దేశీయ ఫ్యూచర్ మార్కెట్ మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్(MCX)లో బంగారం ధరలు మళ్లీ రూ.48,000 దిశగా పరుగు పెడుతున్నాయి. అదే దారిలో వెండి ధరలు ఉన్నాయి. మంగళవారం నాటి సెషన్‌లో దాదాపు వెయ్యి రూపాయలి క్షీణించి, నిన్న స్వల్పంగా పెరిగింది. నేడు ఏకంగా రూ.800కు పైగా ఎగిసిపడింది. అంతర్జాతీయ మార్కెట్లో గోల్డ్ ఫ్యూచర్స్ 1820 డాలర్ల దిశగా సాగుతోంది. సిల్వర్ ఫ్యూచర్స్ పెరిగినప్పటికీ 26 డాలర్ల దిగువనే ఉంది. కరోనా డెల్టా వేరియంట్ కేసులు పెరగడం, లాక్ డౌన్ ఆంక్షలు బంగారంపై ఒత్తిడిని పెంచాయి.
పది గ్రాముల ఆగస్ట్ గోల్డ్ ఫ్యూచర్స్ నేడు రూ.273.00 (0.57%) పెరిగి రూ.47850.00 వద్ద, అక్టోబర్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.240.00 (0.50%) పెరిగి రూ.47954.00 వద్ద ట్రేడ్ అయింది. గోల్డ్ ఫ్యూచర్స్ రూ.48,000 దిశగా సాగుతోంది. సిల్వర్ ఫ్యూచర్స్ రూ.812.00 (1.22%) ఎగిసి రూ.67202.00 వద్ద ట్రేడ్ అయింది. అంతర్జాతీయ మార్కెట్లో గోల్డ్ ఫ్యూచర్స్ 14.70 డాలర్లు (0.82%) పెరిగి 1814.40 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. సిల్వర్ 0.416 (1.67%) డాలర్లు పెరిగి 25.293 వద్ద ట్రేడ్ అయింది.

గురువారం నాడు బంగారం ధరలు వారం గరిష్టం వద్ద ఉన్నాయి. ఫెడ్ రిజర్వ్ వడ్డీ రేట్ల పెంపు అంశాన్ని పక్కన పెట్టినట్లుగా కనిపించడంతో గురువారం ఓ దశలో బంగారం ధరలు అత్యధిక స్థాయికి చేరుకున్నాయి. కరోనా సెకండ్ వేవ్, డెల్టా వేరియంట్ ప్రభావం ఈక్విటీ మార్కెట్లు, గోల్డ్ మార్కెట్ పైన ప్రభావం చూపుతోంది.
More From GoodReturns

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

Gold: రాబోయే 2 ఏళ్లలో బంగారంపై భారీ లాభాలు.. ఇన్వెస్టర్లు అప్రమత్తం!

బంగారం, వెండి పెట్టుబడిదారులకు బిగ్ అలర్ట్.. సెబీ కొత్త నియమాలు తెలుసుకుని కొనుగోలుకు వెళ్లండి..

Today Gold Silver Rate Live: కుప్పకూలిన బంగారం, వెండి ధరలు..కొంపలు ముంచుతున్న ట్రంప్ నిర్ణయాలు

బంగారం, వెండి ధరలు తగ్గాయని సంబరాలు వద్దు.. పసిడి పెరుగుదలపై షాకింగ్ న్యూస్ చెప్పిన బ్యాంకింగ్ దిగ్గజం..

బంగారం ధరలు పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎంతకు చేరిందంటే.. మార్చి 31, మంగళవారం ధరలు ఇవే..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

బంగారం, వెండి ధరలు భారీగా తగ్గాలంటే రూపాయి బలపడాల్సిందే.. ఆర్థిక నిపుణులు ఏమంటున్నారంటే..



Click it and Unblock the Notifications