Gold Price Today: బంగారం ధరలు తగ్గినట్లే, తగ్గి పెరుగుతున్నాయ్
బంగారం ధరలు దాదాపు స్థిరంగా కొనసాగుతున్నాయి. ఈ వారం ప్రారంభంలో రూ.50,000 దాటిన గోల్డ్ ఫ్యూచర్స్, ఆ తర్వాత కాస్త తగ్గాయి. అయినప్పటికీ రూ.50,000 సమీపంలోనే ఉన్నాయి. నేటి సెషన్‌లో దేశీయ ఫ్యూచర్ మార్కెట్ మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్(MCX)లో పది గ్రాముల ఏప్రిల్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.18 క్షీణించి రూ.49,600 వద్ద, జూన్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.12 క్షీణించి రూ.49,810 వద్ద ట్రేడ్ అయింది.
ఎంసీఎక్స్‌లో మార్చి సిల్వర్ ఫ్యూచర్స్ రూ.239 తగ్గి రూ.63,060 వద్ద, మే సిల్వర్ ఫ్యూచర్స్ రూ.251 తగ్గి రూ.63950 వద్ద ట్రేడ్ అయింది. సిల్వర్ ఫ్యూచర్స్ ఇటీవల రూ.65,000 క్రాస్ చేసింది. ఆ తర్వాత క్షీణించి రూ.63,000 స్థాయికి వచ్చింది.

అంతర్జాతీయ మార్కెట్‌లోను గోల్డ్ ఫ్యూచర్స్ క్రితం సెషన్‌లో తగ్గినప్పటికీ, నేడు పెరిగింది. రష్యా-ఉక్రెయిన్ ఉద్రిక్తతల నేపథ్యంలో ధరలు పెరుగుతున్నాయి. నేడు ప్రారంభ సెషన్‌లో కామెక్స్‌లో గోల్డ్ ఫ్యూచర్స్ 4.45 డాలర్లు లేదా 0.24 శాతం పెరిగి 1875.95 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. నేటి సెషన్‌లో గోల్డ్ ఫ్యూచర్స్ 1,869.70 - 1,873.65 డాలర్ల మధ్య కదలాడింది. ఏడాదిలో 3.33 శాతం పెరిగింది. సిల్వర్ ఫ్యూచర్స్ నేడు 0.088 డాలర్లు లేదా 0.37 శాతం తగ్గి 23.517 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. నేటి సెషన్‌లో 23.438 - 23.637 డాలర్ల మధ్య ట్రేడ్ అయింది.


Click it and Unblock the Notifications