Gold price today: బంగారం ధరలు తగ్గుతున్నాయ్
రెండు రోజుల క్రితం వరకు భారీగా పెరిగిన బంగారం ధరలు కాస్త తగ్గుముఖం పడుతున్నాయి. ఈ వారం ప్రారంభంలో రూ.53,500 దిశగా కనిపించిన గోల్డ్ ఫ్యూచర్స్ ప్రస్తుతం రూ.52,600 వద్ద ఉంది. అంటే ఈ నాలుగు సెషన్‌లలో రూ.900 వరకు తగ్గింది. సిల్వర్ ఫ్యూచర్స్ కూడా రూ.70,000 పైకి చేరుకున్నప్పటికీ ప్రస్తుతం రూ.68,000 స్థాయిలో ఉంది. పసిడి ధరలు నేడు కూడా తగ్గుముఖం పడుతున్నాయి.
నేటి ప్రారంభ సెషన్‌లో గోల్డ్ ఫ్యూచర్స్ స్వల్పంగా తగ్గింది. ఉదయం గం.9.45 సమయానికి జూన్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.38 పెరిగి రూ.52,590కు తగ్గింది. సిల్వర్ ఫ్యూచర్స్ రూ.237 తగ్గి రూ.68,169 వద్ద ట్రేడ్ అయింది. క్రితం సెషన్‌లో మాత్రం జూన్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.122 తగ్గి రూ.52,627 వద్ద, ఆగస్ట్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.125 క్షీణించి రూ.52,889 వద్ద క్లోజ్ అయింది. వెండి ధరలు కూడా రూ.68,500 దిగువకు వచ్చాయి. మే సిల్వర్ ఫ్యూచర్స్ రూ.320 తగ్గి రూ.68,450, జూలై సిల్వర్ ఫ్యూచర్స్ రూ.313 తగ్గి రూ.69,209 వద్ద ముగిశాయి.

అంతర్జాతీయ మార్కెట్ కామెక్స్‌లో గోల్డ్ ఫ్యూచర్స్ 1950 డాలర్లకు పైన ఉంది. అయినప్పటికీ నేడు కాస్త క్షీణించింది. జూన్ గోల్డ్ ఫ్యూచర్స్ ఈ వార్త రాసే సమయానికి 1.75 డాలర్లు తగ్గి 1953.85 డాలర్ల వద్ద, సిల్వర్ ఫ్యూచర్స్ 0.119 డాలర్లు తగ్గి 25.152 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది.


Click it and Unblock the Notifications