బంగారం ధరలు ఈరోజు (సెప్టెంబర్ 11) దాదాపు నిలకడగా ఉన్నాయి. మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్(MCX)లో సాయంత్రం సమయానికి అక్టోబర్ డెలివరీ 10 గ్రాములు రూ.260 లేదా 0.50 శాతం తగ్గి రూ.51,514 పలికింది. టర్నోవర్ 12,264 లాట్లుగా ఉంది. డిసెంబర్ గోల్డ్ ఫీచర్ రూ.257 లేదా 0.49 శాతం తగ్గి రూ.51,705 పలికింది. బిజినెస్ టర్నోవర్ 6,381 లాట్లుగా ఉంది. అక్టోబర్, డిసెంబర్ కాంట్రాక్ట్ వరుసగా రూ.2,517.17 కోట్లు, రూ.157.86 కోట్లుగా ఉంది. గోల్డ్ కాంట్రాక్ట్ అక్టోబర్ రూ.267 లేదా 0.52 శాతం తగ్గి రూ.51,565 పలికింది. టర్నోవర్ 15,6023 లాట్లుగా ఉంది.
ఎంసీఎక్స్‌లో బంగారం మద్దతు ధర రూ.51,200, నిరోధకస్థాయి రూ.51,650గా ఉంటుందని బులియన్ మార్కెట్ నిపుణులు అంటున్నారు. ఇక దేశ రాజధాని న్యూఢిల్లీలో 10 గ్రాముల పసిడి రూ.191 పెరిగి రూ.52,452 పలికింది. అంతకుముందు సెషన్‌లో పసిడి రూ.52,643 వద్ద క్లోజ్ అయింది. సిల్వర్ కిలో రూ.990 తగ్గి రూ.69,441 పలికింది. అంతకుముందు సెషన్‌లో కిలో రూ.70,431 పలికింది.

లండన్ ట్రేడింగ్‌లో స్పాట్ గోల్డ్ 1.54 శాతం తగ్గి ఔన్స్ డాలర్ 1944 పలికింది. వెండి ఔన్స్ ధర 26.78 పలికింది. అంతర్జాతీయ మార్కెట్ కారణంగా బంగారం ధరలు శుక్రవారం ఒత్తిడిలో ఉన్నాయి. మెరికా - చైనా ట్రేడ్ వార్, భారత్ - చైనా సరిహద్దు టెన్షన్, డాలర్ వ్యాల్యూ, ఈక్విటీ వ్యాల్యూ, ప్రస్తుతం కరోనా మహమ్మారి-వ్యాక్సీన్ అంశం బంగారంపై ప్రభావం చూపిస్తున్నాయి.


Click it and Unblock the Notifications