Gold Price Today: బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే..!

బంగారం ధరలు మళ్లీ పెరుగుతున్నాయి. నేడు (అక్టోబర్ 8 శుక్రవారం) ప్రారంభ సెషన్‌లో డిసెంబర్ గోల్డ్ ప్యూచర్స్ రూ.62.00 (0.13%) పెరిగి రూ.46889.00 వద్ద, ఫిబ్రవరి గోల్డ్ ఫ్యూచర్స్ రూ.18.00 (0.04%) పెరిగి రూ.47005.00 వద్ద ట్రేడ్ అయింది. నేడు ఉదయం డిసెంబర్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.46,861.00 వద్ద ప్రారంభమై, రూ.46,920.00 వద్ద గరిష్టాన్ని, రూ.46,861.00 కనిష్టాన్ని తాకింది. అంతర్జాతీయ మార్కెట్లో గోల్డ్ ఫ్యూచర్స్ 1760 డాలర్ల దిగువకు వచ్చింది. ఇటీవల 1780 డాలర్ల దిశగా కనిపించిన గోల్డ్ ఫ్యూచర్స్ ఆ తర్వాత కాస్త చల్లబడింది. నేటి ప్రారంభ సెషన్‌లో -0.65 (-0.04%) క్షీణించి 1,758.55 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. డిసెంబర్ సిల్వర్ ఫ్యూచర్స్ రూ.223.00 (-0.36%) క్షీణించి రూ.61035.00 వద్ద, మార్చి సిల్వర్ ఫ్యూచర్స్ రూ.205.00 (-0.33%) క్షీణించి రూ.61485.00 వద్ద ట్రేడ్ అయింది. అంతర్జాతీయ మార్కెట్ కామెక్స్‌లో సిల్వర్ ఫ్యూచర్స్ 0.166 (-0.73%) క్షీణించి 22.492 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది.

నేటి సెషన్‌లో కామెక్స్‌లో గోల్డ్ ఫ్యూచర్స్ 1,753.65 - 1,760.55 డాలర్ల మధ్య ట్రేడ్ అయింది. క్రితం సెషన్‌లో 1,759.20 డాలర్ల వద్ద ముగిసింది. నేడు 1,755.65 డాలర్ల వద్ద ప్రారంభమైంది. 1750 డాలర్ల స్థాయికి క్షీణిస్తుందని భావించినప్పటికీ కాస్త పెరిగింది. అయినప్పటికీ నష్టాల్లోనే ఉంది.

Gold Price Today: Yellow metal edge higher in Indian markets

అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు ఈ వారం ముగిసేసరికి 1750 స్థాయికి పడిపోయే అవకాశాలు కొట్టి పారేయలేమని బులియన్ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. డాలర్ క్రమంగా బలపడుతోంది. యూఎస్ ట్రెజరీ యీల్డ్స్ తగ్గుతున్నాయి. ఇక ప్లాటినమ్ 0.2 శాతం లాభపడి 981.37 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది.

బెంచ్ మార్క్ యూఎస్ టెన్ ఇయర్ బాండ్ యీల్డ్ ట్రెజరీ మూడు నెలల గరిష్టానికి చేరుకున్నాయి. సెప్టెంబర్ యూఎస్ ఏడీపీ నాన్-ఫామ్ ఎంప్లాయిమెంట్ చేంజ్ డేటా కాస్త సానుకూలంగా ఉంది. అంచనాలకు మించి 568000గా ఉంది. ఇన్వెస్టర్లు ఈ వారంలో విడుదలయ్యే జాబ్ డేటా గురించి వేచి చూస్తున్నారు. ఈ అంశాలు బంగారంపై ప్రభావం చూపుతాయి. దేశీయ మార్కెట్ విషయానికి వస్తే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎంపీసీ సమావేశం నిన్న ప్రారంభమైంది. మూడు రోజుల పాటు ఉండే ఈ సమావేశంలో కీలక వడ్డీ రేట్లపై నిర్ణయం తీసుకోనున్నారు. ఈ ప్రభావం స్టాక్ మార్కెట్ పైన, పసిడి మార్కెట్ పైన ఉంటుంది.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+