రికార్డ్ హై: 10% తగ్గిన బంగారం ధర, రూ.10,000 తగ్గిన వెండి ధర
బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి. ఎంసీఎక్స్‌లో గోల్డ్ ఫ్యూచర్స్ 10 గ్రాములు రూ.50,690 పలికింది. పసిడి ధరలు గత మూడు రోజుల్లో రూ.800 పైగా తగ్గుముఖం పట్టాయి. ఆగస్ట్ 7వ తేదీ గరిష్ట ధర రూ.56,200తో పోలిస్తే రూ.5,500కు పైగా తక్కువ ఉంది. అంటే రికార్డ్ ధరతో పోలిస్తే ఈ నెల రోజుల్లో 10 శాతానికి పైగా ధరలు తగ్గాయి. ఎంసీఎక్స్‌లో వెండి ఫ్యూచర్స్ శుక్రవారం కిలో 0.8 శాతం ఎగిసి రూ.67,481 వద్ద సెటిల్ అయింది. వెండి ధర గత రికార్డ్ ధరతో పోలిస్తే ఏకంగా రూ.10,000 తగ్గింది.

పుంజుకున్న ఉద్యోగాలు, బలపడిన డాలర్
అంతర్జాతీయ మార్కెట్లో యూఎస్ గోల్డ్ ఫ్యూచర్స్ శుక్రవారం ఔన్స్ ధర 1,940 వద్ద సెటిల్ అయింది. అమెరికాలో నిరుద్యోగిత రేటు తగ్గిపోయింది. అంచనాలకు మించి ఉద్యోగాలు పెరిగాయి. తాజా రికార్డుల ప్రకారం అమెరికాలో 1.371 మిలియన్ల ఉద్యోగాలు పెరిగాయి. దీంతో నిరుద్యోగిత రేటు 8.4 శాతానికి తగ్గింది. ఉద్యోగాలు పెరగడంతో పాటు అమెరికా డాలర్ ఇతర కరెన్సీలతో మరింతగా బలపడింది. డాలర్ బలపడితే సిక్స్ కరెన్సీ బాస్కెట్‌లో ఇతర కరెన్సీలో పసిడి ధరలు పెరుగుతాయి.

కాస్త పుంజుకుంటున్న రిటైల్ మార్కెట్లు
కరోనా మహమ్మారి కారణంగా అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు ఈ ఏడాది 25 శాతం మేర పెరిగాయి. క్రితం నెల వరకు బంగారం ధరలు రూ.60వేలకు సమీపంలో ఉండటంతో రిటైల్ మార్కెట్లు బోసిపోయాయి. అయితే ఇప్పుడు గరిష్ట ధరతో పోలిస్తే రూ.5500 వరకు తగ్గడంతో కొన్ని ప్రాంతాల్లో ఫిజికల్ బంగారానికి కాస్త డిమాండ్ పెరిగింది. ఈ పండుగ సీజన్లో మరింతగా డిమాండ్ పెరుగుతుందని భావిస్తున్నారు.

బులియన్ మార్కెట్లో పసిడి ధరలు
నిన్న హైదరాబాద్ బులియన్ మార్కెట్లో శుక్రవారం పసిడి ధర క్షీణించింది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.400 వరకు పడిపోయి రూ.48,770 పలికింది. 24 క్యారెట్ల పసిడి 10 గ్రాములకు రూ.400కు పైగా క్షీణించి రూ.53,200కు దిగి వచ్చింది. వెండి కిలో రూ.1500కు పైగా పడిపోయింది.


Click it and Unblock the Notifications