2 వారాల్లో రూ.2000 తగ్గిన బంగారం ధరలు, వెండి ధరలు రూ.7000 డౌన్
ఈ వారంలో నిన్నటి వరకు తగ్గుతూ వచ్చిన బంగారం ధరలు నేడు (శుక్రవారం, ఆగస్ట్ 13) స్వల్పంగా పెరిగాయి. దేశీయ ఫ్యూచర్ మార్కెట్ మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్(MCX) నేడు ప్రారంభ సెషన్‌లో అక్టోబర్ గోల్డ్ ఫ్యూచర్స్ ధరలు రూ.150.00 (0.32%) ఎగిసి రూ.46,513.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.46,452.00 ప్రారంభమైన ధర, రూ.46,532.00 వద్ద గరిష్టాన్ని, రూ.46,416.00 కనిష్టాన్ని తాకింది. డిసెంబర్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.125.00 (0.27%) కోట్లు పెరిగి రూ.46700.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.46,650.00 వద్ద ప్రారంభమై, రూ.46,700.00 వద్ద గరిష్టాన్ని, రూ.46,620.00 వద్ద కనిష్టాన్ని తాకింది.
నిన్నటి సెషన్‌తో రూ.62,200 దిగువకు పడిపోయిన సిల్వర్ ఫ్యూచర్స్ కూడా నేడు స్వల్పంగా ఎగిసి రూ.62,200 పైకి చేరుకుంది. సెప్టెంబర్ సిల్వర్ ఫ్యూచర్స్ రూ.389.00 (0.63%) లాభపడి రూ.62249.00 వద్ద, డిసెంబర్ సిల్వర్ ఫ్యూచర్స్ రూ.382.00 (0.61%) లాభపడి రూ.62990.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.62,097.00 వద్ద ప్రారంభమైన సెప్టెంబర్ సిల్వర్ ఫ్యూచర్స్ రూ.62,250.00 గరిష్టాన్ని, రూ.61,980.00 వద్ద కనిష్టాన్ని తాకింది. రూ.62,776.00 వద్ద ప్రారంభమైన అక్టోబర్ సిల్వర్ ఫ్యూచర్ ధర, రూ.62,990.00 గరిష్టాన్ని, రూ.62,718.00 వద్ద కనిష్టాన్ని తాకింది.

అంతర్జాతీ మార్కెట్లోను పసిడి ధరలు పెరిగాయి. నేడు గోల్డ్ ఫ్యూచర్స్ 7.95 (0.45%) డాలర్లు లాభపడి 1,759.75 వద్ద ట్రేడ్ అయింది. సిల్వర్ ఫ్యూచర్స్ 0.201 (0.87%) డాలర్లు ఎగిసి 23.317 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. బంగారం ధరలు కేవలం రెండు వారాల్లోనే రూ.2000 వరకు తగ్గాయి. నేడు స్వల్పంగా పెరిగినప్పటికీ, ఈ వారం మొదటి నుండి క్షీణించాయి. వెండి రూ.70,000 నుండి రూ.63,000 దిగువకు పడిపోయింది. బంగారం ఆల్ టైమ్ గరిష్టం రూ.56200తో పోలిస్తే రూ.9500 తక్కువగా ఉంది.


Click it and Unblock the Notifications