 0.093 డాలర్లు తగ్గి 23.782 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. నేటి సెషన్‌లో 23.777 - 23.898 డాలర్ల మధ్య ట్రేడ్ అయింది. వెండి ధరలు ఏడాదిలో 12.78 శాతం తగ్గాయి.

బంగారం ధరలు ఎలా?
సాంకేతికంగా చూస్తే కామెక్స్‌లో గోల్డ్ ఫ్యూచర్స్ 1866 డాలర్లకు పైనే ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. 1880-$1888 డాలర్ల మధ్య నిరోధకస్థాయి, 1857-1843 డాలర్ల మధ్య మద్దతు ధర కనిపిస్తోంది. ఎంసీఎక్స్‌లో బంగారం మద్దతు ధర 49,400 నుండి రూ.49,100 మధ్య, నిరోధకస్థాయి రూ.49,800 నుండి రూ.49,950 మధ్య కనిపిస్తోందని బులియన్ మార్కెట్ నిపుణుల మాట.
More From GoodReturns

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

Today Gold Silver Rate Live: కుప్పకూలిన బంగారం, వెండి ధరలు..కొంపలు ముంచుతున్న ట్రంప్ నిర్ణయాలు

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

బంగారం, వెండి ధరలు భారీగా తగ్గాలంటే రూపాయి బలపడాల్సిందే.. ఆర్థిక నిపుణులు ఏమంటున్నారంటే..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

10 వేల డాలర్లకు బంగారం ధర.. షాకింగ్ అంచనాలను విడుదల చేసిన యార్డెని రీసెర్చ్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

బంగారం ధరలు పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎంతకు చేరిందంటే.. మార్చి 31, మంగళవారం ధరలు ఇవే..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Gold: ఐసీఐసీఐ బ్యాంక్‌లో భారీ గోల్డ్ లోన్ కుంభకోణం! నకిలీ బంగారంతో రూ. 23 కోట్లు మాయం!

Gold: గోల్డ్ లవర్స్‌కు గుడ్ న్యూస్! భారీ పతనం తర్వాత కోలుకుంటున్న పసిడి.. నిపుణుల అంచనా ఇదే.!



Click it and Unblock the Notifications