అక్కడ భారీగా తగ్గి, ఇక్కడ పెరిగిన బంగారం ధరలు: 15 రోజుల తర్వాత పెరిగిన నిల్వలు

బంగారం ధరలు శుక్రవారం ప్రారంభ సెషన్లో తగ్గుముఖం పట్టాయి. నిన్న ప్రారంభ సెషన్‌లో స్వల్పంగా పెరిగిన ధర, ఈ రోజు తగ్గింది. అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావం పసిడిపై పడింది. మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్(MCX)లో పసిడి ఫ్యూచర్స్ ధర 0.9 శాతం క్షీణించి రూ.51,306 పలికింది. సిల్వర్ ఫ్యూచర్స్ 15 శాతం క్షీణించి కిలో రూ.67,970 పలికింది. అంతకుముందు సెషన్‌లో పసిడి 0.47 శాతం పెరగగా, వెండి 0.52 శాతం పెరిగింది. గత నెలలో బంగారం ఎంసీఎక్స్‌లో పది గ్రాములు రూ.56,200, వెండి కిలో రూ.79వేలకు చేరుకున్న తర్వాత వేలల్లో తగ్గాయి. ఇటీవలి కాలంలో ధరల్లో స్వల్పమార్పులు ఉన్నాయి.

అక్టోబర్ గోల్డ్ కాంట్రాక్ట్

అక్టోబర్ గోల్డ్ కాంట్రాక్ట్

ఈరోజు ఎంసీఎక్స్‌లో అక్టోబర్ గోల్డ్ కాంట్రాక్ట్స్ రూ.31,306 పలకగా, సెప్టెంబర్ సిల్వర్ ఫ్యూచర్స్ కిలో రూ.67,974 పలికింది. నిన్న దేశీయ మార్కెట్లో బంగారం మద్దతు ధర రూ.51,550-51330, నిరోధకస్థాయి రూ.51,950-52100. వెండి మద్దతు ధర కిలో రూ.68,400-67800, నిరోధకస్థాయి కిలో రూ.69,800-70,500గా ఉంటుందని బులియన్ మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.

అంతర్జాతీయ మార్కెట్లో స్పాట్ గోల్డ్ ధరలు 0.3 శాతం మేర తగ్గి ఔన్స్ ధర 1,947.41 డాలర్లు పలికింది. అంతకుముందు సెషన్‌లో 1,965.94 డాలర్లు పలికింది. బంగారం ధరలు మరికొంతకాలం 1900 డాలర్ల నుండి 2000 డాలర్ల మధ్య తచ్చాడుతుందని అంతర్జాతీయ బులియన్ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. వెండి 0.3 శాతం క్షీణించి ఔన్స్ 26.84 డాలర్లు, ప్లాటినమ్ 0.1 శాతం తగ్గి 925.59 డాలర్లు, పల్లాడియం 0.4 శాతం క్షీణించి 2,283.72డాలర్లు పలికింది.

హైదరాబాద్, విజయవాడల్లో ధరలు

హైదరాబాద్, విజయవాడల్లో ధరలు

ఎంసీఎక్స్‌లో పసిడి ధరలు ఈ రోజు స్వల్పంగా తగ్గుముఖం పట్టగా, బులియన్ మార్కెట్లో స్వల్పంగా పెరిగాయి. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి రూ.150కి పైగా పెరిగి రూ.53,700 పలికింది. 22క్యారెట్ల పసిడి రూ.49,250 పలికింది. ఢిల్లీలో రూ.200కు పైగా పెరిగి 24 క్యారెట్ల పసిడి రూ.54,800, 22 క్యారెట్ల పసిడి రూ.50,250 పలికింది. కిలో వెండి రూ.660 పెరిగి రూ.68,560కి చేరుకుంది.

పెరిగిన నిల్వలు

పెరిగిన నిల్వలు

అంతర్జాతీయ గోల్డ్ హోల్డింగ్ దిగ్గజం ఎస్పీడీఆర్ వద్ద బంగారం నిల్వలు 2.92 టన్నులు పెరిగి 1252.96 టన్నులకు చేరుకుంది. ఆగస్ట్ 26వ తేదీ తర్వాత ఎస్పీడీఆర్‌లో బంగారం నిల్వలు మొదటిసారి పెరిగాయి. అంటే దాదాపు పదిహేను రోజుల తర్వాత నిల్వలు పెరిగాయి. అమెరికా - చైనా ట్రేడ్ వార్, భారత్ - చైనా సరిహద్దు టెన్షన్, డాలర్ వ్యాల్యూ, ఈక్విటీ వ్యాల్యూ, ప్రస్తుతం కరోనా మహమ్మారి-వ్యాక్సీన్ అంశం బంగారంపై ప్రభావం చూపిస్తున్నాయి.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+