బంగారం కొనుగోలు చేయాలనుకుంటున్నారా? అయితే మీకో శుభవార్త. పసిడితో పాటు వెండి ధరలు కూడా భారీగా క్షీణించాయి. గోల్డ్ ఫ్యూచర్స్ ఏకంగా రూ.50,000 దిగువకు పడిపోయి, రూ.49,000కు కాస్త పైన ఉంది. ఈ వారం ప్రారంభంలో రూ.70వేల పైకి చేరిన వెండి ఇప్పుడు రూ.67,000 దిగువకు పతనమైంది. ఈ వారంలోని 5 సెషన్లలో మూడు రోజులు ధరలు పెరగగా, రెండుసార్లు తగ్గాయి. ఈ వారం పసిడి ఓ సమయంలో రూ.51,000 దాటి రూ.52,000 దిశగా కనిపించింది. నేడు రూ.50,000 దిగువకు వచ్చింది. గత వారం ముగింపు కంటే పడిపోయింది. మొదటి రెండు రోజులు రూ.1500 పెరిగిన బంగారం, మరుసటి రోజు రూ.1230 తగ్గింది. నిన్న స్వల్పంగా పెరిగి నేడు భారీగా తగ్గింది. మొత్తానికి రూ.52,000 చేరువకు పోయిన పసిడి ఇప్పుడు రూ.49,200 వద్ద కదలాడుతోంది. ఈ వారం గరిష్టం నుండి రూ.2500కు పైగా తగ్గింది.

బంగారం రూ.1600 డౌన్
నేడు ఎంసీఎక్స్‌లో ఫిబ్రవరి గోల్డ్ ఫ్యూచర్స్ 1,615.00 (-3.17%) తగ్గి రూ.49289.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.50,755.00 వద్ద ప్రారంభమైన ధర, రూ.50,799.00 వద్ద గరిష్టాన్ని, రూ.49154.00 వద్ద కనిష్టాన్ని తాకింది. ఆల్ టైమ్ గరిష్టంతో రూ.7000 తక్కువగా ఉంది.
ఏప్రిల్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.1,474.00 (-2.89%) తగ్గి రూ.49466.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.50,850.00 వద్ద ప్రారంభమైన ధర, రూ.50,850.00 వద్ద గరిష్టాన్ని, రూ.49,232.00 వద్ద కనిష్టాన్ని తాకింది.

వెండి ధర రూ.3000 డౌన్
సిల్వర్ ఫ్యూచర్స్ రూ.3000 వరకు తగ్గింది. కిలో సిల్వర్ ఫ్యూచర్స్ మార్చి 3,062.00 (-4.38%) క్షీణించి రూ.66900.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.69,694.00 వద్ద ప్రారంభమై, రూ.69,825.00 వద్ద గరిష్టాన్ని, రూ.66,431.00 వద్ద కనిష్టాన్ని తాకింది.
మే సిల్వర్ ఫ్యూచర్స్ రూ.2,980.00 (-4.20%) పెరిగి రూ.680000.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.70,705.00 వద్ద ప్రారంభమైన ధర, రూ.70,705.00 వద్ద గరిష్టాన్ని, రూ.67,506.00 వద్ద కనిష్టాన్ని తాకింది.

1900 డాలర్ల దిగువకు
అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ధరలు తగ్గాయి. అయితే 1900 డాలర్లకు దిగువకు వచ్చాయి. గోల్డ్ ఫ్యూచర్స్ ఔన్స్ -54.85 (-2.87%) డాలర్లు తగ్గి 1858.75 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. నేటి సెషన్లో 1,849.40 - 1,918.00 డాలర్ల మధ్య కదలాడింది. ఏడాదిలో పసిడి ధర 20.5% శాతం పెరిగింది. సిల్వర్ ఫ్యూచర్స్ కూడా క్షీణించింది. ఔన్స్ ధర 1.389 (-5.10%) డాలర్లు తగ్గి 25.872 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. నేటి సెషన్లో 25.733 - 27.335 డాలర్ల మధ్య కదలాడింది. ఏడాదిలో 48.15 శాతం పెరిగింది.
More From GoodReturns

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 7, మంగళవారం ధరలు ఇవే..

బంగారం, వెండి ధరలపై సస్పెన్స్.. ఆర్బీఐ నిర్ణయంతో రేట్లు తగ్గుతాయా..పెరుగుతాయా..

Today Gold Silver Rate Live: ఇరాన్ ఉద్రిక్తతలతో మారుతున్న బంగారం ధరలు

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధర పెరుగుదలపై షాకింగ్ న్యూస్.. ఏప్రిల్ నెలలో ఈ రేటును దాటడం ఖాయం అంటున్న నిపుణులు..

భారీగా పెరిగిన బంగారం ధరలు.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎంతకు చేరిందంటే.. ఏప్రిల్ 1, బుధవారం ధరలు ఇవే..

బంగారం ధర ఈ వారం ఎంత పెరిగిందో తెలుసా.. రూపాయి పైనే పెట్టుబడిదారుల ఆశలు.. ఎందుకంటే..

Gold silver: బంగారం ధరలకు రెక్కలు వస్తాయా? విదేశాల నుంచి వచ్చే జ్యువెలరీపై మోడీ సర్కార్ ఆంక్షలు!

Today Gold Silver Rate Live: కుప్పకూలిన బంగారం, వెండి ధరలు..కొంపలు ముంచుతున్న ట్రంప్ నిర్ణయాలు

భారత ఫారెక్స్ రిజ్వర్వులను దెబ్బతీసిన ఇరాన్ యుద్ధం..భారీగా తగ్గిన బంగారం నిల్వలు..

Gold: ఐసీఐసీఐ బ్యాంక్‌లో భారీ గోల్డ్ లోన్ కుంభకోణం! నకిలీ బంగారంతో రూ. 23 కోట్లు మాయం!



Click it and Unblock the Notifications