For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Gold Price Today: ఆల్ టైమ్ గరిష్టంతో రూ.10,000 తగ్గిన బంగారం ధర

|

బంగారం ధరలు వరుస సెషన్‌లలో క్షీణిస్తున్నాయి. పది సెషన్ల క్రితం రూ.48,000 స్థాయిలో ఉన్న బంగారం ధరలు ఇప్పుడు రూ.46,400 దిగువకు పడిపోయాయి. గోల్డ్ ఫ్యూచర్స్ నేడు (గురువారం, 12) దాదాపు స్థిరంగా ఉన్నాయి. దేశీయ ఫ్యూచర్ మార్కెట్ మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్ (MCX)లో పది గ్రాముల అక్టోబర్ గోల్డ్ ఫ్యూచర్స్ నేటి ప్రారంభ సెషన్లో రూ.26.00 (-0.06%) క్షీణించి రూ.46362.00 వద్ద ట్రేడ్ అయింది. డిసెంబర్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.46580.00 వద్ద ఉంది. సెప్టెంబర్ సిల్వర్ ఫ్యూచర్స్ రూ.262.00 (-0.42%) క్షీణించి రూ.62509.00 వద్ద, డిసెంబర్ సిల్వర్ ఫ్యూచర్స్ రూ.303.00 (-0.48%) తగ్గి రూ.63244.00 వద్ద ట్రేడ్ అయింది.

అంతర్జాతీయ మార్కెట్లో గోల్డ్ ఫ్యూచర్స్ 1750 డాలర్ల స్థాయిలో ఉంది. నేటి సెషన్‌లో గోల్డ్ ఫ్యూచర్స్ 1.10 (0.06%) డాలర్లు తగ్గి 1,752.20 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. సిల్వర్ ఫ్యూచర్స్ 24 డాలర్ల దిగువకు పడిపోయింది. నేటి ప్రారంభ సెషన్‌లో సిల్వర్ ఫ్యూచర్స్ 0.110
(0.47%) డాలర్లు తగ్గి 23.378 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. దేశీయ ఫ్యూచర్ మార్కెట్లో గోల్డ్ ఫ్యూచర్స్ ఆల్ టైమ్ గరిష్టం రూ.56200తో పోలిస్తే దాదాపు రూ.10వేలు తక్కువగా ఉన్నాయి. మరో ప్రీసియస్ మెటల్ ప్లాటినమ్ 0.05 శాతం ఎగిసి 1078 వద్ద ట్రేడ్ అయింది.

Gold Price Today: Yellow Metal Continues To Slide

బంగారు కొనుగోళ్లు

కేంద్ర బ్యాంకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) తన బంగారు కొనుగోళ్లను పెంచింది. తన విదేశీ మారక ద్రవ్య నిల్వలలో భాగంగా బంగారం కొనుగోళ్లను పెంచింది. 2021 క్యాలెండర్ ఏడాది మొదటి అర్ధ సంవత్సరంలో అంటే జనవరి నుండి జూలై మధ్యన భారత ఫారెక్స్ నిల్వల్లో బంగారం ఎక్కువగా ఉంది. అర్ధవార్షిక ప్రాతిపదికన 29 టన్నులను కొనుగోలు చేసింది. ప్రస్తుతం ఆర్బీఐ వద్ద ఉన్న ఫారెక్స్ నిల్వల్లో మొదటిసారి బంగారం 700 టన్నులు దాటింది. జూన్ 30వ తేదీతో ముగిసిన వారానికి ఆర్బీఐ వద్ద గోల్డ్ రిజర్వ్స్ 705.6 టన్నులుగా ఉంది. 2018 ఏడాది ప్రారంభంలో గోల్డ్ రిజర్వ్స్ 558.1 టన్నులుగా ఉంది.

English summary

Gold Price Today: ఆల్ టైమ్ గరిష్టంతో రూ.10,000 తగ్గిన బంగారం ధర | Gold Price Today: Yellow Metal Continues To Slide

Yellow metal prices continued with their downward trends in the domestic market as on the MCX, gold October futures were trading at ₹46,300, RS 42 down against the previous close.
Story first published: Thursday, August 12, 2021, 11:58 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X