Gold price today: అప్పటి నుండి రూ.4000 తగ్గిన బంగారం ధరలు
బంగారం, వెండి ధరలు గతవారం భారీగా తగ్గాయి. క్రితం వారం గోల్డ్ ఫ్యూచర్ ధరలు రూ.51,900 వద్ద ప్రారంభమై, చివరి సెషన్ సమయానికి రూ.51,300 దిగువకు పడిపోయాయి. గతవారం పసిడి ధరలు రూ.600 మేర క్షీణించాయి. అదే సమయంలో సిల్వర్ ఫ్యూచర్స్ రూ.69,600 స్థాయిలో ప్రారంభమై, రూ.66,800 దిగువన ముగిశాయి. అంటే ఈ ఐదు సెషన్‌లలో దాదాపు రూ.3000 మేర క్షీణించింది. అంతర్జాతీయ మార్కెట్ కామెక్స్‌లో గోల్డ్ ఫ్యూచర్స్ గతవారం 1960 డాలర్లకు సమీపంలో ప్రారంభమై, 1925 డాలర్ల దిగువన ముగిసింది. సిల్వర్ ఫ్యూచర్స్ 25.7 డాలర్ల స్థాయిలో ప్రారంభమై, 24.7 డాలర్ల స్థాయిలో ముగిసింది.
రష్యా-ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో పసిడి ధరలు ఇటీవల ఆల్ టైమ్ గరిష్టం రూ.56200 సమీపానికి చేరుకున్నాయి. గత నెలలో రూ.55,500ను సమీపించాయి. అయితే యుద్ధ ఉద్రిక్తతలు తగ్గడంతో మళ్లీ తగ్గుముఖం పట్టాయి. కామెక్స్‌లోను 2060 డాలర్లను క్రాస్ చేసింది. ఏడాదిన్నర క్రితం ఆల్ టైమ్ గరిష్టం 2075ను తాకింది. ఇటీవల యుద్ధం కారణంగా ఈ సమీపానికి చేరుకున్నది. కానీ అంతలోనే క్షీణించింది.

ఎంసీఎక్స్‌లో ఇటీవలి గరిష్టం నుండి రూ.4000కు పైగా క్షీణించిన పసిడి, కామెక్స్‌లో 150 డాలర్ల వరకు తగ్గింది. రష్యా -ఉక్రెయిన్ యుద్ధ పరిణామాలకు సంబంధించి సానుకూల పరిణామాలు కనిపిస్తున్నాయని, దీంతో వచ్చే వారం ఉక్రెయిన్ నుండి రష్యా తన బలగాలను ఉపసంహరించే దిశగా అడుగులు వేస్తే పసిడి 1900 డాలర్ల దిగువకు పడిపోవచ్చునని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. లేదంటే స్థిరంగానే కొనసాగవచ్చునని చెబుతున్నారు.


Click it and Unblock the Notifications