భారీగా తగ్గిన బంగారం ధర, రూ.2,000 డౌన్: హైదరాబాద్‌లో ఎంతంటే?
గత సెషన్‌లో పెరిగిన బంగారం, వెండి ధరలు మళ్లీ తగ్గాయి. ఎంసీఎక్స్‌లో ఉదయం గం.9.30 సమయానికి ఆగస్ట్ గోల్డ్ ఫ్యూచర్స్ 0.06 శాతం తగ్గి రూ.46,072 పలికింది. అంతకుముందు సెషన్‌లో రూ.400 పెరిగింది. జూన్ గోల్డ్ కాంట్రాక్ట్ 10 గ్రాములకు 0.15 శాతం తగ్గి రూ.46,034 పలికింది. సిల్వర్ జూలై ఫ్యూచర్స్ 0.16 శాతం తగ్గి కిలో రూ.48,109 లికింది. అంతకుముందు సెషన్‌లో వెండి రూ.900 పెరిగింది.

నెల రికార్డ్ ధరతో పోలిస్తే రూ.2,000 తగ్గుదల
గత నెల రోజుల్లో బంగారం ధరలు పైకి, కిందకు కదులుతున్నప్పటికీ రూ.2,000 వరకు తగ్గాయి. గత నెలలో ఎంసీఎక్స్‌లో బంగారం రూ.48,000 వరకు రికార్డ్ ధర పలికిన విషయం తెలిసిందే. ఇప్పుడు రూ.46,000కు కాస్త పైకి ఉంది. అంటే నెల రోజుల్లో రెండువేల రూపాయలు తగ్గింది.

డాలర్ ఎఫెక్ట్.. గ్లోబల్ మార్కెట్లో పెరిగిన ధర
అయితే అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. బలహీనమైన అమెరికా డాలర్, ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు ఆందోళన వంటి వివిధ కారణాలతో స్పాట్ గోల్డ్ 0.4 శాతం పెరిగి ఔన్స్ 1,700.78 డాలర్లు పలికింది. ఇతర కరెన్సీలతో పోలిస్తే అమెరికా డాలర్ దాదాపు మూడు నెలల కనిష్టానికి చేరుకుంది. దీంతో ఇతర కరెన్సీలకు బంగారం ధర పడిపోయింది. ఇతర అతివిలువైన లోహాల విషయానికి వస్తే వెండి 1.1% పడిపోయి ఔన్స్ 17.66 డాలర్ల వద్ద, ప్లాటినమ్ 0.1 శాతం తగ్గి 833.10 డాలర్లు పలికింది.

హైదరాబాద్‌లో బంగారం ధర
హైదరాబాద్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర నిన్న రూ.48,420 ఉండగా, ఈ రోజు రూ.47,230 పలికింది. 22 క్యారెట్ల బంగారం ధర నిన్న రూ.44,350 ఉండగా, ఈ రోజు రూ.44,280 పలికింది.గత పది రోజుల్లో 24 క్యారెట్ల బంగారం ధర భారీగా తగ్గింది. జూన్ 1న రూ.49,220గా ఉన్న 10 గ్రాముల పసిడి ధర నిన్న రూ.48,420 పలికింది. ఈ రోజు రూ.47,230గా ఉంది.


Click it and Unblock the Notifications