బంగారం ధరలు తిరిగి పుంజుకున్నాయి. దేశీయ, అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ధరలు నేడు భారీగా పెరిగాయి. దేశీయ ఫ్యూచర్ మార్కెట్ మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్ (MCX)లో 10 గ్రాముల పసిడి ఏకంగా రూ.600 పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్ కామెక్స్‌లోను 36 డాలర్లకు పైగా పెరిగింది. మన కరెన్సీలో రూ.3,000 వరకు ఉంటుంది. వెండి ధరలు కూడా భారీగానే పెరిగాయి.
ఫ్యూచర్ మార్కెట్లో రూ.1500 వరకు పెరిగింది. కామెక్స్‌లో 26 డాలర్లు దాటింది. పసిడి ధరలు 1600 డాలర్లకు దగ్గరగా ఉన్నప్పుడు పెట్టుబడులు పెట్టడం సముచిత నిర్ణయమే అవుతుందని బులియన్ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. అయితే ఇప్పుడు 1700 పైకి చేరుకుంది. అయితే పసిడి మరోసారి కరెక్షన్‌కు గురయ్యే అవకాశాలు లేకపోలేదని అంటున్నారు.

రూ.600 పెరిగిన బంగారం ధర
గోల్డ్ ఫ్యూచర్ ధరలు నేడు భారీగా పెరిగాయి. ఆగస్ట్ 7వ తేదీ నాటి ఆల్ టైమ్ గరిష్టం రూ.56,200తో రూ.రూ.11,400 వరకు తక్కువగా ఉంది. ఫ్యూచర్ మార్కెట్ మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్(MCX)లో బంగారం ధర నేడు సాయంత్రం సెషన్లో రూ.44,800 పైకి చేరుకుంది. ఏప్రిల్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.597.00 (1.35%) పెరిగి రూ.44815.00 వద్ద ట్రేడ్ అయింది.
రూ.44,349.00 వద్ద ప్రారంభమైన ధర, రూ.44,963.00 వద్ద గరిష్టాన్ని, రూ.44,263.00 వద్ద కనిష్టాన్ని తాకింది. ఆల్ టైమ్ గరిష్టంతో రూ.11,400 వరకు తక్కువ ఉంది. జూన్ గోల్డ్ ఫ్యూచర్స్ కూడా పెరిగింది. రూ.630.00 (1.42%) పెరిగి రూ.45061.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.44,550.00 వద్ద ప్రారంభమైన ధర, రూ.45,201.00 వద్ద గరిష్టాన్ని, రూ.44,524.00 వద్ద కనిష్టాన్ని తాకింది.

రూ.1500 పెరిగిన వెండి
వెండి ధరలు భారీగా పెరిగాయి. మార్చి సిల్వర్ ఫ్యూచర్స్ కిలో రూ.1,468.00 (2.23%) పెరిగి రూ.67320.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.66,177.00 వద్ద ప్రారంభమైన ధర, రూ.67,450.00 వద్ద గరిష్టాన్ని, రూ.65,901.00 వద్ద కనిష్టాన్ని తాకింది. మే సిల్వర్ ఫ్యూచర్స్ కూడా పెరిగింది. కిలో రూ.1,409.00 (2.11%) పెరిగి రూ.68327.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.67,249.00 వద్ద ప్రారంభమైన ధర, రూ.68,500.00 వద్ద గరిష్టాన్ని, రూ.67,000.00 వద్ద కనిష్టాన్ని తాకింది.

1700 క్రాస్
అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ధరలు భారీగా పెరిగి 1700 డాలర్లను క్రాస్ చేశాయి. నేటి సెషన్లో గోల్డ్ ఫ్యూచర్స్ ఔన్స్ +36.50 (2.18%) డాలర్లు పెరిగి 1,714.65 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. ఈ సెషన్లో 1,676.85 - 1,718.60డాలర్ల మధ్య కదలాడింది. సిల్వర్ ఫ్యూచర్స్ 26 డాలర్ల వద్ద ఉంది. ఔన్స్ ధర +0.789 (+3.12%) డాలర్లు పెరిగి 26.055 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. నేటి సెషన్లో 25.095 - 26.133 డాలర్ల మధ్య కదలాడింది.
More From GoodReturns

Gold silver: బంగారం ధరలకు రెక్కలు వస్తాయా? విదేశాల నుంచి వచ్చే జ్యువెలరీపై మోడీ సర్కార్ ఆంక్షలు!

బంగారం, వెండి పెట్టుబడిదారులకు బిగ్ అలర్ట్.. సెబీ కొత్త నియమాలు తెలుసుకుని కొనుగోలుకు వెళ్లండి..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Gold Price: భారీ రికార్డుల నుంచి దిగివచ్చిన పసిడి! లేటెస్ట్ గోల్డ్ రేట్లు ఇవే..!

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన వెండి, పసిడి ధరలు,..పుంజుకున్న రూపాయి

బంగారం, వెండి ధరలు భారీగా తగ్గాలంటే రూపాయి బలపడాల్సిందే.. ఆర్థిక నిపుణులు ఏమంటున్నారంటే..

బంగారం, వెండి ధరలు ఈ వారం ఎలా ఉండబోతున్నాయి..వరుస సెలవులు కాపాడుతాయా..కొంపలు ముంచుతాయా..

Gold: గోల్డ్ లవర్స్‌కు గుడ్ న్యూస్! భారీ పతనం తర్వాత కోలుకుంటున్న పసిడి.. నిపుణుల అంచనా ఇదే.!

బంగారం ధరలు పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎంతకు చేరిందంటే.. మార్చి 31, మంగళవారం ధరలు ఇవే..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Gold: ఐసీఐసీఐ బ్యాంక్‌లో భారీ గోల్డ్ లోన్ కుంభకోణం! నకిలీ బంగారంతో రూ. 23 కోట్లు మాయం!



Click it and Unblock the Notifications